మైనారిటీ సంక్షేమం జనసేన తోనే సాధ్యం అని గుర్తించి పార్టీ లో మైనటీల చేరికలు: గాదె

గాదె గారు మాట్లాడుతూ: జనసేన పార్టీలో కుల,మతాలకు అతీతంగా అందరిని పార్టీలోకి ఆహ్వానిస్తుంది.మా పార్టీ సిద్ధాంతంలో ఒకటైన కులాలకు అతీతంగా,మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని చెప్పడం జరిగింది.

Aug 4, 2022 - 16:24
 0
మైనారిటీ సంక్షేమం జనసేన తోనే సాధ్యం అని గుర్తించి  పార్టీ లో  మైనటీల చేరికలు: గాదె

పొన్నూరు నియోజకవర్గ లో పలువు పొన్నూరు టౌన్ మైనార్టీ నాయకులు ఈరోజు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి సమక్షంలో పార్టీలో మైనారిటీ నాయకులు చేరారు.

షేక్.కరీముల్లా(సోని) ,షేక్ .బాబు( నూరి),షేక్.లియాకతు అలీ, షేక్.బాజీ ,జానీ గార్లను గాదె గారు జనసేన కండవ వీరి మెడలో వేసి ఆహ్వానించడం జరిగింది.వీరు గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నవారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు,పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది..

గాదె గారు మాట్లాడుతూ: జనసేన పార్టీలో కుల,మతాలకు అతీతంగా అందరిని పార్టీలోకి ఆహ్వానిస్తుంది.మా పార్టీ సిద్ధాంతంలో ఒకటైన కులాలకు అతీతంగా,మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని చెప్పడం జరిగింది.

అందుకని  గత కొన్ని నెలలుగా జనసేన పార్టీలోకి ఎంతోమంది వైసీపీ నాయకులు అలాగే తెలుగుదేశం నాయకులు మా పార్టీలో చేరడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా చాలామంది మా పార్టీలోకి చేరటానికి ముందుకు వస్తున్నారని తెలియజేయడమైనది.

పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తూ అలాగే కొత్త,పాత అని తేడా లేకుండా అందరం కలిసి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తా మని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారదాసు రామచంద్ర ప్రసాద్, తాలురి అప్పారావు, దేశం శెట్టి సూర్య,మేకల రామయ్య యాదవ్,పొన్నూరు మండల అధ్యక్షులు నాగిశెట్టి సుబ్బారావు, చెబ్రోలు మండల అధ్యక్షులు చందు శ్రీరాములు,పొన్నూరు మండల కార్యదర్శి చందు శివ కోటేశ్వరరావు, గ్రామ అధ్యక్షుడు సుధా వసంత్  మరియు పొన్నూరు టౌన్ జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow