ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసిన ప్రజలు ఫ్యాన్ వేసుకోవాలన్నా బెంబేలెత్తిపోతున్నారు - కొర్రపాటి
వై సిపి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసిన ప్రజలు ఫ్యాన్ వేసుకోవాలన్నా బెంబేలెత్తిపోతున్నారు విద్యుత్ చార్జీలు తగ్గించాలి మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్.

వైసిపి అధికారం లోకి వచ్చినప్పటి నుండి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలను తీసుకుంటోందని విద్యుత్ ధరలు భారీగా పెంచడంతో వైసిపి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసిన ప్రజలు ఫ్యాన్ వేసుకోవాలన్నా బెంబేలెత్తిపోయేలా కరెంటు బిల్లులు వస్తున్నాయని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ లో 400 యూనిట్ల లోపు వినియోగానికి కేవలం 4.5రూ,1200 యూనిట్ల కు పైన అత్యధికంగా కేవలం 8 రూపాయలు ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అస్తవ్యస్త స్లాబ్ లతో కేవలం 226 నుండి 400 యూనిట్లకే 8.75 రూ, 400 యూనిట్ల పైన 9.75 రూ అత్యధికంగా వసూలు చేస్తున్నారని.
పేద మధ్యతరగతి మాత్రమే కాక అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దేశంలో సుమారు 20 రాష్ట్రాల వరకు అతి తక్కువకే విద్యుత్ ధరలు 5 నుండి 6 రూ కే అందిస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారికి నిజంగా ప్రజల పై ప్రేమ ఉంటే విద్యుత్ ధరలను తగ్గించాలని .
డొమెస్టిక్ కు 400 యూనిట్ల లోపు 3రూపాయలుగా ఆ పైన 5 రూ లోపుగా తగ్గించి ప్రజలపై భారం కలుగకుండా చూడాలని ఎస్సీ ఎస్టీ లకు 200 యూనిట్ల ఉచిత సబ్సిడీ పథకం అమలు చేయాలని లేకపోతే 175 సీట్ల గెలవాలని పగటి కలలు కంటున్న వైకపాకు ప్రజాగ్రహానికి ఫ్యాన్ గుర్తు వెనక్కి తిరిగి కనీసం 75 సీట్లు కూడా రావని కొర్రపాటి హితవు పలికారు.
What's Your Reaction?






