ఓం కారం వేదాలలో లేదు, అది ఉపనిషత్తుల కాలంలో సృష్టింఛ బడింది.

యజుర్వేదంలోని 40వ అధ్యాయం వేదం కాదు అది ఈశావాస్యోపనిషత్తు. యజుర్వేదం కర్మకాండ. ఈశావాస్యోపనిషద్ జ్ఞాన కాండ. ఈ రెండింటికీ పొత్తు ఎలా కుదురును. కుదరదు.

May 26, 2022 - 08:51
May 26, 2022 - 08:59
 0
ఓం కారం వేదాలలో లేదు, అది ఉపనిషత్తుల కాలంలో సృష్టింఛ బడింది.

ఓం యొక్క ప్రశస్తి ఉపనిషత్తులతో మొదలైనది. అ అను అక్షరము లేకుండా ఓం లేదు.

అక్షరాణాం అహం అకారః అస్మి = అక్షరములలో నేను అకారమును అని కదా భగవద్గీత. యజుర్వేదంలోని 40వ అధ్యాయం వేదం కాదు అది ఈశావాస్యోపనిషత్తు.

యజుర్వేదం కర్మకాండ. ఈశావాస్యోపనిషద్ జ్ఞాన కాండ. ఈ రెండింటికీ పొత్తు ఎలా కుదురును. కుదరదు.

ఈశావాస్యోపనిషత్తును శుక్ల యజుర్వేదంతో కలిపి 40 వ అధ్యాయముగా ముద్రించుచున్నారు. కనుక అది వేదమే అని భ్రమించుచున్నారు.

ఇలా ముద్రించే సంప్రదాయం ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా, మొదలైనదో తెలియదు. ఈశావాస్యోపనిషత్తు జ్ఞాన కాండ కనుకనే శంకరాచార్యులవారు భాష్యం వ్రాశారు.

వారు ఏ వేదమునకు భాష్యం వ్రాయలేదు. ఎందుకంటే, వేదములు స్తుతి - కర్మ - గాన పరకములు. కాలక్రమేణ, ఉపనిషత్తుల కాలము నుండి దేవునికి చిహ్నముగా ప్రణవము ఆపాదింపబడినది అని నా అధ్యయనము.

నిజానికి, ప్రణవము అనగా ఓంకారము అని చెప్పుచున్నారు. ప్రణవః (ప్ర ణూయతే) ప్రకృష్టేన ణూయతే = స్తూయతే, అనగా విశేషముగా స్తుతించుట అని.

వేదప్రతిపాదిత పరాత్పరుడు ఒక్కడే. దేవః ఏకః =దేవుడు ఒక్కడే, ఆయన విశ్వకర్మ మాత్రమే. ఇతరులు కారు. వేదములలో ముప్పైముగ్గురు మంది దేవతలు లెక్కించబడ్డారు.

ఈ దేవతలనందరినీ సృజించిన పరాత్పరుడు వారికి నామ రూప ములనిచ్చి, వారికి తగిన రోజువారీ విధులలో నియోగించెను.

'యో దేవానాం నామధా ఏక ఏవ' (ఋగ్వేదం. 10/82/7) ఓమ్ లేక ప్రణవము విషయములో ఇతరులు ఇచ్చు ఉదాహరణలు వారి స్వంత అభిప్రాయములను వెల్లడించుచున్నాయి.

వారందరూ ఒకరితో ఒకరు ఏకీభవించరు. ఎవరిమతము వారిదే.

ఏది ఏమైనా, ఓమ్ లేక ప్రణవమునకు ఉపనిషత్తుల కాలము నుండి మాత్రమే ప్రశస్తి కల్పింపబడినది.

ఓమ్ లేక ప్రణవము వైదికము కాదు. ఔపనిషదికము మాత్రమే, అని నా అచంచల విశ్వాసము. నమో విశ్వకర్మణే

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow