బస్సు ప్రయాణం లో మహిళ చెయ్యి తెగి పోయింది. WOmam Losthand in bus journey in Andhra

Woman lost hand, bus journey woman hand cut, lady handcut in bus,

May 17, 2022 - 20:21
May 17, 2022 - 20:23
 0
బస్సు ప్రయాణం లో మహిళ చెయ్యి తెగి పోయింది. WOmam Losthand in bus journey in Andhra
Woman lost Hand in bus journey in andhra hand cut off

ఆర్టీసీ బస్సులో ప్రయణిస్తున్న ఓ మహిళ నిద్రపోతూ పొరపాటున చేతిని బయటపెట్టింది. అయితే కొద్దిసేపటికే ఆమె చేయి తెగిపడింది. వివరాల్లోకి...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం నడిమికెల్లకు చెందిన పేలూరి పైడితల్లి అనే మహిళ..

శనివారం శ్రీకాకుళం (Srikakulam) లోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికెళ్లేందుకు శ్రీకాకుళం నుంచి పాలకొండ వరకు బస్సులో వచ్చింది. పాలకొండ నుంచి పార్వతీపురం వెళ్లేందుకు పల్లెవెలుగు బస్సు ఎక్కింది. 

బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చేతులు బయటపెట్టరాదు అని రాసి ఉంటుంది. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం పొరబాటునో, లేకుంటే ఆదమరిచి చేతులు బయటపెడుతుంటారు. కొందరు ఏకంగా తలే కిటికీలో నుంచి బయటపెట్టి జర్నీని ఎంజాయ్ చేయాలని చూస్తారు. కానీ డ్రైవర్లు మాత్రం వెంటనే వారిని వారిస్తారు.

డ్రైవర్ వెనుక వరుసలోని విండో సీట్ లో కూర్చుంది. బస్సు బయలుదేరిన కాసేపటికే కునుకుతీసింది. ఈ క్రమంలో చేయి బయటకు పెట్టింది. బస్సు వీరఘట్టంలోని హైస్కూల్ వద్దకు చేరుకునేసరికి ఎదురుగా వస్తున్న ఆటో బస్సుకు రాసుకుంటూ వెళ్లింది.

ఆటో పై భాగంలో ఉండే ఇనుప రాడ్డు గలడంతో ఆమె చేయి తెగిపడిపోయింది. పైడితల్లి కేకలు వేయడంతో స్పందించిన ప్రయాణికులు ఆమెకు సపర్యలు చేసి వీరఘట్టం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow