పొన్నూరు షార్ట్ సర్క్యూట్ ఇల్లు దహన బాధితులకు అండగా - యాదవ్ - గాదె : జనసేన

పొన్నూరు నియోజవర్గం చేబ్రోలు మండలం సుద్దపల్లి లో షార్ట్ సర్క్యూట్ వలన 3 ఇళ్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది.
ఈ విషయం తెలిసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీ శ్రీనివాస యాదవ్ గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు ఈ రోజు పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులను కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
భవిష్యత్తులో మీకు ఏమైనా సహాయం కావాలన్నా మేము ఉన్నాము అని ధైర్యం చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో చేబ్రోలు మండల అధ్యక్షులు శ్రీ రాములు గారు జిల్లా నాయకులు రామయ్య,నారిశెట్టి క్రిష్ణా, శివరామ క్రిష్ణా, శ్రీహరి,సత్యనారాయణ, గ్రామ అధ్యక్షలు మట్టుపల్లి భాను గార్లు నాయకులు,వీరమహిళల,జనసైనికులు పాల్గొన్నారు.
What's Your Reaction?






