యుకె లో బైటపడ్డ కొత్త తరహా కోవిడ్ వైరస్ 20 మందిలో గుర్తింపు

33 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ; చికిత్సలో ఉన్నవారి సంఖ్య మరింత తగ్గుదల, ప్రతి పది లక్షల్లో కేసులు, మరణాలు ప్రపంచంలో అతి తక్కువ నమోదైన దేశాల్లో భారత్ ఒకటి.

Dec 31, 2020 - 08:40
 0
యుకె లో బైటపడ్డ కొత్త తరహా కోవిడ్ వైరస్ 20 మందిలో గుర్తింపు

యుకె లో బైటపడ్డ కొత్త తరహా కోవిడ్ వైరస్ ను భారత్ లో మొత్తం 20 మందిలో గుర్తించారు. వీరిలో ఇంతకుముందే గుర్తించిన ఆరుగురు ( బెంగళూరు నిమ్హాన్స్ లో ముగ్గురు, హైదరాబాద్ సిసిఎంబి లో ఇద్దరు, పూణె ఎన్ ఐ వి లో ఒకరు) ఉన్నారు. 10 లాబ్ లో మొత్తం 107 శాంపిల్స్ పరీక్షించగా అందిన ఫలితాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.  

ఇప్పుడు కనబడుతున్న రెండో రకం కోవిడ్ విషయంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం భారత ప్రభుత్వం పది లాబ్ లతో కూడిన ఒక కన్సార్షియం ను ఏర్పాటు చేసింది.  అందులో ఎన్ ఐ బి ఎం జి ( కోల్ కతా), ఐ ఎల్ ఎస్ ( భువనేశ్వర్), ఎన్ ఐ వి ( పూణె),  సిసిఎస్ ( పూణె), సిసిఎంబి ( హైదరాబాద్), CCS Pune, సిడి ఎఫ్ డి (హైదరాబాద్), ఇన్ స్టెమ్ ( బెంగళురు), నిమ్హాన్స్ ( బెంగళూరు), ఐజిఐబి ( ఢిల్లీ), ఎన్ సి డిసి( ఢిల్లీ) ఉన్నాయి.  పరిస్థితిని చాలా నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు తగిన సలహా ఇస్తున్నారు. అదే సమయంలొ నిఘా పెంచటం, నియంత్రణ చర్యలు చేపట్టటం, పరీక్షలు జరపటం, శాంపిల్స్ ను ఈ కన్సార్షియంలోని  లాబ్స్ కు పంపటం జరుగుతోంది.

 

గత 33 రోజులుగా రోజువారీ వస్తున్న కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గడిచిన 24 గంటలలో  20,549 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ జరిగింది. అదే సమయంలో 26,572 మంది కొలుకున్నారు. దేసంలో ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య  98,34,141 కి చేరింది. ఇది ప్రపంచంలో అత్యధికం.  కోలుకున్నవారి శాతం కూడా 96 కు చేరువలో 95.99% గా నమోదైంది. కోలుకున్న వారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య తేడా  పెరుగుతూ ప్రస్తుతం 95,71,869 అయింది.

 

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 2,62,272 మంది కాగా వీరు మొత్తం పాజిటివ్ కేసులలో  2.56% మాత్రమే.  కొత్తగా కోలుకున్నవారి కారణంగా చికిత్సలో ఉన్నవారి సంఖ్య  6,309 మేరకు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు  ప్రతి పది లక్షల జనాభాలో భారత్ లో కేసుల సంఖ్య  అతి తక్కువ స్థాయిలో 7,423గా నమోదైంది.  రష్యా, ఇటలీ, యుకె, బ్రెజిల్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేసాలలో ప్రతి పది లక్షల జనాభాకు నమోదైన కేసులు ఎక్కువగా ఉన్నాయి.

కొత్తగా గడిచిన 24 గంటలలో కోలుకున్నవారిలో 78.44% మంది 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు.  మహారాష్ట్రలో ఒక్కరోజులోనే అత్యధికంగా 5,572 మంది కోలుకోగా,  కేరళలో 5,029 మంది, చత్తీస్ గఢ్ లో  1,607మంది కోలుకున్నారు.

కొత్తగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయినవారిలో 79.24%  మంది 10 రాష్ట్రాలకు చెందినవారు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా  3,018 కొత్త కేసులు, పశ్చిమ బెంగాల్ లో  1,244 కేసులు వచ్చాయి.

గడిచిన 24 గంటలలో 286 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వీరిలో 79.37% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా నిన్న  68 మంది మరణించగా పశ్చిమ బెంగాల్ లొ 30 మంది, ఢిల్లీలో 28 మంది చనిపోయారు.   

దూకుడుగా పెద్ద సంఖ్యలో కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరపటం వలన పాజిటివ్ కేసులను త్వరగా గుర్తించటం సాధ్యమవుతోంది. దీనివలన వేగంగా తీవ్ర లక్షణాలున్నవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించటం, స్వల్ప లక్షణాలున్న వారిని పర్యవేక్షిస్తూ ఐసొలేషన్ కు తరలించటం సాధ్యమైంది. అదే సమయంలో అందరికీ  ప్రామాణిక చికిత్సావిధానాలు వర్తింపజేయటం కూడా రోజుకు మరణాల సంఖ్యను 300 లోపు ఉండేట్టు చేయగలిగింది.   

 

దేశంలో రోజువారీ మరణాలు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. ప్రపంచంలో అతి తక్కువ స్థాయిలో దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో మృతులు 107 గా నమోదయ్యాయి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow