రాష్ట్రాలకు PDRD నిధులను విడుదల చేసిన కేంద్రం

Jul 9, 2021 - 09:48
 0
రాష్ట్రాలకు PDRD నిధులను విడుదల చేసిన కేంద్రం

పదిహేడు రాష్ట్రాలకు పీడీఆర్‌డీ ( Post Devolution Revenue Deficit ) Funds విడుదల చేసిన కేంద్రం . 

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 17 రాష్ట్రాలకు చెందిన  నాలుగో విడత పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు రూ .9,871 కోట్లను గురువారం రోజున విడుదల చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను అర్హత గల రాష్ట్రాలకు మొత్తం 39,484 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు మంజూరు చేయబడుతుంది.

15 వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల రెవెన్యూ ఖాతాలలో అంతరాన్ని భర్తీ చేయడానికి ఈ గ్రాంట్లను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది.

2021-22 మధ్య కాలంలో 17 రాష్ట్రాలకు పీడీఆర్‌డీ గ్రాంట్లను ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రూ .1,18,452 కోట్ల పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.

ఇప్పటివరకు రూ .39,484 కోట్లు (33.33 శాతం) నాలుగు విడతలుగా విడుదలయ్యాయి.

ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రాష్ట్రాల్లో  ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow