విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం- 365 రోజులు : పుప్పాల సత్యనారాయణ
పుప్పాల సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటం కం ఈరోజుకు 365 రోజులు

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు పెదకాకాని సెంటర్ లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పొన్నూరు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు కే అగస్టీన్ అధ్యక్షత వహించగా గుంటూరు జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ .
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటం కం ఈరోజుకు 365 రోజులు అయింది అని ఈ సందర్భంగా 365 జెండాలతో విశాఖపట్నంలో ఈరోజు చేపట్టిన పోరాటానికి సంఘీభావంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని, భారతదేశానికి ఉక్కు పరిశ్రమ ఇచ్చుటకు రష్యాతో ఒప్పందం కుదిరినప్పుడు ఆ వచ్చే ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలని .
ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరాట పిలుపునిస్తే విద్యార్థులు యువకులు పోరాటంలో పాల్గొని 32 మంది యువకుల బలిదానాలతో ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి వచ్చిందని అటువంటి ఉక్కు పరిశ్రమను ఈ నాటి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవటం దారుణమన్నారు అంతేకాకుండా ఇప్పటికే రైల్వే 50 స్టేషన్లు వరకు మరియు ఎయిర్ లైన్స్ ను టాటా గ్రూప్కు అమ్మటం జరిగిందని, lic మరియు బొగ్గు గనులను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చూడటం జరుగుతుందన్నారు.
తద్వారా బడుగు బలహీనవర్గాల అయినా ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పించే రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచనతో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కార్మికులందరూ సంఘటితమై ఎదుర్కొని గద్దె దించాలని పిలుపునిచ్చారు ,ఈ కార్యక్రమంలో ఆర్ కుమారి ,CH విజయలక్ష్మి, ఆర్ శ్రీనివాసరావు, జి సుబ్బారావు, ఎస్ కె బాసీద్ ,జి సుబ్బారావు, జి రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?






