అత్యాచారాలు అపలేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు:గాదె

చివరకు మైనార్టీ పిల్లలపై కూడా అత్యాచారాలు జరగడం దారుణమాన్నారు.. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ వదలి బయటకు వచ్చి చూస్తే మహిళల రోదన వినపడుతుందని అన్నారు.... తాజాగా గుంటూరు లో 9 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరగడం సిగ్గుచేటని...రాష్ట్ర హోం మంత్రి గా ఒక మహిళ ఉన్నా అత్యాచారాలు ఆగడంలేదని అన్నారు.

అత్యాచారాలు అపలేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు:గాదె

 జగన్ రెడ్డి హోదాలో పజ్జి ఆడటానికి సమయం ఉంటుంది కానీ ఆడపిల్లకి రక్షణ కల్పించడానికి టైమ్ ఉండదని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు.

రాష్ట్రంలో ఏదోఒక మూల మహిళలు ,ఆడపిల్లలు. చివరకు మైనార్టీ పిల్లలపై కూడా అత్యాచారాలు జరగడం దారుణమాన్నారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ వదలి బయటకు వచ్చి చూస్తే మహిళల రోదన వినపడుతుందని అన్నారు. తాజాగా గుంటూరు లో 9 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరగడం సిగ్గుచేటని.

రాష్ట్ర హోం మంత్రి గా ఒక మహిళ ఉన్నా అత్యాచారాలు ఆగడంలేదని అన్నారు.

అత్యాచారాలు ఆపడం చేతకాదుగాని, బాధితులకు అండగా ఉండడానికి వచ్చిన జనసేన నాయకులను అడ్డుకోవడానికి మాత్రం పోలిసులు సిద్ధంగా ఉంటారన్నారు.

గుంటూరు జిజిహెచ్ లో ఉన్న బాధితరాలని పరామర్శించడానికి వెళ్లిన జనసేన నాయకులని అడ్డుకోవడం దారుణం.

దిశ చట్టం తెచ్చాం అని గొప్పలు చెప్పే ఈ ముఖ్యమంత్రి ..ఎంత మందికి శిక్షలు పడ్డాయ్ అనేది చెప్పాలని అన్నారు.

ఇన్ని అత్యాచారాలు జరుగుతున్న మహిళ కమిషన్ మాత్రం మొద్దు నిద్ర విడడం లేదన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మణిక్యాలరావు గారు, బిట్రగుంట మల్లిక,కొప్పుల కిరణ్,ఆళ్ళ హరి ,మదులాల్ గార్లు..వీరమహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు..