ముఖ్యమంత్రి పర్యటన- ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ పోలీసుల సూచనలు 12 -1-2022

గుంటూరు నగరం లో- ys జగన్ మోహన్ రెడ్డి పర్యటన- వి.వి. రమణ కుమార్*. ట్రాఫిక్.డి.ఎస్.పి . గుంటూరు ఆర్బన్. గారి సమాచారం మేరకు, ట్రాఫిక్ అంతరాయం మరియు ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు..

Jan 11, 2022 - 14:07
 0
ముఖ్యమంత్రి పర్యటన- ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ పోలీసుల సూచనలు 12 -1-2022

ది: 12.01.2022 ( బుధవారం ) నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు . గుంటూరు నగరంలో పర్యటిస్తున్న కారణంగా గుంటూరు

అర్బన్ S. P. శ్రీ ఆరిప్ హాపిజ్. IPS. గారి ఉత్తర్వులు మేరకు 12.01.2022 తేది న ఉదయం 10.00 గంటల నుండి మద్యాహ్నం 12.30 గంటల వరకూ

నగరంపాలెం S.B.I జంక్షన్ నుండి పట్టాభిపురం .. స్తంభాలగరువు , గుజ్జనగుండ్ల , రింగ్ రోడ్డు లోని విద్యా నగర్ 3 న లైన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడును .

కావున వాహనదారులు పైన తెలిపిన మార్గంలో పైన తెలిపిన సమయంలో ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించి పోలీసులకు సహకరించవలసిందిగా కోరడమైనది . 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow