శ్రీ కేదారేశ్వర వ్రతం కధ తెలుగు లో Sri Kedareswara Vratha Katha in telugu free

May 4, 2022 - 13:03
 0

శ్రీ మహాగణపతి పూజ (పసుపు గణపతి పూజ చేసిన తరువాత ఇక్కడ నుండి ప్రారంభించండి )

సంకల్పం –

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ ఫలావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్య శ్రీ కేదారేశ్వర దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

నమస్కారం –

ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే |

వోచేమ శంతమం హృదే ||

అస్మిన్ కలశే శ్రీ రుద్రమూర్తిం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ఓం గౌరీర్మిమాయ సలిలాని తక్షత్యేకపదీ

ద్విపదీ సా చతుష్పదీ |

అష్టాపదీ నవపదీ బభూవుషీ

సహస్రాక్షరా పరమే వ్యోమన్ ||

శ్రీ మహాగౌరి దేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి |

ప్రాణప్రతిష్ఠ –

ఓం అసునీతే పునరస్మాసు చక్షుః

పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్ |

జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరన్త

మనుమతే మృడయా నః స్వస్తి ||

అమృతం వై ప్రాణా అమృతమాపః

ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ||

ఆవాహితో భవ స్థాపితో భవ |

సుప్రసన్నో భవ వరదో భవ |

ధ్యానమ్ –

శూలం డమరుకంచైవ దధానం హస్తయుగ్మకే |

కేదారదేవమీశానం ధ్యాయేత్ త్రిపురఘాతినం ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ధ్యాయామి ||

ఆవాహనం –

కైలాసశిఖరే రమ్యే పార్వత్యాః సహిత ప్రభో |

ఆగచ్ఛ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ఆవాహయామి ||

ఆసనం –

సురాసురశిరోరత్న ప్రదీపిత పదాంబుజ |

కేదారదేవ మద్దత్తమాసనం ప్రతిగృహ్యతామ్ ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ఆసనం సమర్పయామి ||

పాద్యం –

గంగాధర నమస్తేఽస్తు త్రిలోచన వృషధ్వజ |

మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమః ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి ||

అర్ఘ్యం –

అర్ఘ్యం గృహాణ భగవన్భక్త్యా దత్తం మహేశ్వరః |

ప్రయచ్ఛమే మనస్తుష్టిం భక్తానామిష్టదాయకం ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనం –

మునిభిర్నారద ప్రఖ్యైః నిత్యమాఖ్యాతవైభవ |

కేదారదేవ భగవన్ గృహాణాచమనం విభో ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనం సమర్పయామి |

మధుపర్కం –

కేదారదేవ భగవన్ సర్వలోకేశ్వర ప్రభో |

మధుపర్కం ప్రదాస్యామి గృహాణ త్వం శుభానవై ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః మధుపర్కం సమర్పయామి ||

పంచామృతస్నానం –

స్నానం పంచామృతైర్దేవ తతశ్శుద్ధోదకైరపి |

గృహాణ గౌరీరమణ తద్భక్తేన మయార్పితమ్ |

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి |

క్షీరం –

ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ |

భవా వాజస్య సంగథే ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః క్షీరేణ స్నపయామి |

దధి –

దధిక్రావ్ణోఅకారిషం జిష్ణోరశ్వస్య వాజినః |

సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్ ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః దధ్నా స్నపయామి |

ఆజ్యం –

శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు-

అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః |

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ఆజ్యేన స్నపయామి |

మధు –

మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః |

మాధ్వీర్నః సన్త్వౌషధీః |

మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః |

మధుద్యౌరస్తు నః పితా |

మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‍ం అస్తు సూర్యః |

మాధ్వీర్గావో భవన్తు నః |

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః మధునా స్నపయామి |

శర్కరా –

స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే |

స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే |

స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే |

బృహస్పతయే మధుమాం అదాభ్యః |

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః శర్కరేణ స్నపయామి |

ఫలోదకం –

యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః |

బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్‍ం హసః ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ఫలోదకేన స్నపయామి ||

శుద్ధోదక స్నానం –

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన |

మహేరణాయ చక్షసే |

యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః |

ఉశతీరివ మాతరః |

తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |

ఆపో జనయథా చ నః |

నదీజలం సమాయుక్తం మయాదత్తమనుత్తమం |

స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోఽస్తు తే |

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి |

వస్త్రయుగ్మం –

వస్త్రయుగ్మం సదాశుభ్రం మనోహరమిదం శుభం |

దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యతామ్ ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –

స్వర్ణయజ్ఞోపవీతం చ కాంచనం చోత్తరీయకం |

రుద్రాక్షమాలయా యుక్తం దదామి స్వీకురు ప్రభో ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –

సమస్త గంధ ద్రవ్యాణాం దేవత్వమసి జన్మభూః |

భక్త్యా సమర్పితం ప్రీత్యా మధుగంధాది గృహ్యతాం ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః గంధాన్ సమర్పయామి |

అక్షతాన్-

అక్షతోఽసి స్వభావేన భక్తానామక్షతం పదం |

దదాసి నాథ మద్దత్తైః అక్షతైః ప్రీయతాం భవాన్ ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పపూజ –

కల్పవృక్షప్రసూనైస్త్వం పూర్వైరభ్యర్చితస్సురైః |

కుంకుమై పార్థివైరేభిరిదానీమర్చతాం మయా ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః పుష్పాణి సమర్పయామి |

తతః ఇంద్రాది లోకపాలకపూజాం కుర్యాత్ ||

శివస్య దక్షిణేభాగే బ్రహ్మణే నమః |

ఉత్తరభాగే విష్ణవే నమః |

మధ్యే కేదారేశ్వరాయ నమః |

అథ అంగపూజా –

ఓం మహేశ్వరాయ నమః – పాదౌ పూజయామి |

ఓం ఈశ్వరాయ నమః – జంఘే పూజయామి |

ఓం కామరూపాయ నమః – జానునీ పూజయామి |

ఓం హరాయ నమః – ఊరూం పూజయామి |

ఓం త్రిపురాంతకాయ నమః – గుహ్యం పూజయామి |

ఓం భవాయ నమః – కటిం పూజయామి |

ఓం గంగాధరాయ నమః – నాభిం పూజయామి |

ఓం మహాదేవాయ నమః – ఉదరం పూజయామి |

ఓం పశుపతయే నమః – హృదయం పూజయామి |

ఓం పినాకినే నమః – హస్తాన్ పూజయామి |

ఓం శివాయ నమః – భుజౌ పూజయామి |

ఓం శితికంఠాయ నమః – కంఠం పూజయామి |

ఓం విరూపాక్ష్యాయ నమః – ముఖం పూజయామి |

ఓం త్రినేత్రాయ నమః – నేత్రాని పూజయామి |

ఓం రుద్రాయ నమః – లలాటం పూజయామి |

ఓం శర్వాయ నమః – శిరః పూజయామి |

ఓం చంద్రమౌళయే నమః – మౌళిం పూజయామి |

పశుపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి |

అష్టోత్తరశతనామావళిః

ఓం శివాయ నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం శంభవే నమః |
ఓం పినాకినే నమః |
ఓం శశిశేఖరాయ నమః |
ఓం వామదేవాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం కపర్దినే నమః |
ఓం నీలలోహితాయ నమః | 

ఓం శంకరాయ నమః |
ఓం శూలపాణినే నమః |
ఓం ఖట్వాంగినే నమః |
ఓం విష్ణువల్లభాయ నమః |
ఓం శిపివిష్టాయ నమః |
ఓం అంబికానాథాయ నమః |
ఓం శ్రీకంఠాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం భవాయ నమః | 

ఓం శర్వాయ నమః |
ఓం త్రిలోకేశాయ నమః |
ఓం శితికంఠాయ నమః |
ఓం శివాప్రియాయ నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం కపాలినే నమః |
ఓం కామారయే నమః |
ఓం అంధకాసురసూదనాయ నమః |
ఓం గంగాధరాయ నమః | 

ఓం లలాటాక్షాయ నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం కృపానిధయే నమః |
ఓం భీమాయ నమః |
ఓం పరశుహస్తాయ నమః |
ఓం మృగపాణయే నమః |
ఓం జటాధరాయ నమః |
ఓం కైలాసవాసినే నమః |
ఓం కవచినే నమః | 

ఓం కఠోరాయ నమః |
ఓం త్రిపురాంతకాయ నమః |
ఓం వృషాంకాయ నమః |
ఓం వృషభారూఢాయ నమః |
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః |
ఓం సామప్రియాయ నమః |
ఓం స్వరమయాయ నమః |
ఓం త్రయీమూర్తయే నమః |
ఓం అనీశ్వరాయ నమః | 

ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః |
ఓం హవిషే నమః |
ఓం యజ్ఞమయాయ నమః |
ఓం సోమాయ నమః |
ఓం పంచవక్త్రాయ నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం విశ్వేశ్వరాయ నమః | 

ఓం వీరభద్రాయ నమః |
ఓం గణనాథాయ నమః |
ఓం ప్రజాపతయే నమః |
ఓం హిరణ్యరేతసే నమః |
ఓం దుర్ధర్షాయ నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం గిరిశాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం భుజంగభూషణాయ నమః | 

ఓం భర్గాయ నమః |
ఓం గిరిధన్వనే నమః |
ఓం గిరిప్రియాయ నమః |
ఓం కృత్తివాససే నమః |
ఓం పురారాతయే నమః |
ఓం భగవతే నమః |
ఓం ప్రమథాధిపాయ నమః |
ఓం మృత్యుంజయాయ నమః |
ఓం సూక్ష్మతనవే నమః | 

ఓం జగద్వ్యాపినే నమః |
ఓం జగద్గురువే నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం మహాసేనజనకాయ నమః |
ఓం చారువిక్రమాయ నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం భూతపతయే నమః |
ఓం స్థాణవే నమః |
ఓం అహిర్బుధ్న్యాయ నమః | 

ఓం దిగంబరాయ నమః |
ఓం అష్టమూర్తయే నమః |
ఓం అనేకాత్మనే నమః |
ఓం సాత్త్వికాయ నమః |
ఓం శుద్ధవిగ్రహాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం ఖండపరశవే నమః |
ఓం అజాయ నమః |
ఓం పాశవిమోచకాయ నమః | 

ఓం మృడాయ నమః |
ఓం పశుపతయే నమః |
ఓం దేవాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం హరయే నమః |
ఓం పూషదంతభిదే నమః |
ఓం అవ్యగ్రాయ నమః |
ఓం దక్షాధ్వరహరాయ నమః | 

ఓం హరాయ నమః |
ఓం భగనేత్రభిదే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం అపవర్గప్రదాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం తారకాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః | 

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి |

సూత్రగ్రంథి పూజ –

ఓం శివాయ నమః – ప్రథమ గ్రంథిం పూజయామి |

ఓం శాంతాయ నమః – ద్వితీయ గ్రంథిం పూజయామి |

ఓం మహాదేవాయ నమః – తృతీయ గ్రంథిం పూజయామి |

ఓం వృషభద్వజాయ నమః – చతుర్థ గ్రంథిం పూజయామి |

ఓం గౌరీశాయ నమః – పంచమ గ్రంథిం పూజయామి |

ఓం రుద్రాయ నమః – షష్ట గ్రంథిం పూజయామి |

ఓం పశుపతయే నమః – సప్తమ గ్రంథిం పూజయామి |

ఓం భీమాయ నమః – అష్టమ గ్రంథిం పూజయామి |

ఓం త్ర్యంబకాయ నమః – నవమ గ్రంథిం పూజయామి |

ఓం నీలలోహితాయ నమః – దశమ గ్రంథిం పూజయామి |

ఓం హరాయ నమః – ఏకాదశ గ్రంథిం పూజయామి |

ఓం స్మరహరాయ నమః – ద్వాదశ గ్రంథిం పూజయామి |

ఓం భర్గాయ నమః – త్రయోదశ గ్రంథిం పూజయామి |

ఓం స్వయంభువే నమః – చతుర్ధశ గ్రంథిం పూజయామి |

ఓం శర్వాయ నమః – పంచదశ గ్రంథిం పూజయామి |

ఓం సదాశివాయ నమః – షోడశ గ్రంథిం పూజయామి |

ఓం ఈశ్వరాయ నమః – సప్తదశ గ్రంథిం పూజయామి |

ఓం ఉగ్రాయ నమః – అష్టాదశ గ్రంథిం పూజయామి |

ఓం శ్రీకంఠాయ నమః – ఏకోనవింశతి గ్రంథిం పూజయామి |

ఓం నీలకంఠాయ నమః – వింశతి గ్రంథిం పూజయామి |

ఓం మృత్యుంజయాయ నమః – ఏకవింశతి గ్రంథిం పూజయామి |

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి |

ధూపం –

దశాంగ ధూపముఖ్యం చ హ్యంగార వినివేశితం |

ధూపం సుగంధైరుత్పన్నం త్వాం ప్రీణయతు శంకర ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ధూపమాఘ్రాపయామి |

దీపం –

యోగినాం హృదయేష్వేవ జ్ఞానదీపాంకురోహ్యసి |

బాహ్యదీపో మయాదత్తః గృహ్యతాం భక్తగౌరవాత్ ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి |

ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ||

నైవేద్యం –

త్రైలోక్యమపి నైవేద్యం తత్తే తృప్తిస్తథా బహిః | నైవేద్యం భక్తవాత్సల్యాత్ గృహ్యతాం త్ర్యంబకం త్వయా ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ |

భర్గో దేవస్య ధీమహి |

ధియో యోనః ప్రచోదయాత్ ||

సత్యం త్వా ఋతేన పరిషించామి

(సాయంత్రం – ఋతం త్వా సత్యేన పరిషించామి)

అమృతమస్తు | అమృతోపస్తరణమసి |

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః _____ నివేదయామి |

ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా |

ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |

అమృతాపిధానమసి |

ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి |

పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |

తాంబూలం –

నిత్యానందస్వరూపస్త్వం యోగిహృత్కమలే స్థితః |

గృహాణభక్త్యా మద్దత్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ |

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి |

పునరర్ఘ్యం –

అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యాదత్తం మహేశ్వర |

ప్రయచ్ఛ మే మనస్తుష్టిం భక్తానామిష్టదాయకం ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః పునరర్ఘ్యం సమర్పయామి |

నీరాజనం –

కర్పూరం చంద్రసంకాశం జ్యోతిస్సూర్యమివోదితం |

భక్త్యా దాస్యామి కర్పూర నీరాజనమిదం శివ ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నీరాజనం సమర్పయామి ||

నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ||

మంత్రపుష్పం –

ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః |

భవే భవే నాతిభవే భవస్వ మామ్ |

భవోద్భవాయ నమః ||

ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః ||

అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః | సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ||

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి | తన్నో రుద్రః ప్రచోదయాత్ ||

ఈశానస్సర్వవిద్యానామీశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాఽధిపతిర్బ్రహ్మణోఽధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః సువర్ణమంత్రపుష్పాంజలిం సమర్పయామి |

ప్రదక్షిణం –

భూతేశ భువనాధీశ సర్వదేవాదిపూజిత | ప్రదక్షిణం కరోమి త్వాం వ్రతం మే సఫలం కురు ||

యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ | తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః | త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

నమస్కారాన్ –

హరః శంభో మహాదేవ విశ్వేశాఽమరవల్లభ |

శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోఽస్తు తే ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః నమస్కారాన్ సమర్పయామి |

పునః పూజ –

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః |

ఛత్రమాచ్ఛాదయామి | చామరాభ్యాం వీజయామి |

నృత్యం దర్శయామి | గీతం శ్రావయామి |

వాద్యం ఘోషయామి | ఆందోళికానారోహయామి |

అశ్వానారోహయామి | గజానారోహయామి |

సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార

శక్త్యుపచార మంత్రోపచార పూజాస్సమర్పయామి ||

ప్రార్థన –

అభీష్టసిద్ధిం కురు మే శివాఽవ్యయ మహేశ్వర |

భక్తానాం వరదానార్థం మూర్తీకృత కళేబర ||

ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి |

సూత్రగ్రహణం –

కేదార దేవదేవేశ భగవన్నంబికాపతే |

ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్ణామ్యహం ప్రభో ||

సూత్రగ్రహణం కరిష్యే ||

తోరబంధన మంత్రం –

ఆయుశ్చ విద్యాం చ తథా సుఖం చ

సౌభాగ్యవృద్ధిం కురు దేవదేవ |

సంసార ఘోరాంబునిధౌ నిమగ్నం

మాం రక్ష కేదార నమో నమస్తే |

తోరబంధనం కరిష్యే ||

వాయనదానం –

కేదారః ప్రతిగృహ్ణాతు కేదారో వైదదాతి చ |

కేదారస్తారకోభాభ్యాం కేదారాయ నమో నమః ||

వాయనదానం కరిష్యామి ||

ప్రతిమాదానం –

కేదారః ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ |

తస్మాదస్యాః ప్రదానేన మమాఽస్తు శ్రీరచంచలా |

ఇతి ప్రతిమాదానమంత్రః ||

వ్రత కథ –

శ్రీ కేదారేశ్వర వ్రత కథ సూతపౌరాణికుండు శౌనకాది మహర్షులం గాంచి యిట్లనియె. “ఋషి పుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యముల గలుగంజేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్ధము పొందినదియునగు కేదారేశ్వర వ్రతమనునదొకటి గలదు. ఆ వ్రతవిధానమును వివరించెద వినుండు.

దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శుద్రాదులు ఆచరించవచ్చును. ఈ వ్రతమును ఇరువదియొక్క మారులాచరించువారు సకల సంపదలనుభవించి పిదప శివసాయుజ్యము నొందుదురు. ఓ మునిశ్రేష్ఠులారా! ఈ వ్రతమహాత్మ్యమును వివరించెద వినుండు.

భూలోకంబునం దీశాన్యభాగమున మెరుపుగుంపులతో గూడియున్న శరత్కాల మేఘములంబోలు నిఖిలమణివిచిత్రంబైన శిఖరములచేతను, పలుతెరంగులైన లతావిశేషముల చేతను, బహువిధములగు పుష్ప ఫలాదులచేతను, నానావిధములైన పక్షులచేతను మరియు ననేకములైన కొండకాలువలచేతను వ్యాప్తంబయి సాలతమాల రసాలహింతాల వకుళాశోక చందన దేవదారు నారికేళామ్ర పనస నాగపున్నాగ చంపకాది వృక్షముల చేతను, నానాతరు విశేషముల చేతను భాసిల్లునట్టి యుద్యాన వనములచేత ప్రకాశించుచు నిఖిల కల్యాణప్రదంబై సర్వజన నమస్కృత్యంబై కైలాసమని పేర్కొనబడిన ఒక పర్వతశ్రేష్ఠము గలదు.

అంత షడ్గుణైశ్వర్య సంపన్నులను, మహామహనీయులు నగు యోగులచేతను, సిద్ధగంధర్వ కిన్నర కింపురుషాదులచేతను సేవింపబడి, మనోహరంబైయున్న యా పర్వతశిఖరమందు జగత్కర్తయైన పరమేశ్వరుండు ప్రమథగణములచే పరివేష్టింపబడి భవాని సమేతుండై సకల దేవముని బృందములచేత నమస్కరింపబడుచు ప్రసన్నుండై కూర్చుండి యొక సమయమున చతుర్ముఖాది దేవతల కందరికి దర్శనమిచ్చెను.

అంత సూర్యాగ్ని పవనులు, నక్షత్రయుక్తుండయిన నిశాకరుండును, మరియు నింద్రాది దేవతలును, వశిష్ఠాది మహర్షులును, రంభ మొదలగు అప్సరసలును, బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలును, సేనానియు, గణపతియును, తత్సారూప్యమును బొందియున్న నంది భృంగి మొదలగు ప్రమథ గణములును దన్ను పరివేష్ఠించి కొలుచుచుండ నట్టి భవానీవల్లభుని యత్యద్భుతంబగు సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు స్వామి అనుజ్ఞవడసి గానము చేసిరి.

అట్టి రమణీయంబును శ్రావ్యంబునగు గానము ప్రవర్ధిల్లుచుండగా ఘృతాచీ మేనకాదులు వీణాది చతుర్విధ వాద్యములతో, లయలతో కూడిన నృత్య మొనర్చిరి. అప్పుడా వేల్పు బానిసలలోన మిక్కిలి సొగసుకత్తెయగు రంభ నిఖిల సురబృందముల యొక్క యల్లములు రంజిల్లునటుల నాట్యమొనరించెను. ఆ సమయమున భృంగిరిటి యనెడి భక్తవరుండు ఆ స్వామి సన్నిధి యందాయనకు ప్రీతి కలుగునట్లుగా వికట నాట్యము చేయగా అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాస్యము జనించెను.

అటువంటి ఆశ్చర్యంబగు హాసముల వలన నప్పుడా పర్వత గుహలు నిండునటుల గొప్ప కలకల ధ్వని కలిగెను. ఇట్లు హాస్యము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుండు ఆ భృంగిరిటినింజూసి నీచేత మిగుల హర్షప్రవర్ధంబైన నాట్యము చేయబడెనని సెలవిచ్చి ముదంబంది యా భక్తుని అనుగ్రహించెను.

అంతట నా భృంగిరిటికి శివానుగ్రహంబు గలుగుటం చేసి యతండు ప్రీతుండై సకల విబుధులచే గౌరవింపబడి సమాహితచిత్తుండై వినయంబుతో గూడి, యా పార్వతీదేవిని వదలి, ఈశ్వరునికి మాత్రము ప్రదక్షిణ నమస్కారము లొనరించెను.

అప్పుడు పార్వతి చిరునగవుతో గూడినదై తన పతియగున ప్పరమేశ్వరుని వీక్షించి “ఓ స్వామీ! ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణము నాచరించుటకు కారణమేమి! విన వేడుకగా నున్నది. ఆనతీయవే” యని వేడగా నా సదాశివుడు

“ఓ ప్రియురాలా!

చెప్పెద వినుము.

పరమార్థ విదులగు యోగులకు నీవలన బ్రయోజనంబు లేమింజేసి, నాకు మాత్రమే నమస్కరించె” నని చెప్పెను.

ఆ మాటలకు పరమేశ్వరి మిగుల వ్రీడనుపొంది, భర్తయందున్న తన శక్తి నాకర్షించగా నా స్వామి త్వగ స్థ్వ్యావశిష్ట మా త్రావయవుండాయె. అంత నా దేవియు సారహీనురాలై వికటురాలాయెను.

పిదప నాదేవి కోపించి దేవతలచేత నూరడింపబడినదైనను, కైలాసమును వదలి తపం బొనరించుటకు బహువిధంబులగు సింహ శరభ శార్దూల గజమృగాదులచే సేవింపబడునదియు నిత్యవైర ముడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువులచే నిబిడంబగు నదియు, నానావిధ వృక్షలతా గుల్మాది భూయిష్టంబయి ఋషిశ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్టప్రదంబై యొప్పుచున్న గౌతమాశ్రమమును ప్రవేశించెను.

అంత నా గౌతముండు వన్యంబులై హోమయోగ్యంబులగు సమిత్కుశ ఫలాదులను సంగ్రహించుకొని వనమునుండి వచ్చునెడ దన యాశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును జూచి ఋష్యాశ్రమం బగునది ఇట్లు శోభిల్లుచున్నదేమా యని విస్మయం బంది దత్కారణము చింతుంచుచు ఆశ్రమము ప్రవేశించి తామర రేకులవంటి కన్నులు గలిగి యలంకృతురాలై యున్న యా మహేశ్వరిం గనుగొని

“పూజ్యురాలైన ఓ భగవతీ ! నీ విచ్చటి కేతెంచుటకు కారణంబే” మని అడుగగా, నా దేవియు ఆ జడధారికి తన విషాద కారణమును వచించి నమస్కరించి, “ఓ మునీశ్వరా! ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో, యే వ్రతానుష్ఠానముచేత శంకర దేహార్ధము నాకు ఘటించునో అటువంటి వ్రతము నుపదేశింపుము” అనగా ఆ మహర్షి సకల శాస్త్రపురాణావలోకనం బాచరించి యీప్సితార్థప్రదంబగు శ్రీమ త్కేదార నామకంబైన ఉత్తమ వ్రతము నాచరింపుమని ఉపదేశించెను.

అంత నా దేవియు నావ్రతానుష్ఠానక్రమము ఆనతీయవేయని వేడగా ఇటులని చెప్పదొడంగెను.

“అమ్మా! భాద్రపద శుక్లాష్టమియందు శుద్ధమనస్కురాలవై మంగళకరములగు నేకవింశతి తంతువులచేత హస్తమునందు ప్రతిసరమును ధరించి, పూజించి, యా దినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీ వ్రతము నిటుల సలుపుచు ప్రతిదినము నందును శ్రీమత్కేదార దేవు నారాధింపవలయును.

మరియు నింటియందు శుభ్రంబగు ఒక ప్రదేశమున ధాన్యరాశిలో పూర్ణకుంభము నుంచి, ఇరువదియొక్క సూత్రములచేత జుట్టి, పట్టుపుట్టములచేత కప్పియుంచి, నవరత్నములు గాని శక్తికొలది సువర్ణమును గాని ఉంచి గంధపుష్పాక్షతలచే నర్చించి ఇరువదియొక్కమంది బ్రాహ్మణులను పిలిపించి పాదప్రక్షాళనాది కృత్యము లాచరించి కూర్చుండ నియోగించి, అచట ఆ కేదార దేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగరు కస్తూరీ కుంకుమాదులను, శ్రీగంధమును, నానావిధ పుష్పములను తాంబూలములను వస్త్రములనుంచి నివేదన మొనరించి,

యథాశాస్త్రముగ ధూపదీపాదులచే నర్చించి, ఏకవింశతి సంఖ్యాకంబులయిన చోష్యలే హ్యాదులను కదళీ పనసామాద్రి ఫలములను నైవేద్యముజేసి, తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రముజేసి, బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి వ్రతమును లెస్సగా ననుష్ఠించి ఈశ్వరునికి మనస్సంతుష్టి చేసినయెడల, యా వృషభధ్వజుండు ప్రీతుండై నీవు కోరిన వరము లియ్యగలడు” అని వచించిన నా కాత్యాయినియు నటులేయగుగాక యని ఆచరించెను.

అంత పరమశివుండు సంతుష్టాంతరంగుడై అచటికి దేవగణముల తోడం జని “నా శరీరార్ధమును నీకు ఇచ్చెద” నని ఇవ్వగా, నా పార్వతీదేవి యుప్పొంగి శంకర దేహార్ధమును బొంది లోకానుగ్రహము జేయదలంచి దన పతియగు పరమశివునితో “నీవ్రతము నాచరించువారలకు సకలాభీష్టసిద్ధి గలుగునటుల అనుగ్రహించితిరేని ఎల్ల వారు నాచరింతు” రనగా, నటులే యగుగాక యని అంగీకరించి శివుడు సురసంఘములతో కూడ నచ్చట నంతర్హితుండయ్యె.

మరి కొంతకాలమునకు శివభక్తి యుక్తుండగు చిత్రాంగదుండను గంధర్వుండు నందికేశ్వరుని వలన నావ్రతచర్యా క్రమంబెరిగి మనుష్య లోకమునకుంజని వారలకు ఉపదేశింప వలయునని నిచ్ఛగలవాడై యుజ్జయినీ పట్టణమును జేరి వజ్రదంతుడను రాజునకు ఆ వ్రతమును ఉపదేశింప, అతడు ఆ వ్రతమును కల్పోక్తప్రకారంబుగ నాచరించి సార్వభౌముండాయెను. మరికొంత కాలమునకు నా పట్టణమున నున్న వైశ్యునకు పుణ్యవతియు, భాగ్యవతియు నను నిరువురు కుమార్తెలు గలిగిరి.

వారిద్దరును తండ్రిదగ్గరకు బోయి కేదార వ్రతమాచరించుట కానతీయుమని వేడగా నతడు “అమ్మా! నేను మిగుల దరిద్రుడను.

మీరా తలంపుమాను”డనగా “ఓ తండ్రీ! నీయనుజ్ఞయే మాకు పరమధనంబుగాన ఆనతీయు”మని సెలవు పుచ్చుకొని ఒక వటవృక్షము వద్ద కూర్చుండి ప్రతిసరము గట్టికొని యథావిధిగా పూజింప వారల భక్తికి మెచ్చి ఈశ్వరుడు వలయు సామగ్రి ని ఇచ్చెను.

అంతట వారలు చక్కగా వ్రతము నాచరించుట వలన ఆ మహాదేవుండు ప్రీతుండయి ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను, దివ్యరూపంబుల నొసంగి అంతర్ధానుండాయెను.

పిమ్మట నావ్రత మహాత్మ్యము వలన నుజ్జయినీ పట్టణమును నేలుచున్న రాజు పుణ్యవతియను కన్యను, చోళ భూపాలుడు భాగ్యవతియను కన్యను పాణిగ్రహణం బొనర్చికొనిరి.

అందువలన నావైశ్యుండు ధనసమృద్ధి గలిగి సామ్రాజ్య సంపదలను, పుత్రులను బొంది సుఖమున నుండెను.

కొన్నినాళ్ళ పిదప- రెండవదియైన భాగ్యవతి అనునది ఐశ్వర్య మదమోహితురాలై కొంత కాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనిమిటిచేత వెడలనంపబడి అడవిలో తిరిగి సంచారఖిన్నురాలై ఒక బోయవాని యిల్లు చేరెను.

అచ్చట పుత్రుని జూచి “నాయనా!

నా అక్కయగు పుణ్యవతిని ఉజ్జయినీ పురపు రాజు వివాహమాడి యున్నవాడు. నీ వచ్చటకిపోయి మన సంగతి నెరింగించి బ్రతుకు తెరువునకై తగినంత ధనము తీసికొని శీఘ్రముగా ర”మ్మనగా నంతడు ఆ పట్టణమునకు బోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుస్సహంబగు కష్టమును దెలుపగా నా పుణ్యవతియు నతని చేతికి విస్తారముగ ధనము నిచ్చెను.

అంత నాతడా ధనమును తీసుకొని వచ్చుచుండగా, మార్గమున నదృశ్యరూపుండైన ఆ దేవుని వలన నాధనం బపహరింప బడగా, నతడు మరలా పెద్దతల్లి కడకేతెంచి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనము సంగ్రహించుకొని వచ్చెను.

ఆ ధనము గూడా హరింపబడగా దోదూయమానసుండై నిలువంబడియున్న వానితో ఈశ్వరుం డదృశ్యుండై “ఓ చిన్నవాడా! వ్రతభ్రష్టులకు నీధనంబు గ్రహింప నలవికానిదని” చెప్పెను.

ఆ మాటలు విని విస్మయంబంది, ఆ చిన్నవాడు మరల ముందువలనే ఉజ్జయినీ పట్టణమునకుంజని ఈశ్వరోక్తంబగు వృత్తాంతమును పెద్దతల్లికి దెలుపగా నా పుణ్యవతి ఆలోచించి పుత్రునిచేత కేదార వ్రతంబు నాచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతము నాచరించు నటుల చెప్పవలయునని చెప్పి, ధనము నొసంగి పంపెను.

అతండు బయలుదేరి వచ్చునెడి మార్గంబున నప్రయత్నముగ ముందు గోలుపోయిన ధనమంతయు స్వాధీనమైనందున సంతోషించి, సర్వమునూ గ్రహించుకొని కాంచీపట్టణమును ప్రవేశించు సమయంబున చతురంగ బలములతోడ అతనితండ్రి ఎదుర్కోలుగా వచ్చి, ఆ బాలునీ అతని తల్లిని కూడా వెంట బెట్టుకొని తన పట్టణమునకుం జనియే.

అంతట నా రాకుమారుడు తల్లిదండ్రులతో గూడి సుఖముగా నుండెను.

పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును నదిమొదలు ఈ వ్రతము నాచరించుచు అవిచ్ఛిన్నంబగు సకల సంపద లనుభవించుచుండిరి.

ఎవరైనను యథోక్తప్రకారము నీవ్రతమహాత్మ్యమును భక్తియుక్తులై వినిన, జదివిన అట్టివారలందరును శ్రీమహాదేవుని అనుగ్రహము వలన అనంతంబులగు ఆయురారోగ్య యైశ్వర్యంబులను బొంది సుఖంబు లనుభవించి శివసాయుజ్యమును బొందుదురని గౌతమమహాఋషిచే జెప్పబడెనని సూతుండు శౌనకాదులకు జెప్పినట్లుగా శ్రీవ్యాసభట్టారకుడు స్కాంద పురాణమునం దభివర్ణించెను

సమర్పణం –

యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |

న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహేశ్వరం ||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ కేదారేశ్వర స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow