అసలు గాయత్రీ లేదు అని చెబుతున్న మోహనరావు శర్మ . ఎవరు ఇతను
వేద బ్రహ్మ శ్రీ ఆచార్య మోహన రావు శర్మ అని పేరు మనం పలు మార్లు సోషల్ మీడియా వేదికగా చూసి వుంటాం . ఈయన గురించి సంక్షిప్త సమాచారం.

ఆచార్య తామాడ మోహనరావు శర్మ గారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో గల మందస అనే టౌన్ లో.కీర్తిశేషులు బ్రహ్మశ్రీ తామాడ జగ్గారావు ఆచార్య మరియు లక్ష్మీకాంతం అనే పుణ్య దంపతుల ప్రధమ సంతానాము గా జన్మించారు.
శివుడు ఎవరిని ధ్యానిస్తున్నాడు ,విష్ణువు, బ్రహ్మ ఎవరి జపం చేస్తున్నాడు - ఆచార్య మోహనరావు శర్మ
గోత్రము - ద్విజధర్మ గోత్రము .
ప్రవర - ద్విజధర్మ నిజధర్మ దేవసేన త్ర్యార్షేయ ప్రవర. సూత్రం - మైత్రాయిణీ సూత్రము శాఖ - కృష్ణయజుశ్శాఖ దండం - అశ్వథ్థ కుండము -చతుష్కోణ శాస్త్రం. - వ్యాకరణం వీరికి ఇద్దరు తమ్ముళ్లు కలరు. వారు భాస్కరరావు ఆచార్య మరియు ధనుంజయాచార్య. మోహనరావు గారి తండ్రి గారు 1987 లో శివైక్యముచెందినా వారి తల్లి గారు పిల్లలను మేనమామల సహాయసహకారములతో అత్యంత క్రమశిక్షణగా పెంచి విద్యాబుధ్దులు నేర్పించారు. మోహనరావు గారు 1993-94 సం.లో పదవతరగతి ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులైనారు.
తదుపరి వడ్రంగం పని చేసుకుంటూ,తమ్ముళ్ళను చదివించుకుంటూ ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైనారు. సోదరులతో కలిసి సొంతంగా కార్కాణా నిర్వహించేవారు.
ది.12/02/2003 న బొరంగి గ్రామమునకు చెందిన పాలతీర్థం గోత్రీకులైన బ్రహ్మశ్రీ దీనారావు,జమున దంపతుల కనిష్ఠ కుమార్తె కుమారి అను సుగుణ వతితో వివాహం జరిగినది. శ్రీశర్మ,కుమారి దంపతులకు 2004 సం.లో హర్షిత అను కుమార్తె, 2006 లో జ్యోతిరాధిత్య అను కుమారుడు కలిగిరి. శర్మగారు కులవృత్తికై బంగళూరు చేరిరి.
అక్కడ శిల్పవృత్తి పై ఆసక్తిగల శర్మ గారు సొంతంగా శిల్పం చేయడం ప్రారంభించారు. 2006 వ సం.లో బాబాయ్ బ్రహ్మశ్రీ పట్నాల భాస్కరాచార్య గారి ద్వారా డా.జ్ఞానానంద అనే గొప్ప శిల్పశాస్త్రవేత్త గారి ద్వారా BVA కోర్సు పూర్తిచేసారు.
శర్మ గారి వంశ వృత్తి రాజసంస్థాన పరంపర అయో శిల్పము. కానీ ఇప్పుడు శర్మ గారు దారుశిల్పము మరియు శిలాశిల్పముచేయుచు " స్థపతి" అయ్యారు.
మోహనరావు శర్మ గారు విగ్రహాలు రచన (తయారీ), దేవాలయాల నిర్మాణం మరియు రథనిర్మాణములను వేదోక్త శిల్పశాస్త్రానుసారము చేయగల సమర్దులు.
శిల్పశాస్త్రతాళమానము అనుసరించి చిత్రలేఖనము అనగా రేఖాచిత్రం మరియు తైలవర్ణ చిత్రాలను కూడా వేయుదురు. ఇందులో కూడా శిల్పకళాఅకాడెమీ కర్ణాటకగవర్నమెంట్ వారి నుంచి ప్రశంసాపత్రాలను అందుకొని ఉన్నారు. శిల్పకళ అకాడమీ కర్ణాటక గవర్నమెంట్ వారు నిర్వహించిన పెక్కు శిలా శిల్పశిబిరాలు, దారు శిల్ప శిబిరాలు, శాస్త్రీయ తైలవర్ణ చిత్రరచనా శిభిరాలలో పాల్గొని ప్రశంసాపత్రాలను పొంది ఉన్నారు.
అలాగే మోడరన్ పెయింటింగ్ లలో కూడా ప్రశంసాపత్రాలను పొంది ఉన్నారు. శ్రీ మోహనరావు శర్మ గారు ఈ శాస్త్రాధ్యయనము వారి యొక్క వివాహానంతరము బెంగళూరు వచ్చిన తరువాత జరిగింది. అలా అధ్యయనము, సాధన చేయుచూ బెంగళూరులోనే స్థిర పడ్డారు. వీరి గురువులు వేదబ్రహ్మశ్రీ డా.జి.జ్ఞానానందులవారు.
మొట్టమొదట డాక్టర్ జి జ్ఞానానంద వారి బ్రహ్మర్షి శిల్ప గురుకులం ,నంది,చిక్కబల్లాపురం లో బి .వి .ఏ .ప్రతిమా శిల్పం డిగ్రీ చేశారు. వేదములను,, వైశ్వకర్మణ సాహిత్యాన్ని చక్కగా పరిశోధనా కోణంలో అధ్యయనము చేసారు. తర్వాత బెంగుళూరు యూనివర్సిటీ లో వీరి గురువుగారు గురుకులంలో బి .ఎఫ్ .ఎ ట్రెడిషనల్ స్కల్ఫ్చర్ మరియు బి.ఎఫ్.ఎ టెంపుల్ ఆర్కియాలజీ డిగ్రీ లను పూర్తి చేశారు.
అందులో భాగంగానే ఆటోకేడ్ త్రీడీ వరకు కంప్యూటర్ కోర్సులను అవపోసన పట్టారు. కర్ణాటక శిల్పకళ అకాడమీ వారు శ్రీ మోహనరావు శర్మ గారికి 2010 సం. లో ఒక గురుకులము ను ఇచ్చి అందులో వారిని ప్రొఫెసర్గా నియమించారు.
ఆ గురుకులంలో శిల్ప శాస్త్రము, ఆగమము, సంస్కృతము ,చిత్రలేఖనము, విగ్రహ రచన అనగా ప్రాక్టికల్ అండ్ థియరీ శ్రీ మోహనరావు శర్మ బోధిస్తూ రెండు బ్యాచ్ లకు అనగా ఆరు సంవత్సరములు గురుకులమును సమర్థవంతంగా నడిపించారు.
తరువాతకాలంలోప్రభుత్వంమారటం ఈ గురుకులాలను తీసేయటం జరిగింది. ఇంకా శ్రీ శర్మ గారు జ్యోతిష్యంలో జ్యోతిష్య ప్రవేశ ,జ్యోతిష్య ప్రవీణ, జ్యోతిష్య విశారద ,జ్యోతిష్య విద్వాన్ అనే డిగ్రీలు కూడా చేశారు.
తరువాత నాడీ జ్యోతిష్యం ప్రత్యేకసబ్జెక్ట్ లో పౌండేషన్ మరియు నాడి పండిట్ చేశారు. తర్వాత వాస్తు ప్రవీణ కూడా చేశారు. శర్మ గారి గురువు గారు నిర్వహించిన శిల్ప శిబిరాల్లోనే బళ్లారికి చెందిన తాడిచర్ల వీర రాఘవ శర్మ గురువు గారి వద్ద పురోహితం కూడా నేర్చుకున్నారు. ప్రస్తుతం శ్రీ మోహనరావు శర్మ గారు దారు ,శిలా శిల్పములు చేసే శిల్ప శాల నిర్వహిస్తూ మరియు జ్యోతిష్యం వాస్తు నిపుణులు గా పురోహితులు గా విధులను నిర్వహిస్తున్నారు.
శ్రీ మోహనరావు శర్మ గారు ప్రస్తుతం వేద విద్యను శిల్ప శాస్త్రములను జ్యోతిష శాస్త్రము వాస్తు శాస్త్రము క్షుణ్ణముగా అధ్యయనం చేసి, తత్సంబంధ విద్యార్హత పత్రములను పొంది , ప్రస్తుతంబెంగళూరులోఉండి కర్నాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విశ్వబ్రాహ్మణులను ఆచారజాగృతీకరణ చేయుటకు ఉధ్యమించినారు.
శ్రీ మోహనరావు శర్మ గారు " *శిల్పము ౼వేదవిజ్ఞానము - బ్రాహ్మణత్వము** " అనే శీర్షికతో శిభిరాలు మన మఠాధిపతిలు ,మరియు మనకుల సంఘీయుల సహాయంతో నిర్వహించుచున్నారు. గత మూడుసంవత్సరాల క్రితం గాయత్రి మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శ్రీకాంతేంద్ర స్వాముల ఆధ్వర్యంలో చింతల్, హైదరాబాదులో ఒక వైశ్వకర్మణ జాగృతీ కరణ శిబిరాన్ని నిర్వహించడం జరిగినది.
సంక్షిప్తంగా శ్రీ మోహనరావు శర్మ గారి యొక్క సాధన* :- స్థపతి *దేవాలయ శిల్పము , *దేవాలయ రచన , *ఆయాది ganitham, *మూర్తి శిల్పము, *ప్రతిష్ట విధానము, *భూశుద్ధి , * శిల - లోహం - వృక్ష సంగ్రహము, *ప్రాణ ప్రతిష్ట లు *జ్యోతిష్యం *నాడీజ్యోతిష్యము *వాస్తుశాస్త్రం లో నిపుణుత * పౌరోహిత్యము * మొదలైనవి నిర్వహించగలరు. * *ఇదంతా సర్వస్య సృష్టికర్త విశ్వకర్మ భగవానుని అనుగ్రహముతోనే సాధ్యమైనదంటారు ఈ మోహనరావు శర్మ .
బెంగళూరులో వారి ఏరియాలో చాలా మంది కి వీరు శిల్పకళ, శిల్పం చేస్తున్నట్లు తెలుసు.
అదేసమయంలో శర్మ గారి యొక్క నిత్యానుష్టాన సంధ్యావందనము ,నిత్యాగ్ని హోత్ర ఆచరణములు అందరూ గమనిస్తూ ఉంటారు. శ్రీ మోహనరావు శర్మ గారిని పేరుపెట్టి పిలిచేవారే లేరంటే అతిశయోక్తి కాదు. అందరూ అయ్యనోరు ,గురుగళు ,స్వామిగళు,బుద్ధి అని కన్నడ పరిభాషలో పిలుస్తూ గౌరవిస్తారు.
మంచి చెడులకు శుభముహూర్తములు , వాస్తు విషయ కార్యక్రమములు మరియు పురోహిత కైంకర్యము లకు ప్రజలు సంప్రదిస్తూ ఉంటారు. శర్మ గారి శ్రీమతి గారు కూడా పూజ సమయంలో వ్రతాచరణ లో మడి చీర ధరించి బ్రాహ్మణ్యం మును పాటిస్తారు.
వారి వీధిలో ముఖ్యమైన ముత్తైదువు. శర్మ గారి అబ్బాయి కూడా నిత్యము సంధ్యావందనం చేయుచూ శిఖను విడిచి పెట్టి శిఖముడిని వేసుకుంటూ భస్మ ధారణతో నుదుటి బొట్టు తో స్కూల్ కి వెళ్తాడు. శర్మ గారి అమ్మాయి కూడా నిత్యం పూజ పురస్కారాలతో వాళ్ళ అమ్మగారిని అనుసరిస్తూ ఉంటారు.
వీరి ఇంటికి గురువులు స్వామీజీలు లు గొప్ప వ్యక్తులు అందరూ తరచూ వస్తుంటారు అని స్థానికులు చెబుతుంటారు. గురువులను స్వాములను పూజిస్తూ అథిది సత్కారములతో వారు గృహస్థ ధర్మము నిర్వహిస్తూ బెంగళూరులోనే శిల్ప వృత్తి , శిల్ప శాస్త్ర బోధకుడిగా, జ్యోతిష్య వాస్తు విద్వాంసుడిగా, ఉన్న దాంట్లో గౌరవంగా జీవనం సాగిస్తున్నారు.
శర్మ గారి ప్రాంతములో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరు *బీసీ* కేటగిరి గురించి మాట్లాడరు.మొదట్లో వీరిని అయ్నోరు అయి ఉండి శిల్పం చేస్తున్నారే అని అడిగే వాళ్ళు. వాళ్లందరికీ శిల్పము వైదికవిద్య అని యు వైశ్వకర్మణ బ్రాహ్మణ విద్య అనియు వారికి బోధించడం జరిగినది.
శర్మ గారి వీధిలోనే ఔర్వర్షేయ బ్రాహ్మణులు కూడా ఉంటారు. వారు కూడా మీరి కార్యక్రమములకు మమ్మల్ని కలుపుకోండి అని వారి కార్యక్రమమునకు శర్మ గారిని కూడా రమ్మని చెబుతూ ఉంటారు.
శర్మ గారు వైశ్వకర్మణులని వారికి తెలుసు. మన అందరం కూడా మన వైదిక ఆచారాన్ని కుటుంబ సమేతంగా పాటిస్తే మనకు రావాల్సిన గౌరవం కచ్చితంగా అందరికీ వస్తుంది అని నమ్మే అనుష్ఠాన పరులు శ్రీ శర్మ గారు 9నెలల క్రితం హిమాలయాలకు శ్రీ శర్మ గారి జగద్గురువు శ్రీ శ్రీ శ్రీ శివాత్మానందసరస్వతీ స్వాములవారితో ఇరవై రోజుల కొరకు శివలింగాన్ని ప్రతిష్టించుటకై వెల్లియుంటిరి.
అక్కడి ఉత్తరాఖండ్ పౌరోహితులు వీరి యెక్క అనుష్ఠానముయొక్క నిష్ఠ మరియు నిత్యాగ్నిహోత్ర ఆచరణ గమనించిన వారై నవరాత్రులు సందర్భంగా జరిపిన చండీయాగానినికి హోత్రుడుగా బ్రహ్మస్థానమును ఇచ్చి గౌరవించడం జరిగింది. ఆసందర్భమున వారు -"
మీరు విశ్వకర్మ బ్రాహ్మణులు బృహస్పతి వంశీకులు అయిన స్థపతులు కనుక ఆస్థానానికి మీరే అర్హులైన వారు ".
అని అందరి సమక్షంలో పలికారు. ౹౹ధర్మో రక్షతు రక్షితః౹౹ అనగా ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది.
కనుక మనజాతీయులందరకీ నాయొక్క మనవి ఏంటంటే -- ప్రతిఒక్క వైశ్వకర్మణుడు విధిగా సంధ్యానుష్ఠానము, వేషభూషణ మాటతీరు వైదిక మార్గాన్ని అవలంభించిన ప్రజలు అటువంటి వారిని దైవసమానులుగా గౌరవ ప్రపత్తులతో ఆదరింతురు .
అంటారు శ్రీ శర్మ గారు. శ్రీ మోహనరావు ఆచార్యుల యొక్కసాహిత్య సేవ 1.మహేంద్ర మోక్షం అనే వైదికపరమైన అంశముల ఇతిహాసము తో ఒక గ్రంధాన్ని రచించారు. 2. విశ్వకర్మ వైదిక వ్రత విధానము 3 విశ్వకర్మ యాగం 4. వైదిక సంధ్యావందన విధి 5 యజ్ఞోపవీత ధారణ మరియు భోజన విధి 6 వేదాలలో అద్వైతులు అయిన వైశ్వకర్మణుల చరిత్ర. 7. నిత్యఆగ్నిహోత్రము (సంక్షిప్త మరియు సంపూర్ణ) 8 స్వర్ణశిల్పశాస్త్రము.
ఈ గ్రంథములు తెలుగు మరియు కన్నడ భాషలలో అచ్చు వేయుటకు హస్త ప్రతులు సిద్ధము చేయుచున్నారు. ఇందులో కొన్ని పూర్తయినవి. కొన్ని కరెక్షన్స్ దశలో స్వర్ణశిల్పశాస్త్రం ప్రారంభ దశలో ఉన్నది.
2017 ఏప్రిల్ 30 న శర్మ గారి గురువుగారైన వేదబ్రహ్మశ్రీ డాక్టర G జ్ఞానానందుల వారు నిర్వహించిన విశ్వకర్మ కోటి జప యజ్ఞం అనే బృహత్కార్యం లో ఒక ప్రత్యేక పాత్రను పోషించారు. శ్రీ ఆచార్యుల వారి సంకల్పం ఇలా ఉంది.. నేను నేర్చుకున్న మరియు అధ్యయనం చేసిన వేదములు ఉపనిషత్తులు ధర్మశాస్త్రములు శిల్ప శాస్త్రం జ్యోతిష్య వాస్తు శాస్త్రముల జ్ఞానము ద్వారా పరమాత్మ విశ్వకర్మ తత్వాన్ని దర్శించుకున్నాను.
ఈ నా యొక్క జ్ఞానము నా జాతికి ఉపయోగపడాలని నిత్యము ఆరాటం మరియు తపన పడుతూ ఉంటాను. ఇవన్నియు నా జాతీయుల కు మరియు ప్రజలకు బోధించేందుకు నాకు ఒక వేదిక రూపంలో అవకాశం దొరకాలని తద్వారా విశ్వబ్రాహ్మణ పునర్వైభవం తీసుకువచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేసి మన వాళ్లందర్నీ తీర్చిదిద్ది ఇతర సార్వజనీకులు విశ్వబ్రాహ్మణులే నిజమైన బ్రాహ్మణులు అని పలికేలా తయారు చేయగలం అని నామీద నాకు ప్రగాఢ విశ్వాసము కలదు. ఇందుకై నాకు ఒక వేదిక అవసరం ఉంది.
ఆ వేదిక మఠము అనుకోనివ్వండి పీఠమును అనుకోనివ్వండి దానిద్వారా అనగా దాన్ని కేంద్రంగా చేసుకుని వైదిక ధర్మం ప్రచారముకై ఊరూరు సంచారం చేయవలెనని నాయొక్క ధ్యేయము.
నాయొక్క ప్రవచనములు బోధనలు విశ్వబ్రాహ్మణుల కే కాకుండా ఇతరులకు కూడా చేరేలా ప్రయత్నం చేస్తుంటాను అప్పుడే వేదాలలో, శిల్ప శాస్త్రాలలో , జగత్సృష్టి నిర్మాణకర్తలైన భారతీయ సనాతన వైజ్ఞానికులైన పరమాత్మవిశ్వకర్మ యొక్క వంశీకులైన విశ్వబ్రాహ్మణులను గుర్తించి గౌరవ భక్తి ప్రపత్తులతో సర్వజనీకులందరూ కూడా ఆదరించి తదనుగుణ ఉచిత మైన నా స్థానాన్ని ఇస్తారు. పరిణామము ఈ జన్మలో నేను తిలకించాలని ప్రగాఢమైన కోరిక కలదు.
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు గాయత్రీ మఠాధిపతులు శ్రీకాంతేంద్ర స్వామివారి ఆద్వర్యంలో నిర్వహించిన "వైశ్వకర్మణ ఆచార జాగృతి కరణ శిబిరంలో" ఉత్తమ శిల్ప విద్య బోధక అనే బిరుదును కూడా ప్రదానం చేసి ఉన్నారు. కర్నాటక శిల్పకళా అకాడమీ ద్వారా సుమారు 15 కు పైగా ప్రశంసా పత్రములు పొంది ఉన్నాను.
విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారు జాతీయ స్థాయిలో విశ్వకర్మ లెజెండరీ అవార్డును కూడా హైదరాబాదు రవీంద్ర కళాక్షేత్రంలో శ్రీ శ్రీ శ్రీ శివాత్మానంద సరస్వతి స్వాముల చేతులమీదుగా సకల జనులు చూస్తుండగా ఘనంగా సన్మానించి ఆవార్డును ప్రధానం చేశారు విజయవాడలో విడుదలైన తెలుగు శిల్పుల వైభవం అను గ్రంథం లోకార్పణ సమయంలో శిల్ప విద్య, వేద శాస్త్ర పారంగతులు అయి అనుష్ఠాన , ఆచారవంతులైన ఒక స్థపతి ని సన్మానం చేయవలెనని నిర్ణయించుకుని నన్ను విజయవాడకు ఆహ్వానించి పుష్పాభిషేకం తో వస్త్ర ఫల దక్షిణ తాంబూలాదులతో ఘనంగా సన్మానం చేసి బ్రహ్మశ్రీ తుమ్మోజు రామలక్ష్మణచార్యులు రచించిన "అభివందన వచసౌగంధికాసుమ స్రజము" అనే పత్రమును విశ్వ జ్యోతి ఫౌండేషన్ మరియు సంపాదక మండలి ద్వారా బ్రహ్మశ్రీ అప్పల భక్తుల శివకేశవరావు గారు, గ్రంథ కర్త అయిన ఈమని శివనాగిరెడ్డి గారు , జవ్వాది కూర్మ చార్యులు తదితర విశ్వబ్రాహ్మణ ప్రముఖుల చేతుల మీదుగా సమర్పించారు.
తరువాత "శ్రీ వీరబ్రహ్మేంద్ర దేశీయ విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ మరియు అడవికొలను చారిటబుల్ ట్రస్ట్" విశాఖపట్నం వారిచే Fascilition on his good service to Vishva bhraman community Intext more and tribute to his great and good service in our community to Vishva bhraman and Vishwakarma. Ine recognization achievements in the green field contribution to our collective and sacrifices made for our common well being. అని ఒక ప్రశంసా ఫలకము ను సన్మాన పూర్వకంగా బహుకరించారు.
శ్రీ శర్మ గారు వైశ్వకర్మణులకు వచ్చు సందేహములు తీర్చుచూ, వారిని పూర్వ ఆచార వ్యవహారములవైపు నడిపించగల శక్తి విశ్వకర్మ భగవానుడు వారికిచ్చి, సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యములిచ్చి అనునిత్యం వారి వెంట ఉండాలని సభక్తంగా కోరుకొనుచున్నాను. అంటూ వారి మాటల్లోనే MDN ప్రతినిధి తో సానుకూల గా స్పందించారు.