అభ్యర్థుల వ్యయ పరిమితులు పెంచిన భారత ఎన్నికల కమిషన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం లేఖ

ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల సమయంలో చేసే ఖర్చులు పెరగటంతో భారత ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ఖర్చు పెంచిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం 08.01.2022 భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ కు లేఖను ...

Jan 8, 2022 - 07:08
Jan 8, 2022 - 07:10
 0
అభ్యర్థుల వ్యయ పరిమితులు పెంచిన భారత ఎన్నికల కమిషన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం లేఖ

08.01.2022..చిలకలూరిపేట.. నవతరంపార్టీ. .

నం. ECI/PN/02/2022 తేదీ జనవరి 06, 2022 న ఎలక్షన్ కమిషన్ ఆ ఇండియా అభ్యర్థి ఖర్చుల పరిమితులు మెరుగుపరచబడ్డాయి అని ప్రెస్ నోట్ విడుదల చేశారు.అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిలో చివరి ప్రధాన సవరణ 2014లో జరిగింది అని, ఇది 2020లో 10% పెరిగింది అని,2014 సమయంలో ఎన్నికల సంఘం రిటైర్డ్ ఐ ఆర్ ఎస్ అధికారి శ్రీ హరీష్ కుమార్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ లో శ్రీ ఉమేష్ సిన్హా, సెక్రటరీ జనరల్ మరియు శ్రీ చంద్ర భూషణ్ కుమార్, భారత ఎన్నికల సంఘంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ ఉండి ఖర్చు కారకాలు మరియు ఇతర సంబంధిత అంశాలను అధ్యయనం చేసి, తగిన సిఫార్సులు చేసారు. రాజకీయ పార్టీలు, ప్రధాన ఎన్నికల అధికారులు, ఎన్నికల పరిశీలకుల నుంచి ఆ కమిటీ సూచనలను ఆహ్వానించింది. 2014 నుండి ఎలక్టర్ల సంఖ్య మరియు వ్యయ ద్రవ్యోల్బణం సూచిక గణనీయంగా పెరిగినట్లు కమిటీ కనుగొంది.అభ్యర్థుల కోసం ప్రస్తుత ఎన్నికల వ్యయ పరిమితిని పెంచాలని మరియు 2014 నుండి 2021 వరకు ఓటర్ల సంఖ్యను 834 మిలియన్ల నుండి 936 మిలియన్లకు (12.23% పెంపు) పెంచాలని మరియు 2014-15 నుండి 2021-22 నుండి వ్యయ ద్రవ్యోల్బణం సూచీని పెంచాలని రాజకీయ పార్టీల నుండి వచ్చిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని 240 నుండి 317 (32.08% వరకు)సీలింగ్ పరిమితిని పెంచడానికి కమిటీ తన సిఫార్సులను అందించింది. కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది మరియు అభ్యర్థుల కోసం ప్రస్తుత ఎన్నికల వ్యయ పరిమితిని పెంచాలని నిర్ణయించింది. దీని ప్రకారం, సవరించిన పరిమితులు ఇప్పుడు M/O లా, జస్టిస్ మరియు లెజిస్లేటివ్ డిపార్ట్‌మెంట్ ద్వారా తెలియజేయబడ్డాయి, అవి క్రింది విధంగా ఉన్నాయి.పార్లమెంటరీ నియోజకవర్గాలకు (PCలు)మునుపటి వ్యయ పరిమితి 2014 లో రూ. 70 లక్షలు ఉండగా దానిని ఇప్పుడు రూ. 95 లక్షలు కు భారత ఎన్నికల కమిషన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.గతంలో రూ. 54 లక్షలు పరిమితి ఉన్నచోట రూ. 75 లక్షలు కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.అదేమాదిరిగాఅసెంబ్లీ నియోజకవర్గాలకు (ACలకు) మునుపటి వ్యయ పరిమితి (2014) రూ. 28 లక్షలు ఉండగా ఇప్పుడు పెరిగిన వ్యయ పరిమితి రూ. 40 లక్షలు గా నిర్ణయం తీసుకుంది.రూ. 20 లక్షలు ఉన్న చోట్ల రూ. 28 లక్షలు కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాబోయే అన్ని ఎన్నికలకు ఈ పరిమితులు వర్తిస్తాయి అని ఎన్నికల కమిషన్ జారీ చేసిన లేఖలో పేర్కొన్నారు అని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ కి పోటీ చేసే అభ్యర్థుల కు 40 లక్షల రూపాయలకు మించకుండా ఖర్చు చేయాలని, అదేమాదిరిగా పార్లమెంట్ కు పోటీ చేసే అభ్యర్థులు 95 లక్షల రూపాయలకు మించకుండా ఖర్చు చేయాలని ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ తీసుకు వచ్చిన ఈ మార్పును తుంగలో తొక్కి అధికంగా ఖర్చు చేసే వారికి తరువాత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు అని ఆయన తెలిపారు. అయితే విలువలు వదిలేసి దొంగ లెక్కలు చూపించే వారిని ఏమీ చేయలేని స్థితి లో ఎన్నికల వ్యవస్థ ఉండటం పట్ల రావుసుబ్రహ్మణ్యం విచారం వ్యక్తం చేశారు. తన లేఖలో ప్రధాన ఎన్నికల కమీషనర్ కు ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఇస్తానని తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow