భారతావని తరుపున, భవనకార్మికుడి కొడుకు
ఒక కూలి వాని కొడుకు అంతర్జాతీయ క్రీడలకు వేళ్ళ గలడా ? ఎలా సాధ్యం ? SWAERO ఏమి చేసింది .

సూర్యపేట ప్రాంతంలో రోజువారీ కూలి మేస్త్రీ పనిచేసుకుంటూ బ్రతికే నిరుపేద కుటుంబానికి చెందిన విశ్వనాథ్ పాడిదాల, తన కళ్ళముందే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూశాడు.
జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే గట్టి సంకల్పనతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో సీటు సాధించాడు.
పేద ప్రజల బిడ్డల కళను సహకారం చేస్తున్న గొప్ప మేధావి,పేదప్రజల అధికారి తెలంగాణ గురుకులాల కార్యదర్శి డా , ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ IPS గారు, విశ్వనాథ్ ప్రతిభను గుర్తించి మనం ఎవరికంటే తక్కువకాదు అనే భావన తొలగించి, నిరంతరం ప్రోత్సహంతో 2017లో సబ్ జూనియర్ ఇంటర్నేషనల్ రెగట్టాలో జరిగిన అంతర్జాతీయ ఈవెంట్‌లో రజత పతకం సాధించారు.
ఆప్టిమిస్ట్‌లోని నేషనల్ స్క్వాడ్‌లో భాగంగా కొనసాగాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఆప్టిమిస్ట్ వరల్డ్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ 2021 లో జూనియర్ బాలుర యాచింగ్ జట్టు భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించాడు.
తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన 14 ఏళ్ల బాలుడు పాడిదాలా విశ్వనాథ్ స్వేరో ఎంపిక కావడం భారతదేశం గర్వించదగిన విషయం. ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాం , భారతీయుల సత్తాను తెలియచేద్దాం
What's Your Reaction?






