వరాహ రూపం విశ్వకర్మదే కృష్ణయజుర్వేదం 7-1-5 - TMR SHARMA

వేద బ్రహ్మ శ్రీ ఆచార్య మోహన రావు శర్మ, వరాహ రూపం విశ్వకర్మదే అని కృష్ణయజుర్వేదం 7-1-5 లో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వరాహ రూపం విశ్వకర్మదే  కృష్ణయజుర్వేదం 7-1-5 - TMR SHARMA
Varaha murthi,

వరాహ రూపం విశ్వకర్మదే అని కృష్ణయజుర్వేదం 7-1-5 లో తెలియజేయుచున్నది. దీని ఆధారంగా విశాఖపట్నం దగ్గర్లో గల అతి గొప్పదైన సింహాచల పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న దేవస్థానం అనే పేరుతో పిలవబడుతోంది.

(Simhadhri appanna) 

Als Read This:- ఇది కూడా చదవండి :- గాయత్రీ దేవత కాదు - గాయత్రి అంటే వ్యాకరణం- గాయత్రీ కి స్త్రీ రూపం ఇచ్చి పూజించడం నిరుపయోగం

దేవాలయం యొక్క స్థపతి సింహాద్రి అప్పన్న ఆచార్యుల వారు వేద జ్ఞానం సంపూర్ణంగా తెలిసినవారని, అందుకే ఆ వేద మంత్రము ఆధారంగా విశ్వకర్మ యొక్క వరాహ రూపమున విగ్రహమును తయారు చేశారు అని వేదాధ్యయనము చేసి శిల్ప శాస్త్రము లను అధ్యయనం చేసి శిల్ప శాస్త్రాలను బోధిస్తున్న స్థపతిగా నా యొక్క అభిప్రాయం.

ఇంకా ప్రపంచములో ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానములు దేవాలయ సముదాయంలో ప్రధాన దేవాలయమైన వేంకటాద్రిపై వెలసిన శ్రీ వేంకటేశ్వరుని ఆలయ దర్శనము ఒక విశేషము తో కూడి ఉన్నది.

ఆలయ పుష్కరిణి ప్రక్కన ఉన్న వరాహ స్వామిని ముందుగా దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనాదిగా ఆచారంగా వస్తున్నది. ఈ వరాహ మూర్తి కూడా సింహాద్రి అప్పన్న స్వామి మూల మూర్తి వెంకటేశ్వర అ స్వామి కి అనుసంధానంగా చారిత్రకమైన సంబంధం ఉందని చెబుతుంటారు.

నిజానికి వెంకటాద్రి వరాహస్వామి కి సంబంధించినది. వెంకటేశ్వరుడు వేంకటాద్రిపై వెలిచేందుకు వరాహ స్వామి అనుమతి ఇచ్చినట్లు గాను స్థలపురాణాలు చెబుతున్నాయి. అంటే వెంకటేశ్వరుని కంటే ముందు అక్కడ కొలువై ఉన్న వరాహ స్వామి ఆదివరాహుడే. అనగా కృష్ణ యజుర్వేదము 7:1:5 ప్రకారము వరాహ రూపం దాల్చి భూమి పైకి తీసుకు వచ్చిన పరమాత్మ విరాట్ విశ్వకర్మయే అని స్పష్టంగా కనిపిస్తుంది.

అందుకే పరమాత్మ విరాట్ విశ్వకర్మ యొక్క వరాహ రూపాన్ని దర్శించకుండా వేంకటేశ్వరుని దర్శనం పాపం వస్తుందని మరియు పుణ్యక్షేత్ర సందర్శనం వ్యర్థం అవుతుందని స్థల పురాణము చెబుతున్నది దాన్ని ప్రజలు విశ్వాసముతో మరియు భక్తితో నేటికీ అనుసరిస్తూ ఉన్నారు.

ఆ వేద మంత్రం ఏవిధంగా చెబుతుందో ఒకసారి చూద్దాం. “ఆపోవా ఇదమగ్రే సలిలమాసితాస్మిన్ ప్రజాపతిర్వాయుర్భూత్వా అచరత్. స ఇమామ్ అపస్యత్, తాం వరాహో భూత్వా ఆహరత్.

తాం విశ్వకర్మ భూత్వా వ్యమార్ట్ సాఽప్రథత సా పృథివ్యభవత్తత్పృథివ్యై పృథివిత్వం తస్యామశ్రామ్యత్ ప్రజాపతిః. స దేవానసృజత వసూన్రుద్రానాదిత్యాన్తే దేవాః ప్రజాపతి మబ్రువన్ప్రజాయామహా ఇతి సోఽబ్రవీత్౹౹ (1)

యథాఽహం యుష్మాగ్మ్ంస్థపప్తాఽసృక్ష్యేవం తపసి ప్రజాననమిచ్ఛధ్వమితి తేభ్యోఽగ్నిమాయాతనం ప్రాయచ్ఛదేతేనాఽఽయతనేన శ్రామ్యతేతి తేఽగ్నినాఽఽయతనేనాశ్రామ్యన్తే....... || (2)

(అథ కృష్ణయజుర్వేదం - 7 కాండే 1 ప్రపాటకే, 5అనువాకాః)

ఇదే విదంగా ఇందులో ఎనిమిది మంత్రములు కలవు.

తాత్పర్యము : - మనం చూసే విశ్వము (అనగా జగత్తు భూమి అని నానార్థములు )మొత్తం జలమయమై ఉండేది. మరియు మనం నిలబడి ఉన్న భూమి సలిలముతో కప్పబడి ఉంటుంది.. "ఇందుకు పూర్వం జలమును సృష్టించినది విశ్వకర్మయే అని ఋగ్వేదం -10 వ మండలము 82 సూక్తము 1 వమంత్రము తెలుపుతున్నది."

ఋగ్వేదం యజుర్వేదము కంటే పురాతనమైనది. భూమి నీటితో కప్పబడి మరియు నివాసయోగ్యం కాని కారణంగా, విశ్వకర్మ వాయురూపము ధరించి నలుమూలల శోధించెను.

ఆవిధంగా ప్రయాణిస్తున్నప్పుడు అతను నీటిలో భూమిని కనుగొన్నాడు.

విశ్వకర్మ భగవంతుడు శ్వేత వరాహ రూపము ధరించి తన కోరలతో ఈ భూమిని పైకి తీసుకుని వచ్చెను. విశ్వకర్మ అప్పుడు త్వష్టవిశ్వకర్మప్రజాపతి సాకార రూపాన్ని ధరించాడు మరియు భూమి పైనుండే నీటిని తుడిచివేసి, భూమిని విస్తరించాడు, (పృథ్వీ = విస్తారము అనే అర్థం కూడా ఉంది) ఆ భూమికి అప్పుడు పృథ్వీ అని పేరు పెట్టారు.

అది ఇప్పుడు మనం నిలబడి ఉన్న నేల.

అద్భ్యస్సంభూతః పృథివ్యై రసాశ్చ విశ్వకర్మణః సమవర్తతాధి, తస్య త్వష్టా విదధద్రూపమేతి..... అని పురుషసూక్తముయొక్క ఋక్కుననుసరించి జలతత్త్వమునుండి పృథ్వీ తత్త్వానికి తీసుకువచ్చినది పరమాత్మ పురుషుడైన విశ్వకర్మ అనే సత్యము ఋజువు అవుతుంది.

విశ్వకర్మ ప్రజాపతి కొంతకాలం విశ్రమించెను.తరువాత భూమిపై ఎనిమిది మంది వసువులలు, ఏకాదశ రుద్రులు మరియు ద్వాదశ ఆదిత్యులను వీరందరికీ పరపాలకుడు ఇంద్రుడు ఆయనపై ప్రజాపతిని సృష్టించారు, దీన్నిబట్టి పౌరాణికులు వేదానికి విరుద్ధంగా పురాణాలను వ్రాసి ప్రజలను నమ్మించి పరమాత్మ విరాట్ విశ్వకర్మను ప్రజలకు దూరం చేసి పౌరాణిక దేవతలను ఆ స్థానంలో ఆరాధించే విధంగా పురాణాలను అందులో కల్పిత పాత్రలను తయారుచేసి వేద ద్రోహానికి మోసానికి పాల్పడ్డారు అని తెలుస్తుంది.

మీ వేద బ్రహ్మశ్రీ ఆచార్య టి మోహన్ రావు శర్మ, స్థపతి, వేదధ్యాయి, శిల్ప శాస్త్ర పండితులు , శిల్ప శాస్త్ర ఉపన్యాసకులు, జ్యోతిష్య విద్వాన్, నాడీ జ్యోతిష్యులు, వాస్తు శాస్త్ర నిపుణులు సంఖ్యా శాస్త్ర నిపుణులు పురోహిత ఆధ్వర్యులు. బెంగళూరు . 9341265719.