వైకపా కుట్రపూరిత వైఖరికి ముచ్చెమటలు పట్టించి, అమరావతి రైతులకు అండగా నిలిచిన కన్నా లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు

అమరావతి రాజధాని రైతులకు అండగా ఉద్యమానికి ఊపిరిగా వైకపా కుట్రపూరిత వైఖరికి ముచ్చెమటలు పట్టించి అండగా నిలిచిన కన్నా లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు హైకోర్టు తీర్పు పై మాలమహానాడు నవ్యాంధ్ర ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ కాపు ఐక్యవేదిక హర్షం.

Mar 4, 2022 - 11:26
 0
వైకపా కుట్రపూరిత వైఖరికి ముచ్చెమటలు పట్టించి, అమరావతి రైతులకు అండగా నిలిచిన కన్నా లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు

అమరావతి రాజధాని ఉద్యమానికి ఒక కులం రంగు పూసి కేవలం ఒక ప్రాంతీయ ఆందోళనగా ఒక పార్టీకి పెయిడ్ ఉద్యమం గా చిత్రీకరించి అణగదొక్కిన నేపధ్యంలో నవ్యాంధ్ర మాజీ కమల దళపతి కన్నా లక్ష్మీ నారాయణ గారు రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల ఆర్తనాదాలను త్యాగధనుల ఘోషను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించేలా శంకుస్థాపన చేసిన చోట మౌన పోరాట దీక్షలతో ప్రజా యాత్రలతో అమరావతి రాజధాని ఉద్యమం ఒక కులం ప్రాంతానికి సంబంధించినది కాదు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంభంధించినదని ఉద్యమానికి ఊపిరిగా రాజధాని రైతులకు అండగా పార్టీలకు అతీతంగా నిలిచారని అమరావతి టు తిరుపతి యాత్ర ముగింపు సభలో కూడా బిజెపి కండువాతో అమరావతే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని నినదించిన దమ్మున్న నాయకుడని అమరావతి రాజధాని ఉద్యమానికి రైతులకు అండగా నిలిచిన కన్నా లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అలుపెరుగని ఉద్యమంతో అహర్నిశలు పోరాడిన త్యాగధనులు రైతులకు రాజధాని ఉద్యమ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ హై కోర్టు తీర్పు పై హర్షం వ్యక్తం చేశారు.

వైకపా తక్షణమే అమరావతి అభివృధ్ది పనులు ప్రారంభించాలని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్,ఆదివాసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిరువీధుల శంకర్ ప్రసాద్,ట్రైబల్ డెవలప్మెంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యప్ప నాయక్,ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ఐక్యవేదిక అధ్యక్షులు దాసరి రమేష్,మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సంధాని,కాపు యవసేన రాష్ట్ర అధ్యక్షులు నిశ్శంకరరావు దినేష్ కుమార్ తదితరులు డిమాండ్ చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow