జిల్లాల పునర్విభజన వలన రాష్ట్రానికి ఒరిగేదేమీలేదు వైకపా నాయకుల తీరు హాస్యాస్పదం మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్

నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితులలో జిల్లాల పునర్విభజన వలన రాష్ట్రానికి గానీ ప్రజలకు కానీ పెద్దగా ఉపయోగం లేదని వైకపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని అస్థవ్యస్థ పాలనతో నవరత్నాలే లక్ష్యంగా సాగి రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందని రాష్ట్రనికి పెట్టుబడులు తేవడంలో నూతన పరిశ్రమల స్థాపనలు చేయడంలో గానీ ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ కార్పోరేషన్లకు బడ్జెట్ కేటాయించి ఆర్థికాభివృద్ధికి కృషిచేయడంలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రం గడ్డు పరిస్థితులలో ఉంటే జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రకటన చేయడం సరైన సమయం కాదని దీని వలన అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ క్షేత్ర స్థాయిలో చేయాల్సిన అవసరంతోపాటు నూతన భవనాల నిర్మాణాలు కేటాయింపులు అధిక సిబ్బంది అవసరాలతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడుతుందని దీని వలన రాష్ట్రానికి పెద్దగా ఒరిగేదేమీలేదు అభివృద్ధి కూడా అసంభవమని.ఇటువంటి చిత్తశుద్ధి లేని జిల్లాల పునర్విభజన నిర్ణయాలను ఇండియాకు వరల్డ్ కప్ వచ్చిన మాదిరిగా వైకపా నాయకులు ర్యాలీలు పాలాభిషేకాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ తెలిపారు.
What's Your Reaction?






