నిరవధిక సమ్మె చేస్తున్న వి ఆర్ ఎ లకు బీఎస్పీ మద్దతు కొల్లాపూర్

గ్రామాలకు వెన్నుముక అయినటు వంటి వీఆర్ఏ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిండు అసెంబ్లీలో చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తరతరాలుగా వీఆర్ఏలు వెట్టిచాకిరి చేస్తున్నారని వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని చెప్పారు ,

నిరవధిక సమ్మె చేస్తున్న వి ఆర్ ఎ లకు బీఎస్పీ మద్దతు  కొల్లాపూర్

చిన్నంబావి మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న వి ఆర్ ఎ లకు బీఎస్పీ మద్దతు  కొల్లాపూర్ - కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండల కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సమ్మెను ఉద్దేశించి బి ఎస్ పి అసెంబ్లీ అధ్యక్షుడు ముని స్వామి మాట్లాడుతూ.

గ్రామాలకు వెన్నుముక అయినటువంటి *వీఆర్ఏలకు* రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిండు అసెంబ్లీలో చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తరతరాలుగా వీఆర్ఏలు వెట్టిచాకిరి చేస్తున్నారని వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని చెప్పారు ,

పే స్కేల్- జీవోను వెంటనే విడుదల చేయాలని కోరారు.55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులు అందరికీ ఉద్యోగం ఇస్తూ, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో *బహుజన్ సమాజ్ పార్టీ* ఆధ్వర్యలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు గ్రామ గ్రామాన చేపడతామని హెచ్చరించారు. వీఆర్ఏలకు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

చిన్నంబాయి మండల ఇన్చార్జి దేవని రాజు మాట్లాడుతూ, వీఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని, చిన్నంబావి మండలం లో సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు ప్రతిరోజు వాళ్ళ సాధకబాధకాలలో పాలుపంచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నంబాయి మండల కన్వీనర్ బి.రమేష్, బేక్కేమ్ గ్రామ అధ్యక్షుడు DN కృష్ణ, కురుమయ్య, బాలకృష్ణ,రామకృష్ణ బాలు,సాయి కుమార్, ప్రకాష్, రవి తదితరులు పాల్గొన్నారు.

 BSP Nagarkurnool District - నాగర్ కర్నూల్ జిల్లా, BSP Kollapur Constituency.