నా తల సందేహముల పుట్ట. నా అజ్ఞానమునకు మహదాస్తికులైన పండితులు మన్నింతురు గాక! - ఆచార్య చండ్రపాటి
నమో నమః నమో నమః నమో నమః బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో సానగాది ఋషిభ్యో గురుభ్యో నమః౹ తప్పులు సవరించగలరు.

ఋగ్వేదము 1/34/11,1/45/2, 1/139/11, 3/6/9, 8/28/1, 8/30/2, 8/35/3, 9/92/4.
పైన నుడివిన మంత్రముల నన్నింటనూ
దేవతలు 33 మంది యని ఋగ్వేదము.
ఓ అగ్నీ! వసు రుద్ర ఆదిత్యులను యజ్ఞమునకు 12తోడ్కొని రమ్ము అని 1/45/1 వ మంత్ర మనుచున్నది.
ఓ దేవతలారా! మీలో నెవ్వరును అల్పులు మధ్యస్తులు అధికులు కారు.
అనగా దేవతలందరూ సమానులే 8/30/1 అని చెప్పుచున్నది.
8/28/5 వ మంత్రము
ఏడుగురు మరుత్తులు,
ఏడు రకముల ఆయుధములు కలవారనుచున్నది.
వారు
1) సోముడు బంగారు ఆభరణములు కలవాడు రాత్రుల నేత
2) అగ్ని మేధస్సు ఆతని ఆయుధము
3) త్వష్ట వాశీ = గొడ్డలి ఆయుధము
4) ఇంద్రుడు వజ్రము ఆయుధము
5) రుద్రుడు పదునైన ఆయుధము (శరము కావచ్చు)
6) పూష తస్కరునివలె సకలధనములను సర్వము ఎరుగునట. నిధులను గుర్తించుట.
7) విష్ణువు పాదములే ఆయుధము (మూడు అడుగులతో ముల్లోకములను కొలుచునట.
పాదము అనగా 12 అంగుళములు.
మూడు పాదములు
3×12=36 అంగుళములు.
కొలబద్ద దారు శిల్పుల ఆయుధము.
1/52/ 6 మంత్రము 3339 మంది దేవతలనుచున్నది.
బృహదారణ్యకోపనిషత్తు దేవతలు 33 మంది, వారి మహిమల సంఖ్య 3306, వారు అష్ట వసువులు (8) ఏకాదశ రుద్రులు (11) ద్వాద. ఆదిత్యులు (12) ఇంద్రుడు (1)ప్రజాప్రతి (1) వెరసి ముప్పది ముగ్గురు (33) అనుచున్నది.
కృష్ణ యజుర్వేదము నందలి 7/1/5 వ మంత్రము, ఈ దేవతలనందరినీ విశ్వకర్మ సృజించెను అనుచున్నది.
సత్యమనునది ఒక్కటే విప్రులు బహువిధములుగా చెప్పుచున్నారను చున్నది (ఏకం సత్ విప్రాః బహుధా వదంతి) అని ఋగ్వేద 1/164/46 మంత్రము.
నాస్తికో వేదనిందకః = వేదమును నిందించుట (కాదనుట) అని శాస్త్రము.
మరి వీరినందరిని వదలివైచుట స్తుతి యగునా నింద యగునా?
ఋగ్వేదమందలి 1/28 వ సూక్తము,
10/94 వ సూక్తము - రోలు రోకలి రుబ్బురాయి కవ్వము తిత్తి ప్రస్తరములను పేర్కొనినది.
ఇవి యజ్ఞసాధనములు అట. ఇవి ముందే జనించినవేమో!
వీటి నిర్మాతలు మాత్రము అతి సంకరులని (అ)ధర్మశాస్త్రములను చున్నవట.
నా తల సందేహముల పుట్ట.
నా అజ్ఞానమునకు మహదాస్తికులైన
పండితులు మన్నింతురు గాక!
నమో నమః నమో నమః నమో నమః బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో సానగాది ఋషిభ్యో గురుభ్యో నమః౹
తప్పులు సవరించగలరు.
What's Your Reaction?






