'టాప్స్' కింద, పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్‌కు ప్రత్యేక క్రీడాసామగ్రి మంజూరు

"టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్" (టాప్స్)లో భాగంగా ఉన్న క్రీడాకారుల ఆర్థిక సాయం ప్రతిపాదనలను పరిష్కరించడానికి, గతనెల 29న "మిషన్ ఒలింపిక్ సెల్" సమావేశమైంది. గుజరాత్‌కు చెందిన పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్‌ను గత నవంబర్‌లో టాప్స్‌లో చేర్చారు. ఆమె పెట్టుకున్న 7.04 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది. పటేల్, ప్రపంచ 8వ ర్యాంకు క్రీడాకారిణి. ఆ ర్యాంకుతో టోక్యో పారాలింపిక్స్‌కు అర్హత సాధించారు. పారా టేబుల్ టెన్నిస్‌లో ఈ విధంగా అర్హత సాధించిన మొదటి భారతీయురాలిగా గుర్తింపు సాధించారు.
పటేల్ అభ్యర్థించిన ఈ క్రింది ప్రత్యేక క్రీడాసామగ్రిని కమిటీ మంజూరు చేసింది:
i) టేబుల్ టెన్నిస్ వీల్ ఛైర్
ii) రోబోట్: బటర్‌ఫ్లై అమికస్ ప్రైమ్
iii) వీల్ ఛైర్ టేబుల్ టెన్నిస్ టేబుల్
పారా టేబుల్ టెన్నిస్ ఎఫ్4 విభాగంలో పటేల్ పోటీ పడతారు.
What's Your Reaction?






