కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో సామాజిక రక్షణకు స్పందనగా భారత్‌కు జపాన్ అధికారిక అభివృద్ధి సాయం

కోవిడ్-19 కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పేద, బలహీన వర్గాల వారికి తగిన సామాజిక సాయం అందించడానికి భారత దేశం చేస్తున్న ప్రయత్నాలకు జపాన్
అండగా నిలవనుంది. ఇందులో భాగంగా జపాన్ ప్రభుత్వం 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2,113 కోట్ల) అధికారిక అభివృద్ధి సహాయ రుణం ఇచ్చిందేందుకు ముందుకు వచ్చింది. సామాజిక రక్షణ కోసం'కోవిడ్-19 క్రైసిస్ రెస్పాన్స్ సపోర్ట్ లోన్' విషయమై భారత ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సి.ఎస్.మోహపాత్ర, భారతదేశానికి జపాన్ రాయబారి శ్రీ సుజుకి సతోషి మధ్య ఈ రోజు నోట్స్ మార్పిడి జరిగింది. నోట్స్ మార్పిడి అనంతరం ఈ ప్రోగ్రామ్ లోన్ నిమిత్తం డాక్టర్ మోహపాత్ర, న్యూఢిల్లీలోని జైకా ప్రధాన ప్రతినిధి మిస్టర్ కట్సువో మాట్సుమోటో మధ్య రుణ పత్రంపై సంతకాల కార్యక్రమం జరిగింది. కోవిడ్ -19 మహమ్మారి తీవ్ర ప్రభావం కారణంగా దేశ వ్యాప్తంగా ప్రభావితమైన పేద, బలహీనం వర్గాల వారికి తగు సమన్వయం, సామాజిక రక్షణ కల్పించేందుకు గాను భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ఈ ప్రోగ్రామ్ రుణం లక్ష్యం. భారత్ మరియు జపాన్‌లు 1958 నుండి ద్వైపాక్షిక అభివృద్ధి సహకారం విషయమై సుదీర్ఘమైన మరియు ఫలవంతమైన చరిత్రను కలిగి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారత్, జపాన్ల మధ్య ఆర్థిక సహకారం మరింత బలపడి వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగింది. తజా రుణ ఒప్పందం భారతదేశం మరియు జపాన్ మధ్య వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింతగా పటిష్టం చేసి బలపరుస్తుంది.
What's Your Reaction?






