రోజుకో ఆత్యాచారం-రోజుకో హత్య ఇది జగన్ రెడ్డి పాలన: గాదె వెంకటేశ్వరరావు

 పాదయాత్రలో లో ముద్దులు పెట్టుకుంటూ.. అక్క ..చెల్లి.. అవ్వా అంటూ రాష్ట్రమంతా తిరిగి...మహిళలకు రక్షణగా ఉంటానన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

రాష్ట్రంలో రోజుకో ఆత్యాచారం.. హత్య జరుగుతుంటే పట్టించుకోకుండా తాడేపల్లి ప్యాలెస్ లో సేద తిరుతున్నాడని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా తలపెట్టిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని..

అధికార పార్టీ నాయకులే అత్యాచారాలకు ఒడికడుతున్న పోలిసులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

చిన్న పిల్లలను కూడా వదలడం లేదన్నారు.... రాష్ట్రంలో ఎదో ఒక మూల మహిళలు అత్యాచారానికి బలవుతున్న .

హోంమంత్రి, మహిళ కమిషన్ చోద్యం చూస్తూ మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు.

తల్లిదండ్రులు సరిగాపెంచకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని హోం మంత్రి మాట్లాడం సిగ్గుచేటని.

ఇటువంటి వారు ప్రజల్ని పాలించడం దౌర్భాగ్యమని గాదె అన్నారు. దశ దిశ లేని దిశ చట్టం తో ఎవరికి ప్రయోజనలేదన్నారు.

ముఖ్యమంత్రి ఇప్పటికైనా మొద్దు నిద్ర విడి రాష్ట్రంలో ఎం జరుగుతోందో తెలుసుకోవాలన్నారు. లేకపోతే పెద్ద ఎత్తిన ఉద్యమం చేస్తామన్నారు.

మహిళలకు అండగా జనసేన పార్టీ.. శ్రీ పవన్ కల్యాణ్ గారు అండగా ఉంటారని చెప్పారు..

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యవర్గ సభ్యులు, టౌన్ అధ్యక్షులు ..వీరమహిళలు భారీగా పాల్గొని విజయవంతం చేశారు...