రెంట చింతల రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడం తీవ్రంగా బాధించింది: గాదె

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఎదో ఒక మూల ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని..
గాదె వెంకటేశ్వరరావు అన్నారు.. మాచర్ల నియోజకవర్గం..రెంట చింతల మండలం వడ్డెరభావి కి చెందిన 38 మంది టెంపో వాహనం లో ..శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.
తిరుగు ప్రయాణంలో ఎర్ర వాగు సబ్ స్టేషన్ వద్ద ఘోర ప్రమాదానికి గురవడం. దిగ్భ్రాంతికి కలిగించింది.
8 మంది దుర్మరణం పాలవడం, నన్ను తీవ్రంగా కలిచి వేసింది, మృతి చెందిన వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మ శాంతిచాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వారి కుటుంబ సభ్యులకు తట్టుకునే ధైర్యం ఇవ్వలాని దేవుడు ని వేడుకుంటున్నాను.. చనిపోయిన వారికి ప్రభుత్వం ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్ధిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాను.
తీవ్ర గాయాలు పాలైన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని...కోరుతున్నాను... గాదె వెంకటేశ్వరరావు జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ
What's Your Reaction?






