ఆంజనేయ  దండకం 

Dec 3, 2020 - 07:39
Jul 20, 2021 - 07:58
 0
ఆంజనేయ  దండకం 

ఆంజనేయ  దండకం 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాఞ్జనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్  ప్రభాతంబున్  
సాయన్త్రమున్ నీ నామ సంకీర్తనల్  జేసి
నీ రూపు వర్ణించి  నీ మీద నే దణ్డకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిన్  గాంచి  నీ సుందరం బెంచి నీ దాస దాసుండనై
రామ భక్తుణ్డనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షమ్బునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరా లించితే  నన్ను రక్షించి తే
ఆంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ   నే నెన్త వాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మన్త్రివై
స్వామి కార్యార్థమై యేగి


శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు పూజించి  యబ్భానుజుం బంటు  గావించి 

వాలినిన్ జంపించి  కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి 


కిష్కిన్ధకేతెంచి  శ్రీరామ కార్యార్థమై లంక  కేతెంచియున్
లంకిణిన్ జమ్పియున్ లంక నున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానన్దముప్పొంగి యాఉంగరం బిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సన్తోషమున్^^జేసి
సుగ్రీవునిన్ అంగదున్  జామ్బవన్తు లున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్^మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుఞ్చగా రావణుణ్డన్త కాలాగ్ని రుద్రుణ్డుగా వచ్చి
బ్రహ్మాణ్డమైనట్టి యా శక్తినిన్^వైచి యాలక్షణున్ మూర్ఛనొన్దిమ్పగానప్పుడే నీవు
సఞ్జీవినిన్^దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణమ్బు రక్షిమ్పగా
కుమ్భకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారన్దరిన్ రావణున్ జమ్పగా నన్త లోకమ్బు లానన్దమై యుణ్డ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకమ్బు చేయిఞ్చి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యన్తన్నయోధ్యాపురిన్^జొచ్చి పట్టాభిషేకమ్బు సంరమ్భమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరఞ్చు మన్నిఞ్చి శ్రీరామభక్త ప్రశస్తమ్బుగా
నిన్ను సేవిఞ్చి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్^ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సమ్పత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మన్దార యోపుణ్య సఞ్చార యోధీర యోవీర
నీవే సమస్తమ్బుగా నొప్పి యాతారక బ్రహ్మ మన్త్రమ్బు పఠియిఞ్చుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహమ్బునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయఞ్చున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయన్దుణ్డి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సఞ్చారివై రామ
నామాఙ్కితధ్యానివై బ్రహ్మతేజమ్బునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమన్త ఓఙ్కార శబ్దమ్బులన్ భూత ప్రేతమ్బులన్ బెన్
పిశాచమ్బులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యమ్బులన్
నీదు వాలమ్బునన్ జుట్టి నేలమ్బడం గొట్టి నీముష్టి ఘాతమ్బులన్
బాహుదణ్డమ్బులన్ రోమఖణ్డమ్బులన్ ద్రుఞ్చి కాలాగ్ని
రుద్రుణ్డవై నీవు బ్రహ్మప్రభాభాసితమ్బైన నీదివ్య తేజమ్బునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్చు న్ దయాదృష్టి
వీక్షిఞ్చి నన్నేలు నాస్వామియో యాఞ్జనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow