ఆంధ్ర మహాసభ

Mar 4, 2021 - 06:07
 0
ఆంధ్ర మహాసభ
andhra maha sabha in telugu

ఆంధ్ర మహాసభ - సంయుక్త మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతములో జరిగిన ఆంధ్ర మహాసభలు. ఆంధ్రమహాసభ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు అస్తిత్వాన్ని పెంపొందించడానికి, తమిళుల ఆధిపత్యాన్ని అడ్డుకోవటానికి ప్రారంభమైన ఒక సాంస్కృతిక సంస్థ. ఈ ఆంధ్రమహాసభలే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి బీజాలు వేశాయి.

ప్రారంభ నేపథ్యం

చాలా ఉద్యమాల మాదిరిగానే చరిత్ర, రచనలు, పత్రికలు ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి పునాదులు నిర్మించాయి. 1911లో ‘తెలుగు ప్రజల నేటి పరిస్థితి’ శీర్షికతో హిందూ పత్రిక ఆరు వ్యాసాలు ప్రచురించింది. ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులను ఎంత చిన్నచూపు చూస్తున్నారో వాటితో వెల్లడించింది. కొద్ది నెలల ముందు చిలుకూరి వీరభద్రరావు రచన ‘ఆంధ్రుల చరిత్ర’ను విజ్ఞాన చంద్రికా మండలి 1910లో ప్రచురించి అప్పటికే ఒక అవగాహన తెచ్చింది. జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, చట్టి నరసింహారావు 1911లో ఆంధ్ర దేశ చిత్రపటం రూపొందించారు. 1912లో కొండా వెంకటప్పయ్య, కె.గురునాథం ఆంధ్రోద్యమం’ అన్న చిన్న పుస్తకం ప్రచురించి, ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి సూచనలు చేశారు.

1912 మే నెలలో వేమవరపు రామదాసు అధ్యక్షతన నిడదవోలులో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకుల సమావేశం జరిగింది. ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చించాలని ఈ సమావేశంలోనే చట్టి నరసింహారావు సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, సైన్యంలో, ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులకు అవకాశం కల్పించాలని కూడా తీర్మానించారు. ఈ భావనలకు ‘దేశాభిమాని’, ‘భరతమాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘కృష్ణాపత్రిక’ మద్దతు పలి కాయి.

నిడదవోలు సభ నిర్ణయం మేరకు 1913, జూన్‌ 26న బాపట్లలో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింది. ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వేమవరపు రామదాసు ప్రతిపాదించారు. కానీ ఇలాంటి తీర్మానానికి సమయమింకా ఆసన్నం కాలేదని, వచ్చే సమావేశాలలో చర్చిద్దామని పలువురు పెద్దలు వాయిదా వేశారు. విశాఖ ఉత్తర ప్రాంతాలు, గంజాం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేకత ఉండేది. ఈ అంశంలో ఆ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, వారిని కూడా సానుకూలురను చేసుకోవాలని సభ అభిప్రాయపడింది. తొలి ఆంధ్ర మహాసభ సమావేశాలు 1913లో బాపట్లలో జరిగాయి. ఆ సభకు రెండు వేల మంది అతిధులు, 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభకు కోస్తా, రాయలసీమ ప్రతినిధులతో పాటు, నాగపూరు, వరంగల్, హైదరాబాదులనుండి కూడా ప్రతినిధులు వచ్చారు. ఆంధ్రమహాసభ కాంగ్రేసు పార్టీతో సన్నిహితంగా పనిచేస్తు ఉండేది. 1943లో క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న తరుణంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది.

సమావేశాలు (from Wiki pedia) 

సంవత్సరము ప్రదేశం అధ్యక్షులు
1913 బాపట్ల బయ్యా నరసింహేశ్వరశర్మ
1914 విజయవాడ న్యాపతి సుబ్బారావు
1915 విశాఖపట్నం పానగల్ రాజా
1916 కాకినాడ మోచర్ల రామచంద్రరావు
1917 నెల్లూరు కొండా వెంకటప్పయ్య
1918 (ప్ర.స)[2] గుంటూరు కాశీనాథుని నాగేశ్వరరావు
1918 కడప నెమిలి పట్టాభి రామారావు
1919 అనంతపురం గాడిచర్ల హరిసర్వోత్తమరావు
1920 మహానంది ఆర్కాట్ రంగనాథ మొదలియారు
1921 బరంపురం రాజా కోటగిరి వెంకటకృష్ణారావు (గంపలగూడెం జమీందారు)
1922 చిత్తూరు వేదం వెంకటరాయశాస్త్రి
1924 మద్రాసు కట్టమంచి రామలింగారెడ్డి
1925 మచిలీపట్నం సామి వెంకటాచలం శెట్టి
1926 ఏలూరు మేకా వెంకటాద్రి అప్పారావు, వుయ్యూరు జమిందారు
1927 అనంతపురం ఓ. లక్ష్మణస్వామిరావు
1928 నంద్యాల సర్వేపల్లి రాధాకృష్ణన్
1929 విజయవాడ కె.కోటిరెడ్డి
1931 గుంటూరు వి.వి.జోగయ్య
1931 (ప్ర.స.)[2] మద్రాసు కె.కోటిరెడ్డి
1932 విజయవాడ కె.వి.రెడ్డినాయుడు
1934 (ప్ర.స.)[2] విశాఖపట్నం దేశపాండ్య సుబ్బారావు
1936 కాకినాడ వేమవరపు రామదాసు
1937 విజయవాడ కె.కోటిరెడ్డి (రజతోత్సవ సమావేశం)
1938 మద్రాసు సర్వేపల్లి రాధాకృష్ణన్
1939 గుంటూరు మాడభూషి అనంతశయనం అయ్యంగారు
1941 విశాఖపట్నం పూసపాటి విజయానంద గజపతి రాజు
1943 బళ్ళారి పూసపాటి విజయానంద గజపతి రాజు
1947 (ప్ర. స.) గుంటూరు ఉయ్యూరు కుమార్ రాజావారు
1951 గుంటూరు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow