#GoodmorningCMSir ఏ రాజకీయ కార్యక్రమం కాదు, సామాజిక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడమే.

మన రాష్ట్రాన్ని పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోలుస్తూ ప్రజలు మాటల్లో వారు ప్రయాణం చేస్తున్న సమయంలో గుంతలు వస్ట్ అది ఆంధ్ర రాష్ట్రంలో కి వచ్చాము అని వారి భావన అని మీడియాలో వ్యంగంగా కార్టూన్స్ వేసి అవహేళన చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త రోడ్లు వేసిన, మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు.

Jul 16, 2022 - 20:13
 0
#GoodmorningCMSir ఏ రాజకీయ కార్యక్రమం కాదు, సామాజిక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడమే.

గుంటూరులో 2 వ రోజు జనసేన నిరసన: జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు పార్టీ జిల్లా శ్రేణులు శనివారం గుంటూరు ఏటిఅగ్రహారం మెయిన్ రోడ్లపై ఉన్న గోతులు వద్ద నాయకులు ఫ్లకాట్స్ పట్టుకొని గుడ్ మార్నింగ్ CM సార్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మా పార్టీ తలపెట్టిన #goodmorningcmsir హాష్ టాగ్ కార్యక్రమం 2 వ రోజు ఏటి అగ్రహారం మెయిన్ రోడ్లో చేస్తున్నాము.

మేము తలపెట్టిన కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల దుస్తుతిని CM కి తెలియజేయాలని తల పెట్టాము అంతేకానీ మేము రాజకీయంగా వారిని వ్యతిరేకిచటం కాదని ప్రజలు గమనించాలి అని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర మొత్తం ఎక్కడ చూసినా వర్షం పడితే ఇంట్లో నుంచి బండి తీసుకు బయటికి వచ్చే పరిస్థితులు లేవు అని చెప్పారు . మీడియాలో కార్టూన్స్ వేసి మన రాష్ట్రాన్ని అవహేళన చేస్తున్నారు అని గమనించాలి.

మన రాష్ట్రాన్ని పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోలుస్తూ ప్రజలు మాటల్లో వారు ప్రయాణం చేస్తున్న సమయంలో గుంతలు వస్ట్ అది ఆంధ్ర రాష్ట్రంలో కి వచ్చాము అని వారి భావన అని మీడియాలో వ్యంగంగా కార్టూన్స్ వేసి అవహేళన చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త రోడ్లు వేసిన, మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు.

మీకు అధికారం వచ్చిన మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఎటువంటి ప్రయోజనం లేదని మీకు అధికారం ఉన్న మిగతా రెండు సంవత్సరాలు ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా రోడ్లు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన మాటలను మీకు మేము గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము అంతేకాని మా రాజకీయ ఎదుగుదలకి మీ తప్పులని ఎత్తి చూపడం లేదు, మేము ప్రజల కోసం వారికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని వాటికి పరిష్కారం కోసం ప్రయత్నం మాత్రమే మేము చేస్తున్నాము అని చెప్పారు.

మీరు తక్షణమే స్పందించి ఈ రోడ్లపై మంచి నిర్ణయం తీసుకోవాలి రానున్నవి వర్షాలు పడే రోజులు కాబట్టి అధికార పార్టీ వారు నిద్ర లెగిసి మీరు కాంట్రాక్టర్ని బతిమిలాడుకుంటారో లేక మీరే రోడ్లపైకి వచ్చి రోడ్లు వేస్తారో నిర్ణయించుకోవాలి అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమల్ గారు, మహిళా కోఆర్డినేటర్ పార్వతి నాయుడు గారు,జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు గారు, బిట్రగుంట మల్లికా గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్ గారు,అధికారప్రతినిది ఆళ్ళ హరి గారు, నగర అధ్యక్షులు నెరేళ్ళ సురేష్ గారు,కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మ గారు,నాయకులు,వీరామహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow