భారత ప్రభుత్వ డిజిటల్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించిన శ్రీ ప్రకాష్ జవదేకర్

Jan 10, 2021 - 12:16
 0
భారత ప్రభుత్వ డిజిటల్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించిన శ్రీ ప్రకాష్ జవదేకర్
Digital Calendar and Diary of Government of India

భారత ప్రభుత్వ డిజిటల్ క్యాలెండర్ మరియు డైరీని కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు. ఈ రోజు నేషనల్ మీడియా సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి వీటిని ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, ఐ ఓ ఎస్ మొబైల్ అప్లికేషన్ లలో వీటిని చూడవచ్చును. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన మంత్రి ఇంతకాలం ప్రభుత్వం క్యాలెండర్లు గోడలపై కనిపించేవని ఇకపై ఇవి మొబైల్ ఫోన్లలో కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. ' ఈ యాప్ ఉచితంగా 11 భారతీయ భాషలలో జనవరి 15వ తేదీనుంచి అందుబాటులో ఉంటుంది.' అని మంత్రి ప్రకటించారు. యాప్ ప్రత్యేకతలను వివరిస్తూ ' ఇకపై ప్రతి ఏడాదీ కొత్త క్యాలెండర్ ను తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. కేలండర్ లో ప్రతి నెలా విభిన్న నేపథ్యంతో ఒక ప్రముఖ భారతీయుని వివరాలతో ఒక సందేశం ఉంటుంది. ఇంతవరకు ప్రభుత్వం ప్రారంభించిన పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు దీనిలో ఉంటాయి' అని మంత్రి తెలిపారు.

డైరీని కూడా అనేక ప్రత్యేకతలతో రూపొందించడం జరిగిందని మంత్రి తెలిపారు. డైరీతో కలసి కేలండర్ ను రూపొందించడం వల్ల డైరీలో అనేక ప్రత్యేకతలు ఉంటాయని ఇతర యాప్ లతో పోల్చి చూస్తే దేనిని సులువుగా ఉపయోగించవచ్చునని మంత్రి అన్నారు.

'డిజిటల్ ఇండియా'ను రూపొందించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ లక్ష్యంలో భాగంగా డిజిటల్ క్యాలెండర్ కు రూపకల్పన జరిగింది. ఒక్క బటన్ నొక్కితే స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ ప్రత్యక్షం అవుతుంది.

గూగుల్ ప్లే, ఐఓఎస్ యాప్ స్టోరుల ద్వారా దేనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు అనుబంధం గా పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఔట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్ ఈ యాప్ కు రూపకల్పన చేసింది. ప్రస్తుతానికి ఇది ఆంగ్ల, హిందీ భాషలలో లభిస్తుంది. త్వరలో 11 ప్రాంతీయ భాషలలో దీనిని అందుబాటులోకి తీసుకునివస్తారు.

ఇంతవరకు ప్రచురితమైన ప్రభుత్వ క్యాలెండర్ దేశంలో పంచాయతీ స్థాయి వరకు లభించేది. ఆధునిక సాంకేతిక అంశాలతో రూపొందిన యాప్ ను ప్రపంచంలో ఎక్కడ నుంచి అయినా చూడవచ్చును.

భారత ప్రభుత్వ క్యాలెండరులో ఈ కింది ప్రత్యేకతలు ఉంటాయి.

i. భారత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాలు మరియు ప్రచురణలు

ii. అధికారిక సెలవు దినాలు మరియు ముఖ్యమైన తేదీలు

iii.స్ఫూర్తి ఇచ్చే ప్రముఖుల సందేశాలు

iv. వివరాలను నమోదు చేసుకోడానికి అవకాశం. ఈ వివరాల భద్రత పరిరక్షింపబడుతుంది.

v. సమావేశాలు ముఖ్యమైన తేదీలను సందర్భాలను గుర్తు చేయడానికి రిమైండర్ లను అమర్చుకోవడం

vi. ప్రతి ఒక్కరికి అందుబాటులో భారతదేశం/ సుగమ్య భారత్ అభియాన్ అన్న  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఆశయ సాధన కోసం కంటి చూపులేని వారు చూసే విధంగా యాప్ ను అభివృద్ధి చేయడం జరుగుతుంది.

ఈ అప్లికేషన్ ను గూగుల్ ప్లే స్టోర్ https://play.google.com/store/apps/details?id=in.gov.calendar ద్వారా ఆండ్రాయిడ్ పరికరాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

ఐఓఎస్ పరికరాలు https://apps.apple.com/in/app/goi-calendar/id1546365594 ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow