ఎవరికి కులం - జయ కృష్ణ
కూలాల పేరుతో విభజించి మనులను విభజించి వాడు "కూడిక గుర్తు" తో భజించి మన మన్నెల మానాల రత్తపు కూడు భుజించి యదేచ్చ గా ఏడు శిఖరాలు ఆక్రమించి శివ అంటే శవ అని బోధించి విశిష్ట మైన ద్వైతం లో ముంచి ముందున్నాడు మనను మించి అందరమూ నా? ఇది నాదా? ఒప్పుకుందాం మన తప్పులను తల వంచి కలిసి మెరుగు దిద్దుదాం అంతా కలిసి వద్దా? అయితే ముసుగులో నే ఉండు ఓ బంధూ! ఆడు రాబందు, ఆక్రమించు నీ నడ్డి వంచి క్రమ క్రమంగా ఆక్రమించు గుడి నుండి నీ ఇంటి లోగిలి
What's Your Reaction?






