ఒక శూధృని తల నరికి ఆతని తపస్సును భగ్నం చేసిన రాముడు ?
నిజంగా రాముడు ధర్మ ప్రభువు ? రాముడు ఎవరికి ఆదర్శం ? Rama killed Dalith, . . ఎవరో ఒక బ్రాహ్మణబాలకుని అకాలమరణానికి కారణం అధర్మము అట. ఆ అధర్మమేమి యనగా..... శూద్రుడు తపమాచరిచుట యని రామాయణ కథనము.

ఎందరో మహానుభావులు రామ కథాపీయుష పిపాసులు అందరికీ వందనములు పాత పోష్టే, రామకథ, శ్రీరామ కథ.
ఎవరో ఒక బ్రాహ్మణబాలకుని అకాలమరణానికి కారణం అధర్మము అట. ఆ అధర్మమేమి యనగా..... శూద్రుడు తపమాచరిచుట యని రామాయణ కథనము.
వాల్మీకి రామాయణము ఉత్తరకాండ 73 నుండి 76 సర్గలు చదవండి. గీతాప్రెస్ తెలుగు రామాయణము తక్కువ మూల్యములో దొరకును. .
ఘట్టము: ఉత్తర రామాయణములోని శంబూకవధ 76 వ సర్గ 2 వ శ్లోకం నుండి 5 వ శ్లోకం వరకు
శూద్రయోన్యాం ప్రజాతోస్మి తప ఉగ్రం సమాస్థితః౹ దేవత్వం ప్రార్థయే రామ సశరీరః మహాయశః౹౹2౹౹
నాది శూద్రజన్మ. ఉగ్రమైన తపమాచరింప సంకల్పించితిని. శరీరంతో సహా దేవత్వమందవలెనని కోరిక.
న మిథ్యాహం వదే రామ దేవలోక జిగీషయా౹ శూద్రం మాం విద్ధి కాకుత్స్థ శంబూకో నామ నామతః౹౹3౹౹౹
దేవలోకము నాశించిన నేను అబద్ధం చెప్పను. నేను శూద్రుడను. నా పేరు శంబూకుడు.
భాషతస్తస్య శూద్రస్య ఖడ్గం సురుచిర ప్రభం౹ నిష్కృత్య కోశాద్విమలం శిరః చిచ్ఛేద రాఘవః౹౹4౹౹
శూద్రుడైన శంబూకుడు తపస్సు చేయుచుండగా రాముడు ఒరనుండి ఖడ్గమును తీసి ఆతని శిరస్సును ఖండించెను.
తస్మిన్ శూద్రే హతే దేవాః సేంద్రాః సాగ్ని పురోగమాః౹ సాధు సాధ్వితి కాకుత్థ్సం శశంసుః ముహుర్ముహుః౹౹5౹౹
శూద్రుని శిరము ఖండించినంతనే ఇంద్రాదులు రామా సాధు సాధు అని పుష్పవృష్టి కురిపించిరి.