టీ జె పి ఎస్ కాలేజీ ని ప్రైవేట్ పరం చేయొద్దు రెండో రోజు క్లాసులు బైకాట్

Feb 8, 2022 - 18:51
Feb 8, 2022 - 19:29
 0
టీ జె పి ఎస్ కాలేజీ ని ప్రైవేట్ పరం చేయొద్దు రెండో రోజు క్లాసులు బైకాట్

రెండో రోజు క్లాసులు బైకాట్ చేసి గేట్లు మూసేసి ధర్నాకు దిగిన విద్యార్థులు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం కిరణ్ మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యం ఇప్పుడున్న ప్రిన్సిపాల్ మరియు కొంతమంది లెక్చరర్స్ తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని ఇలాంటి కేసులకు ఫిర్యాదులకు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భయపడరు అని ఆయన అన్నారు విద్యార్థులను అణచివేయాలని చూస్తే మరి ఇంత ఉద్యమం పెరుగుతుందని తెలిపారు .

టీ జె పి ఎస్ కాలేజ్ నీ పేద విద్యార్థులకు విద్యను అందించాలనే ఉన్నత ఆశయంతో నిర్మించారని కానీ ఇప్పుడు నా మేనేజ్మెంట్ విద్యార్థుల దగ్గర అధిక ఫీజులను వసూలు చెయ్యాలనే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ గా కొనసాగించు కోవచ్చు అని నాలుగో ఆప్షన్ ఇచ్చినా నా కాలేజీ యాజమాన్యం ప్రైవేట్ గా నడుపు ఉండేందుకు ముందుకెళ్తుందని ఈ పద్ధతి కొనసాగితే ఇప్పటి వరకు తక్కువ ఫీజులతో డిగ్రీ బీకాం మూడు వేల రూపాయలతో పూర్తి చేసే వాళ్ళు కానీ ప్రైవేటుపరం అయితే 15 వేల రూపాయల పైన చెల్లించాలని డిమాండ్ చేస్తారు .

ఇంటర్మీడియట్ రెండు వేల రూపాయలతో ఎయిడెడ్ కాలేజీలో పూర్తయితే ఇప్పుడు ప్రైవేటు పరమైతే 15 వేల రూపాయల పైన ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు కావున చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరమై ఎటువంటి పరిస్థితి ఉంటుంది.

తక్షణమే యజమాన్యం ఎయిడెడ్ కళాశాలగా కొనసాగిస్తామని ప్రకటించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర నాయకులు సందీప్ రూప స్ సుధీర్ సమీర్ భార్గవ వంశీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow