ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ... ఇవే

ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ... ఇవే

Aug 19, 2020 - 10:18
Sep 23, 2020 - 13:08
 0
ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ...  ఇవే

SBI Health Policy 

ఎస్‌బీఐ ఆరోగ్య సంజీవని పాలసీ 

(గమనిక :  పాలసీ సంబదించిన పూర్తీ వివరములు దగ్గరలో ఉన్న బ్రాంచ్ లో గాని, వెబ్ సైట్ నందు తెలుసుకొనగలరు 

మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోగ్య సంజీవని పాలసీని అందిస్తోంది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI రూపొందించిన స్టాండర్డ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఇది. ఈ పాలసీని అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. మీరు ఏ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ పాలసీ తీసుకున్నా 'ఆరోగ్య సంజీవని' పేరుతోనే ఉంటుంది. మీరు ఎవరి దగ్గర తీసుకున్నా ఫీచర్స్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. మరి ఆరోగ్యానికి రక్షణతో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చే ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీ గురించి తెలుసుకోండి.


ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీ ప్రీమియం వివరాలు చూస్తే రూ.5,00,000 లక్షల పాలసీకి 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.4400 ప్రీమియం చెల్లించాలి. 35 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.5311 ప్రీమియం, 40 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి రూ.6181 ప్రీమియం చెల్లించాలి. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే ప్రీమియం కూడా పెరుగుతుంది. ఇక ఈ పాలసీ ద్వారా వచ్చే లాభాల వివరాలు చూస్తే రూమ్ రెంట్, బోర్డింగ్, నర్సింగ్ ఖర్చులను పాలసీ కవరేజీలో 2% లేదా గరిష్టంగా రోజుకు రూ.5,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐసీయూ, ఐసీసీయూ ఖర్చుల కోసం పాలసీ కవరేజీలో 5% లేదా రోజుకు రూ.10,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సర్జన్, అనెస్తెటిస్ట్, స్పెషలిస్ట్, బ్లడ్, మెడికల్ ప్రాక్టీషనల్, కన్సల్టెంట్ ఫీజులన్నీ కవర్ అవుతాయి. సర్జికల్ ఎక్యూప్‌మెంట్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఇందులో కవర్ అవుతాయి.

క్యాటరాక్ట్ చికిత్స కోసం ఒక పాలసీ సంవత్సరంలో పాలసీ కవరేజీలో 25% లేదా రూ.40,000 వరకు పొందొచ్చు. గాయాల కారణంగా దంత చికిత్స, ప్లాస్టిక్ సర్జరీ లాంటివి ఆరోగ్య సంజీవని పాలసీలో కవర్ అవుతాయి. అంబులెన్స్ ఖర్చులు గరిష్టంగా రూ.2,000 పొందొచ్చు. ఆయుర్వేం, యునానీ, సిద్ధ, హోమియోపతి లాంటి ఇన్‌పేషెంట్ ట్రీట్మెంట్ కూడా ఈ పాలసీలో కవర్ అవుతుంది. ముందే ఉన్న జబ్బులకు 48 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత పాలసీ కవర్ అవుతుంది. అందుకే పాలసీ తీసుకునే ముందే గతంలో ఉన్న జబ్బుల వివరాలన్నీ సరిగ్గా వెల్లడించాలి. ఇక మిగతా పాలసీల్లాగా 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. జాయింట్ రీప్లేస్‌మెంట్‌కు 48 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. రోడ్డు ప్రమాదాలకు ఈ వెయిటింగ్ పీరియడ్ వర్తించదు. ఇక ఆస్టియోఆర్థిరైటిస్, ఆస్టియోపోరోసిస్‌కు 48 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

ఎస్‌బీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ ఆరోగ్య సంజీవని పాలసీలో కో-పేమెంట్ క్లాజ్ ఉంటుంది. అంటే ఆస్పత్రిలో చేరినప్పుడు వైద్య ఖర్చుల్లో 5% పాలసీహోల్డర్ చెల్లించాలి. 95% ఇన్స్యూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఉదాహరణకు పాలసీహోల్డర్ ఆస్పత్రిలో చేరితే చికిత్స మొత్తానికి రూ.1,00,000 ఖర్చయితే పాలసీదారుడు రూ.5,000 చెల్లించాలి. రూ.95,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. 30 రోజుల ముందు ప్రీ-హాస్పిటలైజేషన్, 60 రోజుల పోస్ట్ హాస్పటలైజేషన్ ఖర్చుల్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow