అందుబాటులోకి లెర్నింగ్ లైసెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ట్లు

Jul 14, 2021 - 18:22
 0
అందుబాటులోకి లెర్నింగ్ లైసెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ట్లు

*ఉప రవాణా కమిషనర్ కార్యాలయం,గుంటూరు*  
*అందుబాటులోకి లెర్నింగ్ లైసెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ట్లు*       

దరఖాస్తుదారుల డిమాండ్ మేరకు జిల్లాలోని మంగళగిరి,తెనాలి, బాపట్ల,చిలకలూరిపేట, మాచర్ల మరియు పిడుగురాళ్ల రవాణాశాఖ కార్యాలయాల్లో ప్రతిరోజు 60 లర్నింగ్ లైసెన్స్ స్లాట్ లు 120 డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ లు,నరసరావుపేట ఆర్టీవో కార్యాలయంలో 100 లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ లు 200 డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ లు గుంటూరు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో 150 లర్నింగ్ లైసెన్స్ స్లాట్ లు 300 డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ లు 15-7-2021 నుండి  అందుబాటులోకి తీసుకు రావటం జరిగిందని ని ఉప రవాణా కమిషనర్ ఈ  మీరా ప్రసాద్ తెలిపారు. 

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  కోరారు. 

దరఖాస్తుదారులు ఆఫీస్ కి వచ్చినప్పుడు విధిగా మాస్కు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించవలెను అన్నారు.మాస్క్ ధరించని వారికి కార్యాలయం లోనికి  అనుమతి నిషేధించ బడినది.        

ప్రజా రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు మరియు ప్రయాణికులు విధిగా మాస్కులు ధరించి వలెను. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును. 

ఇట్లు                             
ఈ. మీరా ప్రసాద్.

ఉప రవాణా కమిషనర్ గుంటూరు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow