2 వారాలుగా స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు: అధిగమించ లేకపోతున్న అధికారులు.

రిజిస్ర్టేషన్‌ శాఖలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ సాంకేతిక సమస్యలను అధిగమించకపోవటం పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద వెబ్సైటు వారె సాంకేతిక లోపాల్ని క్షణంలో సరి చేస్తారు మహా ఆయూతే ఓ 10 ని . కానీ మన రాష్ట్ర ప్రభుత్వ సైట్లు ...... ?

Jul 21, 2021 - 16:42
Aug 25, 2021 - 06:27
 0
2 వారాలుగా స్తంభించిన  రిజిస్ట్రేషన్ సేవలు: అధిగమించ లేకపోతున్న అధికారులు.
2 వారాలుగా స్తంభించిన  రిజిస్ట్రేషన్ సేవలు: అధిగమించ లేకపోతున్న అధికారులు.

అమరావతి :

రెండు వారాలుగా స్తంభించిన సేవలు. అధిగమించ లేకపోతున్న అధికారులు.

గుంటూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌ సేవల ప్రతిష్టంభన కొనసాగుతోంది. 

రెండు వారాల క్రితం తలెత్తిన సాంకేతిక సమస్యలను అధికార యంత్రాంగం అధిగమించలేకపోతుంది. 

కొద్ది నెలలుగా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో రెండు వారాల క్రితం హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్‌ సర్వర్‌ను రాజధానిలోని మంగళగిరి ప్రాంతానికి తరలించారు.

 అయితే హైదరాబాద్‌ కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సెంట్రల్‌ సర్వర్‌పై ఒత్తిడి పెరగటం వలన సమస్యలు వస్తుండటంతో దానిని రాజధాని ప్రాంతానికి తరలించామని, అంతేగాక భవిష్యత్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సర్వర్‌ సామర్ధ్యాన్ని పెంచుతున్నట్టు అధికారులు ప్రకటించారు. 

అయితే సాంకేతిక నిపుణులు ఎంత ప్రయత్నించినా ఇంతవరకు సమస్యను పరిష్కరించలేకపోయారు. 

దీంతో గడచిన వారం పది రోజులుగా రిజిస్ర్టేషన్‌ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. 

ఇప్పటివరకు ఈసీలు, సర్టిఫైడ్‌ కాపీలు, నేమ్స్‌ సెర్చ్‌ వంటి సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. 

అడపాదడపా రోజులో కొద్ది సమయం సర్వర్‌ అందుబాటులోకి వస్తుండటంతో నాలుగైదు రిజిస్ర్టేషన్లు మాత్రం జరుగుతున్నాయి.

ఆ వెంటనే సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచిపోతున్నాయి.

 రిజిస్ర్టేషన్‌ శాఖలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ సాంకేతిక సమస్యలను అధిగమించకపోవటం పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన రిజిస్ర్టేషన్‌ శాఖలో నెలకొన్న ఈ సమస్యను రోజులు గడుస్తున్నా సరిచేయకపోవటం విస్మయం కలిగిస్తుందని రిజిస్ర్టేషన్‌ శాఖ వర్గాలు సైతం వాపోతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది కాలిగా లేక పాత లేక  ఏదైనా పెండింగ్ పనులు చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది.

 ఆయా సేవలు వినియోగించుకునేందుకు వచ్చిన ప్రజలు మాత్రం కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow