శివలింగాలు విశ్వకర్మ చిహ్నాలు - వేద బ్రహ్మశ్రీ ఆచార్య మోహన్ రావు శర్మ

అప్పట్లో పరమాత్మ ప్రతిరూపము భింబమని చెబుతూ పూజలు చేసేవారు. పురాణాలు వ్యాప్తమైన తర్వాత ఒక కాలఘట్టంలో అతిపెద్ద మారణ హోమంలో విశ్వబ్రాహ్మణులందరూ కూడా చంపబడుతున్నప్పుడు కొందరు తప్పించుకు పారిపోయారు వారే చేసినటువంటి పుష్పక విమానాల్లో చాలా దూరంగా విదేశాలకు వెళ్లిపోయారు.

Jul 22, 2022 - 08:55
 0
శివలింగాలు విశ్వకర్మ చిహ్నాలు - వేద బ్రహ్మశ్రీ ఆచార్య మోహన్ రావు శర్మ

శైవాగమము ప్రకారము శివుడికి ఇటువంటి ఒక రూపం ఉంటుంది. ఇందులో సూక్ష్మాన్ని మీరు గమనించినట్లయితే అది విశ్వకర్మ యొక్క చిహ్నముగా శివలింగాన్ని మన పూర్వీకులు ఆరాధిస్తూ వచ్చారు.

అప్పట్లో పరమాత్మ ప్రతిరూపము భింబమని చెబుతూ పూజలు చేసేవారు. పురాణాలు వ్యాప్తమైన తర్వాత ఒక కాలఘట్టంలో అతిపెద్ద మారణ హోమంలో విశ్వబ్రాహ్మణులందరూ కూడా చంపబడుతున్నప్పుడు కొందరు తప్పించుకు పారిపోయారు వారే చేసినటువంటి పుష్పక విమానాల్లో చాలా దూరంగా విదేశాలకు వెళ్లిపోయారు.

కొందరు అరణ్యాలకు వెళ్లిపోయారు అలా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న ఆదివాసీలతో కలిసి వీరికి ఉండే తంత్ర జ్ఞానంతో విజ్ఞాన నైపుణ్యంతో అక్కడ పెద్ద పెద్ద నగరాలనే ఏర్పాటు చేశారు. మరి కొంతమంది రాజ భటులకు చిక్కి ప్రాణాలు కోల్పోయారు.

చాలా తక్కువ మంది ప్రాణం పైన ఉన్న తీపి తో వారి స్నేహితుల ఇండ్లలో తలదాచుకుని ఉన్నప్పుడు అక్కడ కూడా భటులు వచ్చి వాళ్ళల్లో మాంసాహారం సేవించిన తర్వాత వారిని విడిచిపెట్టి వెళ్లేవారు ఈ విధంగా విశ్వబ్రాహ్మణులు కొంతమంది మాంసాహారానికి అలవాటైనారు. ఇటువంటి వారు షట్ కర్మలకు దూరమై వైదిక ఆచారాన్ని విడిచిపెట్టి శూద్రులుగా బ్రతకడం మొదలుపెట్టారు. లేకుంటే ప్రాణాలు పోతాయని భయం.

ఈ పరిస్థితి లో అప్పుడు ఈ బింబాలను శివపురాణం ను అన్వయిస్తూ దానికి సరిపోయిన ఏదో ఒక కట్టుకథను వ్రాసి ప్రచారం చేశారు. అప్పట్నుంచి విశ్వకర్మ ప్రతిరూపమైన బింభాలు శివలింగాలుగా మారాయి. రూపం లేని వారికి నిరాకార రూపమైన వృత్తాకార బింబములు ప్రతిష్టాపన చేసుకోవడం శాస్త్ర సమ్మతం. రూపము లేనిది ఎవరికి అంటే పరమాత్మకు మాత్రమే రూపం ఉండదు నిరాకార నిర్గుణ స్వరూపుడు.

కానీ శివుడికి అయితే రూపం ఉందిగా. శివుడికే కాదు పరమాత్మ విశ్వకర్మ కు మినహా మిగతా అందరి దేవతలకు కూడా రూపములు ఉన్నవి. ఆ రూపములు త్వష్ట ప్రజాపతి అందరి దేవతలకు రూపాలను కల్పించాడు తర్వాత వాళ్ళందరికీ పేర్లు పెట్టి వారి వారి విధులను నియమించి సృష్టిని కాపాడమని ఆజ్ఞాపించాడు. ఇక్కడే మీరు ఆలోచించాల్సి ఉంటుంది. పంచవక్త్రం జటాధారం........

అనే ధ్యాన శ్లోకాన్ని నిరాకారడు నిర్గునుడు , సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ సాకార రూపమునకు వచ్చి ప్రజాపతి త్వష్ట విశ్వకర్మగా రూపము దాల్చిన సందర్భం యొక్క ధ్యాన శ్లోకం అది. శైవులు అ ధ్యాన శ్లోకాన్ని శివుడికి అప్లై చేస్తారు. వేద ఆధారంగా పరిశీలించిన సత్యము బోధపడును. శ్రీకాళహస్తి క్షేత్రంలో గోడపై గల పురాతన వర్ణ చిత్రము మరియు ఇటీవల కాలంలో మార్పు చేసిన వర్ణ చిత్రంను గమనించండి. పురాతన వర్ణ చిత్రంలో మెడలో పాము ఉండదు.

అది విశ్వకర్మ యొక్క సహకార రూపమైన త్వష్ట ప్రజాపతిదే అని తెలుస్తుంది. నూతన చిత్రంలో మెడలో పామును చిత్రీకరించారు. ఇట్లు మీ యొక్క వేద బ్రహ్మశ్రీ ఆచార్య టి మోహనరావు శర్మ. స్థపతి . బెంగళూరు.9341265719.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow