ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది - భావన్నారాయణ

పూటకో అత్యాచారం హత్యల వార్తలతో అసలు రక్షణ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అన్న అనుమానం కలుగుతోందని జనసేనపార్టీ జిల్లా అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ ఆరోపించారు.

May 5, 2022 - 17:05
 0
ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది - భావన్నారాయణ

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, పూటకో అత్యాచారం హత్యల వార్తలతో అసలు రక్షణ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అన్న అనుమానం కలుగుతోందని జనసేనపార్టీ జిల్లా అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ ఆరోపించారు.

సత్తెనపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరంపరగా కొనసాగుతున్న అత్యాచారాల నేపథ్యంలో మహిళా హోమ్ మంత్రిగా ఉన్నటువంటి తానేటి వనిత గారు నేరస్తులను పట్టుకు 'తన్నేటి వనిత' గా అందరూ ఆశాభావంతో ఉన్నారని, కానీ వారి వ్యాఖ్యలు చూస్తుంటే బాధితుల కన్నీటి కి కారణమయ్యే విధంగా ఉండడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

జిల్లా కార్యదర్శి యర్రంశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేయడం అధికార పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని అన్నారు.

జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ గారు జరిగిన తప్పులకు బాధ్యులను గుర్తించి శిక్షిస్తామని చెప్పకుండా ఈ ఒక్క రాష్ట్రంలోనే జరుగుతున్నాయా, పొరుగు రాష్ట్రాలలో కూడా సమస్యలు ఉన్నాయికదా అని సమర్ధింపు ధోరణితో మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

సమావేశంలో పార్టీ కార్యాలయ ఇంఛార్జి సిరిగిరి మణికంఠ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, తోట నరసయ్య, తాడువాయి లక్ష్మీ, సిరిగిరి పవన్ కుమార్, కౌన్సిలర్ రంగిసెట్టి సుమన్, ఎంపీటీసీ సిరిగిరి రామారావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow