ప్రపంచానికి, భవిష్య తరాలకు అరుదైన బహుమానం- పంచ వేద సంహిత వేద భగవాన్ గ్రంధ ఆవిష్కరణ - Prof. చండ్రపాటి

పరివ్రాజకాచార్య రాష్ట్ర సంత బిరుదాన్విత(అంతర్జాతీయ మహా స్వామీజీ) శ్రీ శ్రీ శ్రీ శ్రీశ్రీ స్వామి శివాత్మానంద సరస్వతుల పంచ వేద సంహిత వేదభగవాన్ అనే ఈ గ్రంథాన్ని మన దేశానికి మరియు ప్రపంచానికి అందించడానికి శ్రీ స్వాములవారు జన్మించారు అని భావించవచ్చు.
మన వైశ్వకర్మణ సమాజంలో గతంలో ఎవరూ ఇటువంటి మహత్కార్యము చేయలేదు. మా గురువుగారైన వేదబ్రహ్మశ్రీ ఆచార్య చంద్రపాటి నాగవర ప్రసాదరావు ప్రొఫెసర్ గారు 5 వేదాలను ఒకే బృహత్తర గ్రంథంగా రూపొందించాలని అనుకుంటున్నాను అని స్వామివారికి చెప్పారు. అందుకు మన స్వాములవారు నాకు విడిచి పెట్టండి నేను పూర్తి చేస్తాను అని అని చెప్పి శుభస్య శీఘ్రం అంటూ ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
ఇందుకోసం పూరి ధామము ఒరిస్సా లో గల మా గురువుగారైన ప్రొఫెసర్ చండ్రపాటి వారి స్వగృహానికి రెండుసార్లు పది పది రోజులు కాలం వైదిక చర్చలు జరిపేందుకు వెళ్లి వచ్చారు. ప్రొఫెసర్ చండ్రపాటి వేద వేదాంత ప్రొఫెసర్‌గా పనిచేసిన కాలంలో భారతదేశంలోని అన్ని సంస్కృత విశ్వవిద్యాలయాలలో ఉత్తమ బోధకునిగా పనిచేస్తూ వేదాంతం ప్రస్థాన త్రయము ఉపన్యాసము చేస్తూ చివరిగా పూరిలో గల సంస్కృత విశ్వవిద్యాలయం లో వైస్ ఛాన్సలర్గా సేవలందించి పదవి నుండి నివృత్తులు (రిటైర్మెంట్) అయ్యారు.
ఆయన శిష్యులు మంచి పేరున్న పండితులు. వారిలో చాలా మంది ఘనాపాటి లు అవధానులు ఉత్తమ వ్యాకరణ పండితులు కూడా ఉన్నారు. మా స్వామీ శివాత్మానంద సరస్వతి గారు ఋషికేశ్‌లోని దయానంద ఆర్షవిద్యా గురుకులంలో సుమారు 16 సంవత్సరములు కాలము శుక్ల యజుర్వేదాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రస్థానత్రయం (భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు మరియు ఉపనిషత్తులు) అధ్యయనం చేసి మన జాతి ఉద్ధరణ కోసం వైదిక అభివృద్ధికై విశ్వకర్మ వంశ బ్రాహ్మణ యతీంద్రులు అయిన స్వామి శివ సుజ్ఞాన సరస్వతి తీర్థులు విశ్వకర్మ సంపణ్మూలపీఠం , అరకలగూడు, అరేమాదనహళ్ళి, హాసనజిల్లా, కర్నాటక వారి వద్ద సన్యాస దీక్షను తీసుకున్నారు.
అప్పుడు శిల్ప శాస్త్రాన్ని బోధించే మాయొక్క గురువైన డాక్టర్ జి జ్ఞానానందులు గారు వారి పూర్వీకులు తపస్సు ఆచరించిన సిద్ధన గవి అనే గుహలో నివసించే అవకాశాన్ని ఇచ్చారు. సిద్ధన గవి అనే గుహ నంది బెట్ట పర్వత శ్రేణులలో నందిగ్రామము చిక్కబళ్లాపూర్ జిల్లా కర్ణాటక లో కలదు. శ్రీ శివాత్మానంద స్వాములు సిద్ధన గవి వద్దకు వచ్చేసరికి ఆ ప్రాంతము అడవిలా కనిపించేది.
జన సామాన్యులు నివసించేందుకు సౌకర్యంగా లేదు. ఆ గుహ మరియు పరిసర ప్రాంతాలు నివాసయోగ్యంగా మార్చడానికి మన శ్రీ స్వాములవారు దాదాపు రూ. 30 నుండి 40 లక్షలు ఖర్చు చేసి ఆకర్షణీయమైన మనోహరము సుందర ప్రాంతము గా రూపొందించారు.,అక్కడ నుండి హిందూ ధర్మ ప్రచారానికి బయలుదేరారు.
ఈ ప్రచారంలో ఆయన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ వేద వేదాంత పాఠములు మన భారతదేశంలోనే కాకుండా విదేశాలకు ఫ్రాన్స్ మరియు జర్మనీ మొదలైన దేశాలకు కూడా వెళ్లారు. అంతరాష్ట్ర స్థాయిలో మంచి ఉత్తమ ధర్మ గురువులు అనిపించుకున్న మన శ్రీ శివాత్మానంద సరస్వతుల వారు ఇప్పుడు మనకు దూరమగుట మనందరి దురదృష్టంగా భావించవచ్చు.
నాకు మరియు మన స్వామి వారితో నాకున్న సంబంధం చాలా ప్రేమపూర్వకమైనది. శ్రీ శివాత్మానంద స్వామి గారు నన్ను స్థపతిలుగా గుర్తించి అందరికీ ఆస్థాన స్థపతులుగా పరిచయం చేసేవారు. సుమారు మూడు సంవత్సరాల క్రితం, శ్రీ స్వాములవారు నన్ను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణులకు తీసుకెళ్లారు, అక్కడ ఉత్తరకాశీలోని నేతాల, తపోవనంలో నా చేతులతో శివలింగ ప్రతిష్ఠాపన చేయించారు .
ఈ సందర్భంగా ఈ చోట దేవీ నవరాత్రులలో 21 రోజులు మా స్వాములవారు, నేనూ చండీ యాగం లో పాల్గొనడం జరిగినది. అక్కడ స్థానిక ఋత్విక్కులు స్వామిని ప్రమానంద వారు నా యొక్క సంధ్యావందనం అగ్నిహోత్రము అనుష్టానములు పరిశీలించి ఆ యాగము లో బ్రహ్మ స్థానం ఇచ్చి గౌరవించారు.
ఇందుకు స్వామి వారు చాలా సంతోషించి దేవ గురువు రథ కారుడైన బృహస్పతి వృత్తాంతమును మరియు స్థపతి యొక్క లక్షణాలను నన్ను ఉదాహరణగా చూపిస్తూ ఉపన్యాసం చేశారు. తరువాత స్వామివారితో కలిసి హృషీకేశ్ హరిద్వార్ గంగోత్రి వంటి ప్రదేశాలను సందర్శించాము.
ఆ తర్వాత మరో సందర్భంలో గుజరాత్లో గల డాకోరు పట్టణంలో విశ్వకర్మ దేవాలయం లో మూల విశ్వకర్మ విగ్రహానికి స్వర్ణ కవచ ధారణ మహోత్సవం జరుపుకోవడానికి నన్ను, మాగడి కృష్ణ శ్రౌతి, ఉత్తర కర్ణాటకకు చెందిన కొంతమందిని వైశ్వకర్మణ మఠాధిపతులను తీసుకుని వెళ్లారు .
తిరుగు ప్రయాణంలో నేను ఒక రోజు అహ్మదాబాద్‌లోని విశ్వకర్మ ఆలయంలో బస చేసి, ఆ దేవాలయం వారు నిర్వహిస్తున్న హాస్టల్ లో గల ఇంజనీరింగ్ పదవిలో ఉన్న వైశ్వకర్మణ విద్యార్థులకు మరియు దేవాలయం ట్రస్ట్ యొక్క ప్రముఖులకు విశ్వబ్రాహ్మణ వైదిక చరిత్ర జాగృతికి వైశ్వకర్మణ అవగాహన తరగతిని సుదీర్ఘంగా 7 గంటల కాలము ను నిర్వహించాను .
అలాంటి అవకాశం మాకు ఇచ్చింది శ్రీస్వామీజీ వారే. పూజ్యలైన స్వామి శివాత్మానంద స్వామి వారు నివాసం ఉండే జ్ఞానానంద ఆశ్రమానికి సమీపంలో నంది గ్రామ ప్రజలు కట్టించిన శ్రీ శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం కోసం ఒక రాతి విగ్రహాన్ని నాచే చేయించి ఒక స్థపతి గా ప్రతిష్టాపన కూడా నా చేతుల మీదుగా చేయించారు.
ఆరు నెలల క్రితం దక్షిణామూర్తి శిలా విగ్రహాన్ని ఆర్ష విద్య గురుకులం దయానంద ఆశ్రమము రిషికేశ్ వారి కోసం తయారు చేయమని ఆదేశించారు. మరియు ఆర్ష విద్యా గురుకుల ఋషికేశ్‌లో స్వామివారి యొక్క గురువులు ప్రతిష్టించారు.
చివరగా పంచ వేద సంహిత వేదభగవాన్ అనే మహత్తరమైన గ్రంథము కోసం యజ్ఞానికి సంబంధించిన దశ ఆయుధములు మరియు పంచ ఋషుల చిత్రాలను వ్రాయమని ఆదేశించారు. ఆ చిత్రంలో లో మహా గ్రంథంలో ముద్రించి వాటి క్రిందన నా పేరును కూడా వేయించారు.
స్వామి వారు నాతో మాట్లాడుతూ అప్పుడప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణాలో వైశ్వకర్మణ ఆచార జాగృతి వైదిక చరిత్ర అవగాహన శిబిరాలు చేస్తున్నారు కర్ణాటకలో కూడా అవకాశం కల్పించి కే జి ఎఫ్ పట్టణం నుండి ప్రారంభిద్దాం అని నాతో చెప్పి , కే జి ఎఫ్ గ్రామ విశ్వబ్రాహ్మణ ప్రముఖులతో మాట్లాడడం జరిగింది.డిసెంబర్25న పుస్తకం విడుదల తరువాత ఈశిబిరము చేయుటకు నిర్ణయించారు.
అంతలోనే డిసెంబర్15 2021 లో ఆకస్మిక ప్రమాదానికి గురై నన్ను మరియు నాకుటుంబానికి కర్ణాటక విశ్వకర్మ వంశ బ్రాహ్మణులందరినీ దుఃఖసాగరములో విడిచి పరమాత్మ విశ్వకర్మ సాయుజ్యం పొందారు.
స్వామివారు పంచవేద సంహితలో వ్రాసిన 200 పేజీలకు పైగా వ్రాసిన ముందుమాట ఆయన వైదిక జ్ఞానానికి ఆంగ్ల భాష ప్రతిభకు ప్రతిబింబం. ఇది వారికి ఇంగ్లీషులో మంచి పరిజ్ఞానం నిరూపిస్తుంది. ఈ ముందుమాటలో స్వామి వారు రచించిన అనేక అంశాలు మన చండ్రపాటి గురువు గారి ఉపదేశితాలే.
అలాంటి స్వామివారి ప్రేమ అభిమానం ఆశీస్సులు లభించడం అదే సమయంలో చంద్రపాటి గురువుగారి ప్రేమాభిమానాలు కూడా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం వ్రాయడానికి సహకరించిన నా వేద వేదాంత గురువు ప్రొఫెసర్ వేదబ్రహ్మ శ్రీ చంద్రపాటి నాగవర ప్రసాదరావు గారిని, మా స్వామీజీలను కూడా పరిచయం చేసుకునే భాగ్యం కలిగింది.
ఈ పుస్తకాన్ని ముద్రించడానికి ప్రొఫెసర్ చండ్రపాటి ఆచార్యులు ఒక లక్ష రూపాయలు ధనాన్ని, 50 వేల విలువైన వేదాలను మన స్వామీజీ వారలకు అందించారు. ఇటువంటి గ్రంథం అం విడుదల సమయంలో నా ప్రియమైన స్వామి శివాత్మానంద సరస్వతి శ్రీవారు లేరు అనే దుఃఖం .
10 - 4- 2022 న ఈ గొప్ప గ్రంథ రాజము ఆవిష్కరణ కనకపుర రోడ్డు బెంగుళూరు లో గల రవిశంకర్ గురూజీ ఆశ్రమం ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో ప్రముఖులు మహా జ్ఞానులు మహా స్వాముల సమక్షంలో వైభవోపేతంగా జరిగింది . ఇది సకల హిందూ ప్రజలకు శుభవార్త గా తెలియజేయుచున్నాను. ఇట్లు మీ ప్రియమైన వేదబ్రహ్మశ్రీ ఆచార్య టి మోహనరావు శర్మ, స్థపతి, బెంగళూరు. 9341265719
What's Your Reaction?






