ప్రతి కార్యకర్తని గౌరవించుకుంటాం: గాదె

ప్రతి కార్యకర్తని గౌరవించుకుంటాం: గాదె

జనసేన పార్టీకి బలం మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారైతే... ఆయన ధైర్యం జన సైనికులని గాదె వెంకటేశ్వరరావు అన్నారు.... క్రియాశీలక సభ్యత్వ పత్రాల పంపిణీ కార్యక్రమం రెండవరోజు పండగ వాతావరణంలో జరిగింది.

గుంటూరు జనసేన పార్టీ కార్యాలయం వేదికగా గుంటూరు పట్టణ తూర్పు- వెస్ట్ నియోజవర్గాల క్రియాశీలక కార్యకర్తలకి భీమా పత్రాలను జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారూ అందజేశారు.... జనసైనికులకు క్షేమమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమని... అన్నారు.

ప్రతి కార్యకర్తని గౌరవిస్తామని. వారికి అండగా ఉంటామని చెప్పారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుండే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు క్రియాశీలకంగా పనిచేసిన వాలంటర్లను సన్మానించారు. పనిచేసే ప్రతి కార్యను అధ్యక్షులు గుర్తిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, పట్టణ అధ్యక్షులు నెరేళ్ల సురేష్, నారదాసు ప్రసాద్.. జిల్లా నాయకులు,కార్యకర్తలు ,వీర మహిళలు పాల్గొన్నారు..