బలరామ జయంతి సందర్భంగా ఘనంగా రైతు దినోత్సవం - భారతీయ కిసాన్ సంఘ్

రైతులకు సరైన సమయంలో సేవలు అందిస్తున్న విద్యుత్ సిబ్బంది J L M ఈర రాజేష్ గారికి రైతుల సమక్షంలో సన్మానం చేశారు. దిగుమతులు విషయంలో స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంది ...

భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జగిత్యాల జిల్లా రైతులు.

భగవాన్ శ్రీ బలరామ జయంతి సందర్భంగా మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో జండా ఆవిష్కరణ చేసి రైతు దినోత్సవం జరుపుకున్నారు. నుంచి పశువులు దూరమవుతున్న సమయంలో పశు పోషణ చేస్తున్న సారా మోహన్ రెడ్డి గారికి మరియు , రైతులకు సరైన సమయంలో సేవలు అందిస్తున్న విద్యుత్ సిబ్బంది J L M ఈర రాజేష్ గారికి రైతుల సమక్షంలో సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ కిషన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి D రవి గారు మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు , దిగుమతులు విషయంలో స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉందని, వ్యవసాయ శాఖ, వాణిజ్య శాఖ సమన్వయంతో పని చేయాల్సి ఉందన్నారు.