ప్రొఫెసర్ చండ్రపాటి- సంచలన వ్యాఖ్యలు - ఇది లాజికల్ ఆ కాదా అనేది మీరే కనుక్కోండి

Proffesor ChandraPati - మరి భారతదేశ సరిహద్దులలో మన కోసం యుద్ధం చేస్తూ మనకు రక్షణ కలిగిస్తున్న వీర జవానులకు గుడులు కట్టాలి. పూజలు చేయాలి. మంత్రాలు చదవాలి.

ప్రొఫెసర్ చండ్రపాటి- సంచలన వ్యాఖ్యలు - ఇది లాజికల్ ఆ కాదా అనేది మీరే కనుక్కోండి
Proffesor ChandraPati

యుద్ధాలు చేసిన వారే దేవతలా? 

వారెవరికోసం యుద్ధాలు చేశారు?

భార్యా పిల్లలు బంధువుల కోసమా?

శత్రువులకోసమా? ప్రజలకోసమా?

అసలు దేవుడు యద్ధాలు చేయడమేమిటి?

యుద్ధాలు అనగా కక్షలు కార్పణ్యాలు. తంత్రాలు కుతంత్రాలు మాయలు.

దేవుళ్ళకు ఇవన్నీ అవసరమా? 

దేవతలు రాక్షసులు మానవులు చరాచరజగత్తంతా దేవుడి సృష్టియే కదా!

అంటే తన వారిపై, మన వారిపై,  తన దేశంలోనే తనకు శత్రువులా? తను సృష్టించిన తన సంతానంతోనే యుద్ధాలా?

దేవతలు సర్వతంత్ర స్వతంత్రులు.  వారికి యుద్ధాలు చేయవలసిన అగత్యమేమిటి?

యుద్ధాలు చేసే వాళ్ళు దేవతలైతే వారికి పూజలైతే .....!

"మరి భారతదేశ సరిహద్దులలో మన కోసం యుద్ధం చేస్తూ మనకు రక్షణ కలిగిస్తున్న వీర జవానులకు గుడులు కట్టాలి. పూజలు చేయాలి. మంత్రాలు చదవాలి."

కనుక, కొంచెం ఆలోచించండి. సృష్టి స్థితి లయలు చేసే దేవుడు ఎవరో ఒకడే పరాత్పరుడు.

ఆ పరాత్పరుడే సర్వస్య కర్త.  ఏదైనా చేయగలడు.

మనము మనసులో తలచుకున్నచాలు. మన యోగ్యతను బట్టి ఇవ్వగలడు.

యోగ్యతను బట్టే కదా ఉద్యోగము. మన కోరికలు యోగ్యతను బట్టియే యుండవలయును.

యతో వా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి, యత్ ప్రయంతి అభిసంవిశంతి౹ (తై.ఉ)

యథా తథ అనువాదము .....

'ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు'  (పోతనామాత్యుడు)

ఆతనిని మాత్రమే శరణు వేడవలెను.

ఆ దేవాదిదేవుడు మనకు ఆలోచించే శక్తినిచ్చాడు. ఆలోచించుకుందాము. 

మనం ఆస్తికులం. వేదం మన ఆస్తి హక్కు.యుద్ధాలు చేయకుండా, మన కర్మానుసారము మనకు అన్నీ ఇవ్వగల పరాత్పరుడెవ్వడు?

ఈ విశ్వమునకు మూలకారణమెవ్వడు?

 ఆ పరాత్పరునే శరణంబు వేడెదము గాక!

Professor ChandraPati