అకాల వర్షాలు, పెనుగాలులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: భావన్నారాయణ

ఆంధ్ర రాష్ట్రం లో ఏర్పడిన అకాల వర్షాలు, పెనుగాలులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: జనసేనపార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ

May 7, 2022 - 15:29
 0
అకాల వర్షాలు, పెనుగాలులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: భావన్నారాయణ

అకాల వర్షాలు, పెనుగాలులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: జనసేనపార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ. అసలే ఉత్పత్తివ్యయం ఎక్కువయి పోయి వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితుల్లో అకాల వర్షాలతో అస్తవ్యస్తమైన రైతుకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి అని గుంటూరు జిల్లా జనసేనపార్టీ అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ అన్నారు.

నిన్నసాయంత్రం సంభవించిన పెనుగాలులతో కూడిన అకాల వర్షాలకు పల్నాడులోని పలుప్రాంతాల్లో అరతితోటలు, పండ్లతోటలు నేలకూలడం దురదృష్టకర పరిణామం అని ఆయన విచారం వ్యక్తం చేశారు.

మనిషన్న ప్రతివారూ తమ వృద్ధాప్యంలో చేదోడుగా ఉంటారని పిల్లలను కని ఎంత ప్రేమగా, అపురూపంగా పెంచుకుంటారో అటువంటి పిల్లల జీవితాలకు భరోసా కోసం ప్రతిరైతు వ్యవసాయం మీద ఆధారపడతారు కనుక ఆయాచితంగా ఇచ్చే ఉచిత నగదు పంపిణీ పథకాలకంటే అన్నంపెట్టే రైతన్నను ఆపత్కాలంలో ఆదుకోవడం ఎంతో అవసరం అని, ఒక్క పల్నాడులోనే కాదు నిన్నటి వైపరీత్యంలో నష్టపోయిన ప్రతి రైతుకుటుంబానికి తక్షణ ఆర్థికసాయంతో పాటు పంటబీమా వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఆయన డిమాండ్ చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow