కోరికలు కష్టాలు తీరడం లేదని దేవుని నిందించడం ?

Aug 8, 2021 - 11:21
Aug 9, 2021 - 22:27
 0
కోరికలు కష్టాలు తీరడం లేదని దేవుని నిందించడం ?
It is not right to blame God for not letting go of desires and suffering.

కోరికలు తీరడం లేదని,కష్టాలు వదలడం లేదని దేవుని నిందించడం తగదు.

ఎందుకంటే ఒక పిల్లవాడు తళతళమని మెరిసే ఒక పదునైన కత్తిని ఆట వస్తువుగా భావించి అది కావాలని తల్లితో పదేపదే మారాం చేస్తాడు.

పిల్లవాడు అడుగుతున్నాడు కదా అని కత్తిని తల్లి ఇచ్చేస్తుందా!!?

మీరైతే మాత్రం ఇస్తారా!!!

అవసరమైతే పిల్లవాడిని దండిస్తుంది, కాని కత్తిని అందించదు. ఎందుకంటే కత్తి వలన కలిగే ప్రమాదం పిల్లవాడికి తెలియదు.‌

అదేదో ఆటవస్తువనే భ్రమలో ఉంటాడు. కానీ తల్లికి దానివలన కలిగే ప్రమాదం తెలుసు కనుక తన పిల్లవాడు ఆ కత్తితోతనకు తానుగా ఎక్కడ గాయపరచుకుంటాడో అని ఆ తల్లి దానిని దూరంగా దాచేస్తుంది.

మరి ఈ జన్మకు కేవలం ఈ దేహానికి మాత్రమే తల్లిగా ఉండే మానవ స్త్రీయే తన బిడ్డల పట్ల ఇంత జాగ్రత్తగా ఉంటే జన్మ జన్మల నుండి మనతో ఉంటూ మన ఆత్మకు తల్లీ తండ్రీ తానుగా ఉండి మనలను సదా కాచుకు కూర్చుంటున్న ఆ భగవంతుడు ఆయన పిల్లలమైన మనపై ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి!!!..

మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు కానీ భగవంతునికి సదా ఎరుకయే.

భగవంతుడు మనం ఆడిగిన ప్రతిదీ ఇవ్వకపోవడానికి కారణం ఇదియే.

భగవంతుని అర్థించండి పరవాలేదు‌. యివ్వ లేదని నిందించకండి. ఆయన మనకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వక పోవచ్చు కానీ మనకు అవసరమైన ప్రతిదీ ఇచ్చి తీరుతాడు.

సందేహాలకు చోటివ్వక విశ్వాసం పెంచుకోవాలి. భగవుంతునిపై విశ్వాసం ఉంచండి.. సన్మార్గములో జీవితం కొనసాగించండి.

హరహర మహాదేవ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow