జనసేన- సామాన్య దళిత కుటుంభం లో జన్మించి అసామాన్యుడుగా ఎదిగిన దామోదరం సంజీవయ్య -భావన్నారాయణ

కేంద్రంలో పలుశాఖలకు మంత్రిగా, దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ నుండి పనిచేసి, సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ కు రెండుసార్లు అధ్యక్షునిగా పనిచేసి అత్యంత అరుదైన గౌరవం పొందిన విశిష్టవ్యక్తి స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారని గుంటూరు జిల్లా జనసేనపార్టీ అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ

May 8, 2022 - 14:59
May 8, 2022 - 16:01
 0
జనసేన- సామాన్య దళిత కుటుంభం లో జన్మించి అసామాన్యుడుగా ఎదిగిన దామోదరం సంజీవయ్య -భావన్నారాయణ

సామాన్య దళితకుటుంబంలో జన్మించి అసామాన్యుడుగా ఎదిగి కేంద్రంలో పలుశాఖలకు మంత్రిగా, దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ నుండి పనిచేసి, సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ కు రెండుసార్లు అధ్యక్షునిగా పనిచేసి అత్యంత అరుదైన గౌరవం పొందిన విశిష్టవ్యక్తి స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారని గుంటూరు జిల్లా జనసేనపార్టీ అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ అన్నారు.

వీడియో ఇక్కడ చుడండి.

 ఈరోజు సంజీవయ్య గారి వర్ధంతిని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భావన్నారాయణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు సంజీవయ్య గారి పేరు పెట్టాలని జనసేనపార్టీ సూచించినప్పటికీ ముఖ్యమంత్రి గారు అందుకు అనుకూలంగా స్పందించలేదని అసంతృప్తిని వ్యక్తపరిచారు.

సంజీవయ్య గారు మరికొంతకాలం పరిపాలించి ఉంటే నేటి సామాజికన్యాయ పోరాటాల అవసరమే ఉండేది కాదని ఆయన అన్నారు. జనసేన అధికారంలోకి రాగానే సంజీవయ్య గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు తమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంజీవయ్య గారి స్వగృహాన్ని భావితరాలకు సంజివయ్యగారి గొప్పతనాన్ని చాటిచెప్పే ఒక స్మారక చిహ్నంగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయల ఆర్థిక సహాయం కూడా ప్రకటించారని, వారి స్ఫూర్తితో జనసేనపార్టీ నడుచుకుంటుందని తెలిపారు.

కార్యక్రమంలో పార్టీ కార్యాలయ ఇంఛార్జి సిరిగిరి మణికంఠ, ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, వీర మహిళలు నామా పుష్పలత, గట్టు శ్రీదేవి, మాలెంపాటి సౌజన్య, జనసైనికులు షేక్ ఆదం షఫీ @ చిట్యాలు, కుడుతూరి సిసింద్రీ, రాయుడు బాలకృష్ణ, తులవ గోపీచంద్, రామిశెట్టి సందీప్, సాంబ, తిరుమలశెట్టి సైదయ్య తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow