ఏప్రిల్ 1 2021 నుండి కోవిడ్-19 నియమాలు తెలుసుకొండి

కోవిడ్-19 నియంత్రణకు మార్గదర్శకాలు జారీ చేసిన హోం మంత్రిత్వశాఖ పరీక్ష-పర్యవేక్షణ-చికిత్స విధానాన్ని, నియంత్రణ చర్యలు మరియు వివిధ కార్యకలాపాలపై కోవిడ్ అనుగుణ చర్యలను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా అమలు చేయాలి.

Mar 24, 2021 - 20:53
Mar 26, 2021 - 11:53
 0
ఏప్రిల్ 1 2021 నుండి కోవిడ్-19 నియమాలు తెలుసుకొండి
MHA Guidelines for effective control of COVID-19 telugu,

కోవిడ్-19 ని సమర్ధవంతంగా అరికట్టడానికి చేపట్టవలసిన చర్యలపై మార్గదర్శకాలను జారీచేస్తూ ఈరోజు కేంద్ర  హోం మంత్రిత్వశాఖ తాజా ఉత్తర్వులను జారీచేసింది. ఈ ఉత్తర్వులు 2021 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి 2021 ఏప్రిల్ 30వ తేదీ వరకు అమలులో ఉంటాయి. 

కోవిడ్-19 నివారణకు గతంలో అమలు చేసిన చర్యల వల్ల కలిగిన ప్రయోజనాలను కొనసాగించే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ తాజా ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. గత అయిదు నెలలుగా క్రియాశీల కేసుల సంఖ్య తగ్గడంతో  గతంలో అమలు చేసిన చర్యలు ఆశించిన ఫలితాలను ఇచ్చాయి. 

కొత్త మార్గదర్శకాల లోని ముఖ్యమైన అంశాలు:

* తాజాగా కొన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో  కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడంతో  పరీక్ష-పర్యవేక్షణ-చికిత్స విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని; ప్రతిఒక్కరూ కోవిడ్ అనుగుణ ప్రవర్తన అలవరచుకొనేలా చూడాలని, లక్ష్యాల మేరకు వాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 

* అన్ని కార్యకలాపాలు విజయవంతముగా తిరిగి ప్రారంభం కావడానికి మరియు సమస్య నుంచి పూర్తిగా బయటపడడానికి కంటైన్మెంట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేయవలసి ఉంటుంది. దీని కోసం హోం, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మరియు ఇతర కేంద్ర , రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఇతర శాఖలు జారీచేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. 

 పరీక్ష-పర్యవేక్షణ-చికిత్స విధానం:

* ఆర్టీ-పీసీర్ పరీక్షల నిర్వహణలో వెనుకబడివున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటిని వేగవంతం చేసి నిర్ణీత 70 శాతం లేదా అంతకు మించి పరీక్షలు జరిగేలా చూడాలి. 

* విస్తృత పరీక్షల్లో బయటపడే కొత్త పాజిటివ్ కేసులను వేరు చేసి/ విడిగా ఉంచి తక్షణం చికిత్స అందించాలి 

* ఇంతేకాకుండా నిబంధనల ప్రకారం వీరితో సన్నిహితంగా మెలిగిన వారి జాడని సాధ్యమైనంత త్వరగా తెలుసుకుని వారిని కూడా వేరు చేసి / విడిగా ఉంచాలి. 

* పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సూక్ష్మ స్థాయిలో  హోం, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్లను గుర్తించాలి. 

* ఈ కంటైన్మెంట్ జోన్లను సంబంధిత జిల్లా కలెక్టర్లు,  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ వెబ్ సైట్లలో నోటిఫై చేస్తారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఈ  సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తారు.

* కంటైన్మెంట్ జోనులుగా ప్రకటించిన ప్రాంతాల్లోఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ ప్రాంత పరిధిని గుర్తించి, ఈ పరిధిలో  ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేయడం, కోవిడ్ సోకినవారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం  ఐఎల్ఐ / శ్వాసకోశ కేసులను గుర్తించడం లాంటి చర్యలను అమలు చేయవలసి ఉంటుంది. 

స్థానిక జిల్లా, పోలీస్ మరియు మునిసిపల్ అధికారులు కంటైన్మెంట్ నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలి. ఈ అంశంలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేసేలా చూడటానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలను తీసుకోవాలి. 

 కోవిడ్ అనుగుణ చర్యలు:

* పనిప్రాంతాలు, బహిరంగా ప్రదేశాలు ముఖ్యంగా రద్దీగా వుండే ప్రదేశాల్లో  కోవిడ్ అనుగుణ చర్యలు అమలు జరిగేలా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలను అమలు చేయాలి. 

* ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించి, చేతులను శుభ్రంగా ఉంచుకొనేలా చూసి, సామాజిక దూరం పాటించేలా చూడడానికి జరిమానాలు విధించడంతో సహా అన్ని రకాల చర్యలను   రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలను అమలు చేయాలి. 

కోవిడ్-19 పై జారీఅయిన మార్గదర్శకాలు దేశమంతటా అమలులో ఉంటాయి

స్థానికంగా ఆంక్షలు 

* కొవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి పరిస్థితికి అనుగుణంగా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా/ ఉప-జిల్లా/ నగర/వార్డు స్థాయిలో స్థానికంగా ఆంక్షలను విధించవచ్చును. 

అంతర్రాష్ట్ర, రాష్ట్రంలోపు కదలికలపై ఆంక్షలు లేవు: 

వ్యక్తులు కానీ, సరకు రవాణా లో కానీ అంతర్-రాష్ట్ర, రాష్ట్రంలోపు రాకపోకలు సాగించడానికి ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. ప్రత్యేకంగా అటువంటి కదలికల కోసం ఇక ఏ  విధమైన అనుమతి / ఆమోదం / ఇ-పర్మిట్ అవసరం ఉండదు. 

సూచించిన నిబంధనలకు కట్టుబడి ఉండటం:
 

*కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు సూచించిన నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతాయి. వీటిలో ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ, విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్ల నిర్వహణ, పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, హోటళ్లు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, వినోద పార్కులు, యోగా కేంద్రాలు,  వ్యాయామశాలలు;  ప్రదర్శనలు, సమావేశాలు మరియు సమ్మేళనాలు మొదలైనవి ఉంటాయి. 

* ఎప్పటికప్పుడు సవరించే మార్గదర్శకాలను సంబంధిత అధికారులు తప్పనిసరిగా అమలు చేయవలసి ఉంటుంది. 

వాక్సినేషన్ 

*కోవిడ్-19 కట్టడికి ప్రపంచంలో అతి పెద్ద  వాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. 

*  వాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆశించినంత వేగంగా ఇది సాగక పోవడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి  వాక్సినేషన్ అత్యంత అవసరం. 

* దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు  వాక్సినేషన్ కార్యక్రమ వేగాన్ని పెంచి గుర్తించిన తరగతులకు  వాక్సినేషన్ ఇవ్వడానికి చర్యలను అమలు చేయాలి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow