ఆర్ కృష్ణయ్య గారి బీసీ ఉద్యమ ప్రస్థానానికి నిండా 45 ఏళ్ళు - టైగర్ కుర్రం

బీసీ ఎస్సి ఎస్టీ విద్యార్థుల కోసం పోరాడి 1982 సంవత్సరంలో 44 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయించారు,ఆ సంఖ్య సంఖ్య ఇప్పుడు 1200 వందల పాఠశాలల పైనే ఉంది,అందులో ఆరు లక్షల మంది విద్యను అభ్యసిస్తూ ఉన్నారు..

May 20, 2022 - 12:48
May 20, 2022 - 12:58
 0

ఆర్ కృష్ణయ్య గారి బీసీ ఉద్యమ ప్రస్థానానికి నిండా 45 ఏళ్ళు.... బీసీలకు రెండు రాజ్య సభలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాజ్యసభకు ఎంపికైన ఆర్. కృష్ణయ్య లకు హిందూ కళాశాల సెంటర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి యువజన సంఘాలు.

ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గడ్డం శంకర్ జాతీయ బిసి విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ : తెలంగాణ ఏర్పడి 8 ఏళ్ళు అవుతుంది,మిగతా 37 ఏళ్ళు అవిభక్త(అంటే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లోని బీసీల కోసం కూడా) ఆంధ్రప్రదేశ్ లోని బీసీల కోసమే ఉద్యమిస్తూ జీవిత కాలం సుదీర్ఘంగా పోరాడాడు.

1954 రంగారెడ్డి జిల్లాలో భూస్వాముల కుటుంబంలో జన్మించాడు ఆర్ కృష్ణయ్య,తన అపారమైన జ్ఞానంతో పట్టభద్రునిగా గోల్డ్ మెడల్ సాధించి గ్రూప్ 2 ఉద్యోగాలు,ఎమ్మెల్యే ఆఫర్లను కూడా వదిలి బీసీ ఉద్యమ పంథాను ఎంచుకున్నారు,ఒక్క బీసీనే కాదు ఎస్సి,ఎస్టీ వర్గాల తరుపున కూడా పోరాడారు.

బీసీ ఎస్సి ఎస్టీ విద్యార్థుల కోసం పోరాడి 1982 సంవత్సరంలో 44 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయించారు,ఆ సంఖ్య సంఖ్య ఇప్పుడు 1200 వందల పాఠశాలల పైనే ఉంది,అందులో ఆరు లక్షల మంది విద్యను అభ్యసిస్తూ ఉన్నారు... అలాగే బీసీ హాస్టళ్లు,వారి స్కాలర్ షిప్పుల పెంపు కోసం పోరాడి సాధించారు,ప్రభుత్వ హాస్టళ్లలో మెనూను మార్పించి పౌష్టికాహారం అందేలా చేయడంలోనూ ఆయన కృషే కీలకం...

నిరుద్యోగులకు అండగా ఉద్యోగాలు భర్తీ చేయాలని చేసిన పోరాటల్లోనూ ఆయనే అగ్రగణ్యుడు,ఉద్యోగ నియామకాల్లో అవినీతిని అడ్డుకోవడానికి టీచర్,పోలీస్,గ్రూప్ 2,ఏపీపీఎస్సి లలో ఇంటర్వ్యూలను రద్దు చేయించి రాత పరీక్షల ఆధారంగా ఉద్యోగాలు వచ్చేలా పోరాడి సాధించిన ఘనత ఆయనది... 1976 నుండి 1990 వరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో,విద్యాలయాల్లో రిజర్వేషన్లు పెట్టాలని పోరాడారు...

మొరార్జీ దేశాయ్,ఇందిరాగాంధీ,విపి సింగ్ లాంటి ప్రధానులతో చర్చలు జరిపి 27% రిజర్వేషన్లు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

పీవీ హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 సంవత్సరాలు వయోపరిమితి పెంచడంలో కీలక పాత్ర పోషించారు. కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో సైతం బీసీ రిజర్వేషన్ కోసం పోరాడి సాధించింది ఆ కృష్ణయ్య నే.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి వందల జీవోలను తెప్పించిన ఘనత కూడా ఈయనదే...ఈ పోరాటాల ఫలితమే దేశంలోనే బీసీ ఉద్యమంలో మొదటి స్థానం,స్కీమ్స్ లోనూ మొదటి స్థానంలో ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇలాంటి ఆర్ కృష్ణయ్యకు తెలంగాణ,ఆంద్రప్రదేశ్ అంటూ ఒక గీత గీసి వేరు చేయాలని చూస్తున్నారు,అది సమంజసమే కాదు.

ఇప్పటి వరకు ఎవరూ ఆయన విలువను సరిగ్గా గుర్తించలేదు,మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆయనను పెద్దల సభ అయిన రాజ్యసభకు ఎన్నుకున్నారు.

ఇది ఆర్ కృష్ణయ్య గారికి దొరికిన గుర్తింపు కాదు బీసీలకు ప్రతినిధిగా ఆయన జీవితాన్ని ధారపోసి మరీ బీసీల కోసం ,బీసీల కొరకు బీసీలు దక్కించుకున్న గౌరవం అని అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు సిరిబోయిన అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. sk. సుభాని, చావలి మాధవ్, కుర్రం శశి కుమార్ , చంద్ర , గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow