ముస్లింలపై చంద్రబాబు చిత్తశుద్ధి ఇదేనా- సయ్యద్ నూరుద్దీన్

Dec 3, 2020 - 23:30
Dec 4, 2020 - 12:31
 0
ముస్లింలపై చంద్రబాబు చిత్తశుద్ధి ఇదేనా- సయ్యద్ నూరుద్దీన్

ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్: సలాం కుటుంబానికి న్యాయం జరగలేదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం అవివేకమన్నారు. నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనలో టీడీపీ రాజకీయం చేయడం మానుకోవాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ అన్నారు.

విజయవాడ రూరల్ మండలం ప్రసాదం పాడులో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘గత నెల 3న అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఘటన జరిగిన నెల రోజుల్లో సలాం కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారా ? ఇదే నా ఆయనకు ముస్లింల పై ఉన్న చిత్తశుద్ధి’ అని ప్రశ్నించారు. ఈ ఘటనపై టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం హాస్యాస్పద మన్నారు.

ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారని, బాధ్యులపై కేసులు కూడా పోలీసులు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ హయాంలో గుంటూరు పోలీస్‌స్టేషన్‌ ఘటన, నారా హమారా టీడీపీ హమారా సభలో ముస్లిం యువకులు ప్లకార్డులు ప్రదర్శిస్తే దేశద్రోహం కేసులు పెట్టారు. అప్పుడు టీడీపీ నేతలకు ముస్లింలు గుర్తులేదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను చంద్రబాబు  వాడుకుంటున్నారని సయ్యద్ నూరుద్దీన్ దుయ్యబట్టారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow