ప్రవీణ్ కుమార్ ను ఎలా అర్థం చేసుకోవాలి

Aug 7, 2020 - 17:06
Jul 18, 2021 - 18:39
 0
ప్రవీణ్ కుమార్ ను ఎలా అర్థం చేసుకోవాలి
ప్రవీణ్ కుమార్ ను ఎలా అర్థం చేసుకోవాలి

పరిమాణాత్మక మార్పు ద్వారా గుణాత్మక మార్పు వైపు పయనిస్తాం. గుణాత్మక మార్పును నిర్దిష్టంగా చేరుకొవడమే విప్లవం. గుణాత్మక మార్పునే విప్లవం అంటారు. విప్లవం వొక సడెన్ లాంగ్ జంప్ కానేకాదు. అలా లాంగ్ జంపు చేసిన ప్రయత్నాలన్నీ తిరిగి పరిణామాత్మక మార్పుల మీదనే దృష్టి పెట్టాయి. ఉదాహరణకు చైనా అర్ద వలస, అర్ద భానిస, అర్ద భూస్వామ్య, అర్ద పెట్టుబడి దారీ వ్యవస్థ దశలో విప్లవం అంటే మావో నాయకత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టీ రాజ్యాధికారం సాధించింది. 1948 నుండి ఇప్పటికీ ఆ పార్టీ అక్కడ పాత సమాజంలోని అర్ద దశలను సంపూర్ణంగా నిర్మూలించే పనిలోనే నిమగ్నమై ఉంది. ఇంకా చెప్పాలంటే సంపూర్ణ పెట్టుబడిదారీ సమాజాన్ని చైనాలో నిర్మించే పనిలో వున్నారన్న మాట. ఇంకా చెప్పాలంటే చైనాలోని అర్ద పెట్టుబడిదారీ సమాజాన్ని అడ్వాన్స్ దశకు తీసుకెళ్లి అర్ద సామ్రాజ్యవాద దశకు అది చేరుకుంది. కాబట్టి quantitative changes leads to qualitative change. మరో ఉదాహరణ చెప్తా. ఒక్కో రూపాయి చేరిస్తే పది లక్షలు అయినట్టు అన్న మాట. 

ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే డా. ఆర్.యస్. ప్రవీణ్ కుమార్ గారి వల్ల ఇప్పుడే వొక పరిణామాత్మక మార్పు మొదలైంది. కెసిఆర్ ప్రభుత్వ సహకారంతో ఎస్సీ ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చారు. విద్యారంగం మీద ఆయన నాయకత్వంలో సాధించిన విజయాల ప్రభావం గొప్పగా వుంది. ఏ విజయాన్నైనా, ఏ ఫలితాన్నైనా అది ప్రజల ఆలోచనల్లో తెచ్చిన మార్పును బట్టే అంచనా వేయాలి. ఆ రకంగా చూసినపుడు ప్రవీణ్ సార్ విద్యార్థులు నమోదు చేసిన విజయాలు తెలంగాణ ప్రజల మనో ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేశాయి. భవిష్యత్తు మీద భరోసా కలిగింది. వొక విజనరీ లీడర్ దొరికాడని అన్ని వర్గాల ప్రజలు సంతోషంతో వున్నారు. తను తన పరిమితుల్లో చేయగలిగినదంతా చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు స్వేరో పెడగాగీ మీద ఆసక్తి కనబరుస్తుందంటే అది అతిశయోక్తి కానే కాదు. 

కొన్ని లక్షల మంది విద్యార్థులు కొత్త భవిష్యత్తుకు ఆశగా కనిపిస్తున్నారు. వాళ్ల తల్లి దండ్రులు నిండైన నమ్మకంతో వున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ అనేది ఆయన లక్ష్యం. అందుకే అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నారాయన. నిజానికి విద్యార్థులు చేసే వినూత్న ఆలోచనల్లోంచి ఆయన కార్య క్షేత్రం విస్తృతమవుతుంది. ఎక్కడో మారుమూల దట్టమైన అడవిలో వొక విద్యార్థి కొంతమంది పిల్లలకు వొక ఆకుల గుడిసెలో పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు. అదే విలేజ్ లర్నింగ్ సెంటరైంది. ఆ పని అద్భుతం. నాలాంటి వాళ్లకు అందులో ఎంతో బలం కనిపించింది. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న, చదివిన విద్యార్థులు పిల్లలకు పాఠాలు చెప్పే పని మొదలు పెట్టారు. చివరికి ఆరు నుండి పది వరకు చదువుతున్న విద్యార్థులు ఎంతో సృజనాత్మకంగా తోటి పిల్లలకు క్లాసులు చెప్తున్నారు. క్లాసికల్ డ్యాన్స్ లు అద్భుతంగా నేర్పిస్తున్నారు. క్లాసికల్ మ్యూజిక్ నేర్పుతున్నారు. వొక్కటేమిటీ కరోనా పరిస్థితులను కూడా క్రియేటివ్ గా ఉపయోగించుకుంటున్నారు. ఈ పిల్లలు చేసే ఇన్ని అద్భుతమైన పనులేవీ ప్రవీణ్ కుమార్ చెప్పినవి కావు. వాళ్లు సృష్టిస్తున్న అద్భుతాలను ఆయన ప్రపంచానికి తెలియ చేయడానికి వొక తండ్రి గా అధికారిగా ఉత్సాహ పడుతున్నారు. ఇదే వొక విజయం ప్రజల మనసుల మీద వేసే ప్రభావం. ప్రజల ఆచరణలో వ్యక్తమయ్యే మార్పు కూడా. 

ప్రవీణ్ కుమార్ గారి పట్ల దళితుల్లోనే నమ్మకం, అభిమానం వున్నాయి. ఇతర వర్గాల్లో లేవనుకుంటే పొరపాటు పడ్డట్టే. కుల, మతాలకు అతీతంగా ఆయన్ని అభిమానిస్తున్నారు. బాగా గౌరవిస్తున్నారు. ప్రజలెప్పుడూ తమ కులం కొలమానాలతోటే అన్నిటినీ తూచరు. అలాంటి ప్రయత్నం తొలిదశలో జరుగుతుంది. కానీ వొక సమర్ధుడైన వ్యక్తి మార్పు కోసం, ముఖ్యంగా పేద వర్గాల వికాసం కోసం పరితపిస్తూ కష్టపడుతూ ఫలితాలు చూపిస్తోంటే తప్పకుండా ఆ వ్యక్తిని అభినందిస్తారు. అంతకన్న ఎక్కువగా అభిమానిస్తారు. అందుకు సుధామూర్తి నిదర్శనం. ఎవరెస్టును ఎక్కిన తరువాత పూర్ణను, ప్రవీణ్ కుమార్ ను ఆమె అభినందించిన తీరు చూడండి. నాకైతే ఆమె మానవతా హృదయం గోచరిస్తుంది. 

విలేజ్ లర్నింగ్ సెంటర్లను చూసి కొన్ని సంస్థలు, కొంతమంది జాతీయ స్థాయి నాయకులు కూడా కలవర పడొచ్చు. కానీ అంత అవసరం లేదు. అవి పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే, సమాజానికి తప్పకుండా మంచి జరుగుతుంది. వాటిని భావజాలాల దృష్టి నుండి చూడొద్దు. అవి ఏదో వొక ఐడియాలజీని మోసుకెళ్లే కేంద్రాలు కావు. భావజాలాల సంఘర్షణలకు, లేదా భావజాలాల ఆధిపత్య రాజకీయాలకు వాటిని బలివ్వరాదు. అవి సమాజ మార్పుకు ఉపకరించే పరిణామాత్మక కేంద్రాలు. వొకప్పుడు అటవీ ప్రాంతాలలో పని చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ మనకు నచ్చక పోయినా సరే, కొన్ని మతసంస్థలు అడవుల్లోకి వెళ్లి స్కూళ్లు నడిపారు. ఆ ఆదివాసులు చదువుకున్నారు. ఏదోవొక మార్పు వచ్చింది. అలాంటి పని క్రైస్తవ మిషనరీలు మాత్రమే కాదు, హిందూ సంస్థలు కూడా చేశాయి. నేను చిరపుంజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో దశాబ్దాల క్రితం పెట్టిన రామకృష్ణ మిషన్ హై స్కూల్ వుంది. చిరపుంజీలోని ఖాసి తెగ పిల్లలకు అదే పెద్ద స్కూల్. ఆ స్కూల్ వాళ్లకు ఇంకా చదువు చెప్తూనే వుంది. 

కేంద్రాన్ని పాలిస్తున్న పాలక పార్టీ నాయకులకు, లేదా కొంతమంది తీవ్రవాద భావాలున్న వారికి ప్రవీణ్ కుమార్ విద్యార్థుల విజయాలు, క్రియేటివిటీ అలజడి కలిగించొచ్చు. కానీ వాటిని సానుకూల దృష్టితో చూస్తే ఎంతో మంచి కనిపిస్తుంది. ఇది నా హితువు. లేకపోతే రోహిత్ వేముల, ప్రణయ్ ల విషయంలో తప్పు చేసి,అట్టడుగు వర్గాలకు దూరమైనట్టే, ప్రవీణ్ కుమార్ విషయంలో తప్పు చేసి మరింత దూరమవుతారు. 

- డా.జిలుకర శ్రీనివాస్
ద్రవిడ బహుజన సమితి
రాష్ట్ర అధ్యకులు.

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow