భయపడకండి , ప్రభుత్వం- నగర పాలక సంస్థ లు సదా మీ సేవ లో -పి. నమ్రత్
రోగ లక్షణాలు ఉన్నప్పుడు, వైద్య సహాయం - సలహా, కచ్చితంగా అవసరం, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం, మరియు గుంటూరు జిల్లా నగర పాలక సంస్థ, మరియూ జిల్లా కలెక్టర్ గారు.. అందరూ ప్రజల సేవ కోసం 24 గఁ. సిద్ధంగా ఉన్నారు. ప్రజలు సహకరించాలి.. భయపడకండి - మన ప్రభుత్వం మీ కోసం అన్ని సేవలు అందు బాటు లోకి తెచ్చింది ..కరోనా చికిత్స ఇంట్లోనే- సురక్షితం ,

భయపడకండి - మన ప్రభుత్వం మీ కోసం అన్ని సేవలు అందు బాటు లోకి తెచ్చింది ..కరోనా చికిత్స ఇంట్లోనే- సురక్షితం ,
(DOnate to MDN NEWS -- google pay or phone pay ,UPI -- santhosh2116@oksbi )
80శాతం ఇంట్లోనే వైద్యం తీసుకోవచ్చు!
15శాతం ఆస్పత్రిలో లేదా అవసరాన్ని బట్టి ఐసీయూలో చికిత్స అవసరం పడవచ్చు!
5శాతం ఆస్పత్రిలో కృత్రిమ శ్వాస అవసరం అవుతుంది.
కరోనా మీద పట్టు పెరిగింది. ప్రారంభంలో వైరస్ తత్వాన్ని కచ్చితంగా అంచనా వేయడంలో తడబాటు పడినా, క్రమేపీ వైరస్ తత్వం, తీవ్రతలను బట్టి చికిత్సను అందించే మెలకువలు అలవరుచుకున్నాం. కాబట్టే కోలుకునే వారి సంఖ్య పెరగడంతో పాటు, వెంటిలేటర్ అవసరాన్నీ తగ్గించుకోగలిగాం. అయితే కరోనా వైరస్ పట్ల భయాలను వదిలి, వైద్యుల సూచనలను తూచ తప్పక పాటిస్తూ, చికిత్సను తీసుకోగలిగితే ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి నుంచి చాకచక్యంగా తప్పించుకోవచ్చు.
80శాతం మందికి ఆస్పత్రి చికిత్స అవసరం లేదు
కరోనా పట్ల ఉన్న భయం కారణంగా, స్పల్ప లక్షణాలు కనిపించగానే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీనివల్ల ఎవరికైతే ఆస్పత్రి చికిత్స అవసరమో, వారికి బెడ్స్ కొరత ఏర్పడుతోంది. నిజానికి కరోనా సోకిన 80శాతం మంది ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు.
ఊపిరి అందకపోతుంటే, ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి చేరుకోవాలి. వీరికి మొదట వైద్యులు ఆక్సిజన్‌ను అందిస్తారు.
మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కరోనా సోకినట్టు నిర్థారణ అయిన వెంటనే ఆస్పత్రులకు పరుగులు పెట్టవలసిన అవసరం లేదు. వీరికి ఆయాసం లాంటి తీవ్ర లక్షణాలు లేకుంటే, ఇంటి నుంచే కరోనా చికిత్స పొందవచ్చు. ఇంటిపట్టునే ఉండి, సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ వైద్యులను ఆన్‌లైన్‌లో సంప్రతిస్తూ, చికిత్సతో కరోనా నుంచి కోలుకోవచ్చు.
అరవై ఏళ్లు దాటిన పెద్దలు, నిర్లక్ష్యం చేయకూడదు. ఉమ్మి, కళ్లెలో రక్తం పడుతున్నా అప్రమత్తం కావాలి. ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉన్నా, చమటలు పడుతున్నా ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి చేరుకోవాలి.
కరోనా వైరస్ లక్షణాలు ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు, పొట్టలో నొప్పి, అయోమయం, ఛాతీలో నొప్పి, నీరసం, ఆయాసం, వాసన, రుచి తెలియకపోవడం, ఆకలి మందగించడం... ఈ లక్షణాలు ఉంటే వారిలో వైరస్ త్వరితంగా పెరుగుతోందని అర్థం. అయితే అందరిలో ఇవన్నీ ఉండకపోవచ్చు. రెండు వేర్వేరు లక్షణాలు కలిసి ఉండవచ్చు. అలాగే ఈ లక్షణాలలో ఛాతీలో బరువు, ఆయాసం, అయోమయానికి లోనవడం, శరీరం నీలంగా మారడం లాంటి తీవ్రమైన లక్షణాలు ఉంటే, ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి.
స్వల్ప లక్షణాలు ఉంటే, హోమ్ ఐసొలేషన్‌లో ఉండి, యాంటీవైరల్, యాంటీబయాటిక్ మందులు తీసుకోవాలి. జింక్, విటమిన్ సి, డి సప్లిమెంట్లు తీసుకోవాలి. వీటితో పాటు లక్షణాలు తీవ్రం కాకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన మందులతో పాటు, యాంటీ హిస్టమిన్ కూడా తీసుకోవడం అవసరం. వాలంటీర్లు, GMC, COLLECTORATE, GGH HOSPITALS, లు అన్నీ పూర్తి స్ధాయిలో మన రాష్ట్రం లో అందుబాటులో ఉన్నవి.
కరోనా లక్షణాలు మొదలైన ఐదు లేదా ఆరవ రోజు నుంచి వీరిలో తీవ్ర లక్షణాలు తలెత్తే అవకాశాలూ ఉంటాయి. కాబట్టి క్రమం తప్పక పల్స్ ఆక్సీమీటరు, థర్మామీటరుతో ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకుంటూ ఉండాలి, తక్షణ వైద్య చికిత్సలు అవసరం,
కరోనా సోకిందనే భయంతో లక్షణాలు లేనివాళ్లు, స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఆస్పత్రులకు పరుగులు తీయడం సరికాదు. కాబట్టి వైద్యుల సూచనల మేరకు ఇంటి నుంచే చికిత్స తీసుకోవాలి.
ప్లాస్మా మార్పిడి ఉపయోగకరమే! కానీ అధి మాస్ స్ధాయిలో అందుబాటులోకి రావడం. చాలా వ్యయం తో కూడు కున్న పని. జాగర్త అవసరం.
కరోనా సోకిన వారి శరీరంలో యాంటీబాడీల సంఖ్య తగ్గిపోవడం సహజం. వాటిని భర్తీ చేయడం కోసం కరోనా ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మాను మార్పిడి చేసే చికిత్స అనుసరిస్తున్నారు. ఈ విధానం ద్వారా యాంటీబాడీలు కొంతమేరకు కరోనా వైరస్‌తో పోరాడి వ్యాధిని అదుపుచేయగలుగుతాయి.
(DOnate to MDN NEWS -- google pay or phone pay ,UPI -- santhosh2116@oksbi )
What's Your Reaction?






