నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం రాస్తారోకో - డేగల బాబు మాదిగ

డేగల బాబు మాదిగ ఆధ్వర్యంలో నిరసన, నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం రాస్తారోకో చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం లో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ గతంలో మా ప్రభుత్యం వస్తే 100 రోజులకే ఎస్సీ వర్గీకరణ చేస్తామని తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు - డేగల బాబు మాదిగ . కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయింది అయినా SC వర్గీకరణ గురించి ఇంత వరకు ఏమి మాట్లాడలేదు.

Jul 16, 2022 - 19:56
 0
నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దగ్ధం రాస్తారోకో - డేగల బాబు మాదిగ

డేగల బాబు మాదిగ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఉద్యమఆశయాల మేరకు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం పెదకాకాని సెంటర్లో శనివారం ఉదయం 10:00 గంటలకు  అంబేద్కర్ బొమ్మ దగ్గర నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం రాస్తారోకో జరిగింది.

డేగల బాబు మాదిగ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ , కేంద్ర ప్రభుత్వం లో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ  గతంలో మా ప్రభుత్యం వస్తే 100 రోజులకే ఎస్సీ వర్గీకరణ చేస్తామని తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు.

కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయింది అయినా SC వర్గీకరణ గురించి ఇంత వరకు ఏమి మాట్లాడలేదు.

అంతే కాకుండా జులై 3 న నిర్వహించిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా మాదిగలు ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరారు, అందుకు కారణంగా బిజెపి కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణ అడిగిన మాదిగలపై దాడి చేశారు, ఈ  విషయం మీడియా ముఖం గా , మరియూ  సోషల్ మీడియా లో కూడా విస్తృతం గా ఈ  వీడియో లు ప్రచారం అయ్యాయి .

కేంద్ర ప్రభుత్వం మాదిగలకు మాటిచ్చి ఇలా మోసం చేయడం ఎంతో బాధాకరమైన విషయం అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తూ, పోరాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించాలని గుంటూరు జిల్లా MRPS నాయకులు వెల్లడించారు .

Burning effigy of Narendra Modi, Rastaroko - Degala Babu Madiga,

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow