విశ్వ బ్రాహ్మణుల గురించి వైదిక చరిత్ర ఏం చెబుతుంది?- TMR SHARMA

అప్పుడు యావత్ భూమండలాన్ని పరిపాలించిన చక్రవర్తి భువన విశ్వకర్మ చక్రవర్తి. ఆయన కాలములో దేవతలు మానవులు కలిసి భూమిపైనే నివసించేవారు. అంటే దేవత నికి మానవులకి కలిపి పరిపాలించిన చక్రవర్తి అన్నమాట.. వేదబ్రహ్మశ్రీ ఆచార్య టి మోహనరావు శర్మ ,

విశ్వ బ్రాహ్మణుల గురించి వైదిక చరిత్ర ఏం చెబుతుంది?- TMR SHARMA

వేదము అద్వైతాన్ని చెబుతుంది. ఎలా అంటే అంతా కూడా శూన్యం నుంచి వచ్చిన సృష్టి. సృష్టికర్త పరమాత్మ విశ్వకర్మ. మానవులే కాదు దేవతలు కూడా పరమాత్మను మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు. సత్య యుగ ప్రారంభ కాలంలో మనం నివసించే భూమంతా ఒకే ఖండంగా ఉండేది.

అప్పుడు యావత్ భూమండలాన్ని పరిపాలించిన చక్రవర్తి భువన విశ్వకర్మ చక్రవర్తి. ఆయన కాలములో దేవతలు మానవులు కలిసి భూమిపైనే నివసించేవారు. అంటే దేవత నికి మానవులకి కలిపి పరిపాలించిన చక్రవర్తి అన్నమాట. తర్వాత అతని పుత్రుడు భౌవన విశ్వకర్మ చక్రవర్తిగా దేవతలకు మానవులకు యావత్ భూమండలానికి పరిపాలించాడు. ఇతను ఋగ్వేదంలో అనేక మంత్రాలకి ద్రష్టగా కూడా ఉన్నాడు.

ఇతని గురించి చాలా ఋగ్వేద సూక్తాలు ఆ కాలపు విషయాలు తెలుపుతాయి మానవుల కంటే దేవతల శక్తివంతుల కనుక కొంత మంది మానవులు దేవతలు ఆరాధిస్తూ ఉండాలి. అద్వైత తత్వాన్ని అర్థం చేసుకున్న మానవుల మాత్రమే పరమాత్మ ఆరాధిస్తారు ఏక దేవోపాసన చేస్తారు. ఇక శిల్పులు వరకు వస్తే శిల్పులు వైదికులు అద్వైత తత్వాన్ని పాటిస్తూ ప్రచారం చేసే వాళ్ళు.

శిల్పులు లోక కల్యాణం కోసం ఎవరికి ఏమి కావలసి వచ్చినా చేసి ఇస్తారు. వేదకాలంలో విగ్రహారాధన లేకుండా ఉండేది. ఆప్పట్లో దేవతలు మానవులు కూడా యజ్ఞాల ద్వారానే పరమాత్మను ఆరాధించేవారు. తరువాత యుగాలు మారినవి. దేవతలు భూలోకంలో నుండి వేరేలోకాలకు వెల్లవలసి వచ్చింది.

అప్పుడు నిశ్శక్తులైన మానవులకు మన విశ్వకర్మ వంశ దేవతలకు సమానమైనవారైనటువంటి అంగీరసులు ,ఋభువులు ,కశ్యప భరద్వాజ ఆది మాహాత్ములు లోక సంగ్రహం చేసి మానవులకు కాపాడినట్లుగా వేదంచెబుతోంది.తరువాత కాలంలో గౌతమ బుద్ధుడు కాలము తరువాత ఆయన విగ్రహారాధనను అంగీకరించకపోయినా ఆ మతస్తులు బౌద్ధ స్థూపాలు బుద్ధుడు విగ్రహాలతో శిల్పాలు తయారు చేయిస్తూ మత ప్రచారం చేశారు.

అప్పుడు ధర్మ సంరక్షణ కోసం జగద్గురువులు వాళ్ల ప్రయత్నంగా ఆర్య ద్రావిడ వాదం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది ఏంటంటే వాళ్ళ కు అనుగుణంగా అప్పుడే పురాణాలు వ్రాయడం జరిగింది. దానితో విశ్వకర్మ వంశ బ్రాహ్మణులను అణచివేతకు గురి చేసే కుట్రలు కుతంత్రాలు ఆ కాలం నందే ప్రారంభమయ్యాయి.

దారుణమైన విశ్వకర్మ వంశ బ్రాహ్మణుల మారణకాండను జరిపించారు . కొన్ని లక్షల మందిని పిల్లలు స్త్రీలు అని చూడకుండా చంపించి వేశారు. తత్ఫలితంగా తీవ్రమైన క్షామాము అతివృష్టి అనావృష్టి లతో చాలామంది చనిపోయిన తర్వాత తప్పు తెలుసుకున్న ప్రజాప్రతినిధులు వైశ్వకర్మణులు కొరకు అన్వేషణ చేసారు.

కొన్నాళ్ళకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎక్కడో తలదాచుకున్న శిల్పులను వెతికి శిల్ప శాస్త్రాలను రచింప చేసి, విగ్రహారాధన దేవాలయ నిర్మాణాలు ప్రారంభించారు.

ప్రస్తుతం మనమంతా ఆ విధంగా మిగిలిన వాళ్ళమే మనలో చాలామంది విజ్ఞానవంతులు మహాపురుషుల అంతా మా భారత దేశాన్ని విడిచి వెళ్లిపోయారు కొంత మంది హత్య చేయబడ్డారు అంతర్ధానము కాబడ్డారు చివరకు ఇలా పౌరాణిక శక్తుల సాహిత్య సాంఘీక దాడులు ఎదుర్కొంటూ మనము మిగిలి ఉన్నాము, మనకి ప్రధాన శత్రువులు పౌరాణికులే, ఎందుకంటే వేదాలలో విశ్వకర్మ వంశ బ్రాహ్మణుల గురించి అతి గొప్పగా వర్ణిస్తూ కీర్తిస్తూ సూక్తాలు మంత్రాలు తో అత్యున్నత స్థాయిలో గుర్తింపబడి మానవులలో శ్రేష్ఠులు గా ఉన్న వారిని పురాణ కర్తలు అతి నీచంగా ఆ బ్రాహ్మణత్వాన్ని ఆపాదిస్తూ అబద్ధపు ప్రచారం చేసి ప్రజల మనసుల్ని కలుషితం చేసారు ఈ విషయాన్ని మనం గమనించి ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని నా యొక్క అభిప్రాయం చెబుతున్నాను. ధన్యవాదాలు.

ఇట్లు మీ యొక్క ప్రియమైన .

వేదబ్రహ్మశ్రీ ఆచార్య టి మోహనరావు శర్మ ,

స్థపతి, బెంగళూరు.9341265719