అంతర్రాష్ట్రీయ గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన ప్రకాశం పోలీసులు: సిద్ధార్థ్ కౌశల్ IPS

. 5 మంది గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ . 400 కిలోల గంజాయి స్వాదీనం . మొత్తం 40 లక్షల విలువ గల గంజాయిని స్వాదీనం.

Jun 23, 2021 - 08:36
Jun 23, 2021 - 08:46
 0
అంతర్రాష్ట్రీయ గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన ప్రకాశం పోలీసులు: సిద్ధార్థ్ కౌశల్ IPS
Prakasam police arrested Smugglers ganja Siddhartha maisha ips

అంతర్రాష్ట్రీయ గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీసుల

 అంతర్రాష్ట్రీయ గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన ప్రకాశం పోలీసులు.

 400 కిలోల గంజాయి స్వాదీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు.

 5 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసిన ప్రకాశం పోలీసులు

 తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన సూత్రధారి అయిన సవరనపాలెం గ్రామం, కొయ్యూరు మండల వాసి అయిన దేవరకొండ ఎర్రేష్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు.

 అశోక్ లైలాండ్ వాహనం, షిఫ్ట్ desire కారును స్వాదీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు మొత్తం 40 లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్న ప్రకాశం పోలీసులు.

*ముద్దాయి పేర్లు.*

1 .బల్లి జోజిసాయి కుమార్  S/O నాగేశ్వరరావు ,వ.20 సం, చింతలపూడి గ్రామం, కొయ్యూరు మండలం, విశాఖపట్నం జిల్లా.(ఆటో డ్రైవర్)

2. షేక్ మైనుద్దీన్ s/o గుంటూరు మస్తాన్ , వ.40 సం, సమిశ్ర గూడెం గ్రామం, నిడదవోలు మండలం, ప.గో.జిల్లా.

3. మాకిరెడ్డి అప్పలనాయుడు @ బంగారం s/o రాజిబాబు, వ.30 సం., క్రిష్ణదేవరపేట గ్రామం, గోలిగొండ మండలం, విశాఖపట్నం  జిల్లా(కార్ డ్రైవర్ ).

4. మగపు గంగాధర్ s/o ఆంజనేయులు, వ.21 సం, దొడ్డవరం గ్రామం, కొయ్యూరు మండలం, విశాఖపట్నం జిల్లా.

5. ఉప్పలపాటి అంజి @ నాని s/o రత్తయ్య, వ. 32 సం, సమిశ్ర గూడెం గ్రామం, నిడదవోలు మండలం, ప.గో.జిల్లా.
 
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్, IPS గారి సూచనల మేరకు టంగుటూర్ టోల్ ప్లాజా వద్ద ది.21.06.2021 తేదిన సాయంత్రం 04.00 గంటల సమయంలో సింగరాయకొండ సి.ఐ వి.శ్రీనివాసులు గారి అధ్వర్యంలో AP39TL6425 అశోక్ లైలాండ్ వాహనం మరియు AP39GS7226 Shift desire  వాహనములను తనిఖీ చేయగా అందులో ఉన్న 5 మంది వ్యక్తులు విశాకపట్నంకు చెందిన ఎర్రేషు సహాయంతో విశాఖ మన్యం ప్రాంతం నుండి సుమారు 400 కిలోల గంజాయిను పై రెండు వాహనాలలో తీసుకొని వస్తుండగా CI గారు తన బృందంతో తనిఖీ చేసి ముద్దాయిలను అదుపులోనికి తీసుకొని గంజాయిను మరియు 2 వాహనాలను స్వాదీన పరచుకున్నారు.

ఈ గంజాయిని విశాఖపట్నం నుండి తిరుపతి కి తీసుకొని వెళ్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. వీరందరినీ ఈ రోజు రిమాండ్ కు పంపడం జరిగింది. 

ఉత్తమ ప్రతిభ కనబరచిన

శింగరాయకొండ CI, U.శ్రీనివాసులు, టంగుటూర్ SI ఎస్.కె.నాయూబ్ రసూల్ గారు, కొండపి SI రాంబాబు గారు, టంగుటూర్  పోలీస్ సిబ్బంది అయిన ASI B.V.సుధాకరరావు, HC M.V.కృష్ణారావు, కానిస్టేబుళ్ళు రవికుమార్, అచ్యుత్ కుమార్, కృష్ణారెడ్డి, హోంగార్డ్ బాలకృష్ణ  అరీ SPగారు అభినందించినట్లు ఒంగోలు DSPగారు తెలిపినారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow